Wednesday, October 31, 2007

తేట తెలుగు పలుకు

కొత్తపాళీ గారు,. రానారె గారు వ్రాసిన తెలుగులో బీభత్సానికి నా జోడింపు.

ఉ. వాళ్ళకి వాల్లు; కళ్ళకట మారును కల్లుగ; హవ్వ! వాణియా
నోళ్ళబడంగ వానియగు; నోళ్ళిక నోల్లయినిల్వ నిట్టి యా
రళ్ళవె కర్ణభేరులకు ఱంపపుకోతల కూతలవ్వ
, యె
న్నాళ్ళు భరించుటంచు చెడునాల్కెలనెల్లను చీరివేతువా?

ఆ.వె. సల్పవచ్చునట్టి సాహసము తెగించి
తప్పులేదు కాని తరచి చూడ
మూగవారు తప్ప మిగలరెవ్వరు మరి
చివరకు మన చిత్రసీమలోన*

చిత్రసీమ అని వ్రాసాను కాని, ఇది నేటి టీవికి రేడియోలకి కూడా వర్తిస్తుంది.

15 comments:

Anonymous said...

chaala baaga raasaaru ee madhya cinemaalu mute lo pettukuni choosaanu chevulaki ibbandi undakundaa guddivaade better anpinchindi aslu telugu cinemaalu choodadam kante torture ledemo

Sriram said...

adbhutamgaa raasaaru! :)

"vaaLLagu vaallu" idi okaTi maatram meeru anukunna ardham kaakunDaa "vaallu" - "VaaLLu" autaayi anE ardham vaccE avakaaSam undi.

teresa said...

భళీ!

రాఘవ said...

గిరిగారూ,
ఆ.వె.మంచిచేయుకొఱకు మనలోన యెవ్వరో
నడుముకట్టవలెను అంతవరకు
ఆంధ్రసీమలోన జరుగుతున్నట్టియీ
ఘోర తప్పిదాలు మారవేమొ!

రానారె said...

ఆశుకవి మీరు. అవధానం ఎప్పుడు చేయబోతున్నారు?

Anonymous said...

అదుర్సండీ బాబూ, అదుర్స్

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

వ్యాకరణంబు ఛందమును వాసిగఁ గావలె నన్నరోజు మీ
కీ కృతినిర్మితుల్ దెలియకే యటులంటిరటంచు నెంచితిన్ ;
చాకులవంటి పద్యములు చప్పున వ్రాసితిరయ్య బ్లాగులో
నాకిపుడర్థమైనది ఘనత్వము మీదియుఁ దేఁటతెల్లమై.

కొత్త పాళీ said...

మూగ వాళ్ళు కాదు, నోట్లో నాలిక లేని వాళ్ళు :-)

గిరీ, చమత్కారం బాగుంది. పద్యాల నడకని బాగా పట్టుకున్నారు. అభ్యాసము కూసు విద్య అన్నట్టు రాసిన కొద్దీ మీ పద్యాలు పదునెక్కుతున్నాయి.

గిరి Giri said...

అనామకం గారు, నెనరులు.

శ్రీరాం గారు, మొదటి పాదం సవరించాను.

సావిత్రి గారు నెనరులు.

రాఘవ గారు, నా పద్యంలోనూ “చిత్ర” పదం బదులు “ఆంధ్ర” వాడచ్చు..మీ భావం అదేనా? మీ పద్యం as usual బావుంది.

రానారె గారు, మునగ చెట్టు కొమ్మ మీద కూర్చోవడం బానే ఉందండి :)

వికటకవి గారు, నెనరులు.

బాలసుబ్రహ్మణ్యం గారు, ధన్యుణ్ణి. మీ ఈ వ్యాఖ్యాపద్యాన్ని రెండుమూడు సార్లు చదువుకుని మురిసిపోయాను..

కొత్త పాళీ గారు, ధన్యవాదాలు. కొంచెం కొంచెం పద్యాల నడక తెలుస్తోంది, కాని పట్టు రావాలంటే ఇంకా ఎంతో కృషి అవసరమనిపిస్తోంది. పైగా నా తెలుగు పదజాలాన్ని, సాహిత్య పరిజ్ఞానన్ని పెంచుకోవాల్సిన అవసరం చాల ఉంది.

ramana said...

http;//nijamga-nijam.blogspot.com

రాఘవ said...

(1) సంతోషం, పద్యాంతర్యాన్ని చక్కగా గ్రహించారన్నమాట :)
(2) వ్రాయండి -- వ్రాస్తుంటేనే భాష మెఱుగుపడేది

Anonymous said...

భీభత్సానికి...కాదు...బీభత్సానికి!
పద్యం బావుంది:-)

గిరి Giri said...

చ.చు, భీ ని బీ చేసాను..thanks!

rākeśvara said...

మీరు వ్రాసిందాంట్లో నిజంగా తప్పులేదా..
లేక నాకే మతి భ్రమించిందా.

ఇది ఉత్పలమాలే అంటున్నారు.
మొదటి మూడు పాదాలలో ఆఖరున తాననా(UIU) లేవు. (ఆఖరి పాదంలో వుందిలే)

ఇంకోసారి బొమ్మలు చూడగలరు.

Sorry for being a paapoo - party pooper :)

గిరి Giri said...

రాకేశ్వరా భ్రమించింది మీ మతి కాదు,నాది. మీరు ఎత్తి చూపిన తప్పు ముమ్మాటికి తప్పే..ఇప్పుడు సవరించాను, కాస్త చూడండి.