Friday, October 12, 2007

అలవోక సినీ పృఛ్ఛకం (Random cine quiz) – 7

ఈ సారి ప్రశ్నలు ఇవిగో.

1. తెలుగులో చిరంజీవి నటించిన ఈ చిత్రం పేరుతోనే దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం హిందిలో ఒక చిత్రం వచ్చింది. ఆ చిత్రం అనూహ్య విజయం వల్ల అందులోని హీరో హింది చలన చిత్ర రంగంలో కొన్నేళ్ళు ఒక వెలుగు వెలిగాడు. అందులోని పాటలన్ని చాలా ప్రాచుర్యం పొందాయి. వాటిలో భావోద్వేగ పూరితమైన పాట ఒకటి ఉంది. ఆ పాట చిత్రీకరణకి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటది?

క్లూ: భావోద్వేగం! తెలియలేదా? సరే, ఓ వర్షం కురిసిన రాత్రి!

2. రాకి (హింది), విక్రం (తెలుగు), ఆరెంజ్ కౌంటి (ఆంగ్లం) చిత్రాలకి ముడి వేయండి?

3. ఈ కధానాయకి మొదటి హింది చిత్రం ఒక తెలుగు చిత్రానికి రీమేక్. ఆ రెండు చిత్రాలలో ఆమే కధానాయకి. ఆ తెలుగు చిత్రానికి, వేటూరి గారికి ఒక ప్రత్యేక సంబంధం ఉంది. ఏంటది?

క్లూ: కళాతపస్వి కూడా ఉన్నారిక్కడ!

4. శోభన, సౌందర్య, విద్యా బాలన్ - వీరు ముగ్గురూ ఒకే పని చేసారు, ఏమిటది? ఇదే చిట్టాలో ఇంకో కధానాయకిని కూడా చేర్చచ్చు, ఆమె ఎవరు?

5. చంద్రమోహన్, కె రాఘవేంద్రరావు, చక్రవర్తి, కమల్ హసన్, భారతి రాజ, ఇళయరాజ - వీరిని ఒక చిత్రం ముడి వేస్తుంది. ఏమిటది?

6. శ్రీ శ్రీ రాసిన ఈ పాటని తెరమీద నాగేశ్వరరావు పాడుతుండగా రెప్పపాటు సమయం సంగీతదర్శకులు పెండ్యాల దర్శనమిస్తారు. ఏ పాట, ఏ చిత్రం?

క్లూ: ఎంతవరకూ నిజమో తెలియదు కాని, ఈ పాట విని ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్న ఒకాయన ఆగిపోయాడట.

7. నట రత్న ఎన్. టి. ఆర్, హింది నటుడు గోవింద, హాలివుడ్ యువ నటుడు బ్రాండన్ రౌత్ - ముగ్గురికి ముడి వేయండి?

==

ఆరవ టపాలో వేసిన ప్రశ్నలకి dosanara, కొత్త పాళీ గారు సరైన సమాధానలు తెలిపారు. స్ట్రైసాండు ఇఫెక్ట్ అనేది నాలుగేళ్ళ క్రితం ఆ నాటి ఒక ఫొటోగ్రాఫర్ తో పెట్టుకున్న గొడవ వల్ల వచ్చింది. దేన్నైనా (ముఖ్యంగా అంతర్జాలంలో) అణగదొక్కాలని చూస్తే అది అంతకంతా పాప్యులరై కూర్చుంటే, అది స్ట్రైసాండు ఇఫెక్ట్ అన్న మాట. ‘పద్మమే ఉంది కాని శ్రీ లేదు’ అని వాపోయిన నటుడు నాగయ్య గారు. ఒకప్పుడు భారతదేశంలో ఏ నటుడు ఎరగనట్టి గౌరవాలు, పారితోషకాలు ఆయనకి వచ్చాయి. కాని అపాత్రదానాలు చాలా చేయడం వల్ల, వ్యాపార వ్యవహారాలలో అనుభవం లేక పోవడంవల్ల ఆయన డబ్బునంతా కోల్పోయి చివరి రోజులు పేదరికంలో గడపవలసి వచ్చింది పాపం.

3 comments:

dosanara said...

1.ఆరాధన - Rajesh Khanna Song: Mere Sapnoki Raai, picturized in a car while Sharmila tagore going intrain same time ?
2.ముగ్గురు హీరోలు పాపులర్ హీరోల కొడుకులు : Sunil Dutt , Akkineni and Tom Hanks
3.శ్రీదేవి , పదహరేళ్ళ వయసు , వేటురి wrote the song సిరిమల్లె పూవా .. which is very popular song not sure if it has won any award
4. They all played చంద్రముఖి in Malayalam - Shobhana , Kannada - Siundarya , Hindi - Vidya Balan and the 4th heroine is Jyothika played the role in Tamil \ telugu .
5.ఆ సినిమా పేరు పదహరేళ్ళ వయసు , Kamal Hasan is the hero in tamil original directed by Baharti raja and music by Ilaya raja
6.??
7.NTR and Brandon Routh played Superman గోవిందా not sure

S said...

6. కలకానిది..విలువైనది పాటేనా?
(సినిమా - వెలుగునీడలు)

కొత్త పాళీ said...

1. పాట రూప్ తెరా మస్తానా .. చిత్రీకరణ పూర్తిగా నీడలతో చూపిస్తాడు, అవునా?
2. దోసనార గారు చెప్పినదానికి చిన్న కొసరు ప్రముఖనటుల సుపుత్రుల తొలి చిత్రాలివి.
3. నటి జయప్రద అనుకుంటున్నా ..అందులో వేటూరి నటించారా? ఏమో తెలీదు.
4. దోసనార గారు చెప్పేశారు
5. పక్కింటి అమ్మాయి ఏంఓ అనుకున్నా. అందులో చక్రవర్తి సంగీతం మేష్టరుగా కనిపిస్తాడు.
6. మొదట "నా హృదయంలో నిదురించే చెలీ" అనుకున్నా. నాగేశ్వర్రావు పియానో వాయిస్తుండగా పెండ్యాలు చేతులు క్లోజప్ లో చూపిస్తారని చదివానెక్కడో. మీ క్లూ చూశాక "కలకానిది విలువైనది" అనుకోవాల్సి వస్తోంది. పెండ్యాల సంబంధమేంటో తెలీదు.
7. అస్సలు తెలీదు.