Friday, August 22, 2008
నాకు నచ్చిన బ్లాగులు
కలగూరగంపగా కనులవిందు
కొత్తపాళీగారి గుత్తాధిపత్యము
విన్నదీ కన్నదే వింతలేదు
భైరవభట్లవి బహుచక్క వ్రాతలు
తెలుగు పద్యాలను తెలియపరచు
వర్తమాన విషయ వ్యాఖ్యాత చదువరి
లొసుగులన్ కనిపెట్టి లోతుజెప్పు
వాగ్విలాస రాఘవాభిధానుండును
తెలుగుపద్యములకు తేటగీతి
నాకు నచ్చినట్టి చాకులైదుగురని
సీసపద్యమందు చెప్పబోతి
ఇంకా,
మాండలికమ్ములో కథకు మంజిమ నిచ్చెడి రామనాథుడూ,
మెండుగ హాస్యవల్లరుల మేమెయి పూతకుదెచ్చు శ్రీనివా
సుండును, ఊకదంపుడను చోద్యపు పేరుకి పేరుదెచ్చినా
తండును, నాకునచ్చు మగతా సహ బ్లాగరులైరి చూడగా..
గరిమము= గొప్పదనము
మంజిమ = మనోజ్ఞత
మేమెయి = సునాయాసంగా
Friday, May 02, 2008
Horton hears a who
ఉ. హార్టను హూజె జెంటిలు జయంటినె జంగిలు, టీమ్స్వితిజ్బడీ
మార్టను హూజె క్యూట్లిటిలు మౌజు టు ప్రూవు (టు యానిమల్సు హూ
ఆర్టిలి కన్సిడర్హిమె రియల్కుకు టైపు ఇమాజినింగె ‘హూ’)
హార్టిలి "ఎవ్విరీ లిటిలు యానిమలాలుసొ హాసెరైట్టులివ్"
ఉ. Horton who is a gentle giant in a jungle, teams with his buddy
Morton who is a cute little mouse to prove (to animals who
artily consider him a real cuckoo type imagining a ‘who’)
heartily "every little animal also has a right to live"
Sunday, March 23, 2008
Obama!
intelligently gave her entry an aura that of victory
meant to be "scare-away every winner wannabe" move; not to be!
enter a young man* with an endearing message : "change, hope"
ఉ. క్లింటను మేడె లాటు మెని కేర్ఫులి క్రాఫ్టెడు ప్లాన్సు, అండ్వెరీ
ఇంటలిజెంట్లి గేవు హరు ఎంట్రి ఎనార దటాఫు విక్టరీ
మెంటుబి “స్కైరెవే ఎవిరి విన్నరు వానబి” మూవు, నాట్టుబీ!
ఎంటరె యంగుమాను* వితెనెండియరింగు మెసేజి ‘ఛేంజి, హోప్’
ఇక్కడ యంగుమాను బదులు డార్కు హార్సు అని వ్రాసినా గణభంగం జరగదు, చెప్పదలచుకున్న అర్ధమూ చెడదు, కానీ ఆంగ్లంలో వ్రాస్తూ డార్కు/హార్సు ఉపమానాలు (సరిపోయేవైనా) తీసుకురావడ మెందుకని వదిలేసాను.
Monday, February 25, 2008
చెత్త పాటలు రాసే తెలుగు సినిమా కవీ.. -2
యిష్ట ప్రయోగముల్, అతిశయించిన దుష్పదజాల వెల్లవల్
తిష్టలు వేసె నీ కలము తెచ్చిన పోకడవల్ల మూర్ఖుడా,
భ్రష్టవు భాష నీ చలువ వల్ల, నరాధమ ఓ సినీకవీ!
Tuesday, December 25, 2007
Don? Don't!
గుండు కదా? ఇలాంటి చిరుకోరికలుండని వారి జీవితాల్
దండగలవ్వవా? పొగిడి నాకుతు పెద్దల కాళ్ళనీడనే
పండగ చేసుకొన్న, భలె బాగుగ కోర్కెలు సాధ్యమవ్వవా?
====
ఉ. డాన్సులవీ అదో రకపు స్టైలు, అలాగని ఊరుకోని లా
రెన్సు ఎడాపెడా పటిమలేని కధాంశములెంచుకొన్ననూ
ఛాన్సులెలాగొలా దొరకసాగెను ప్రేక్షకమూకలో సినీ
ఫాన్సు మెదళ్ళమోదుటకు పైత్యపు దర్శకుడై తలెత్తగా (పాపము ప్రేక్షక ఖర్మకాలగా!)
నేను డాన్ చూడలేదు కాని స్టైల్ అనబడే చిత్రహింసకి మాత్రం గురయ్యాను.
Friday, November 30, 2007
తేట తెలుగు పలుకు - 3
గడ్డికి graసు చెడ్డికి నిఖార్సుగ knickeరు, దొడ్డి yardయే,
ముడ్డికి bum butt, మలమూత్రము poopలు pissలయ్యెనే,
foodన భోజనంబు పడు బొంతలు mattress bedలయ్యెనే,
ఆ.వె. సిగ్గువల్ల కొన్ని, ఛెంగున ఆంగ్లము
పల్కి గొప్పకొట్టవచ్చు పక్క
వారి ఎదుటనుకొను వారివల్ల మరిన్ని
తెలుగు పదములు పలు తెరమరుగవు
==
పై పద్యంలో గణాలు సరిగా పడాలంటే ఇలా చదువుకోమని మనవి.
ఉ. వెడ్డికి క్రేజి, కోపమదె పెచ్చిన మాడవు,నీరు వాటరే,
గడ్డికి గ్రాసు చెడ్డికి నిఖార్సుగ నిక్కరు, దొడ్డి యార్డయే,
ముడ్డికి బమ్ము బట్టు, మలమూత్రము పూపులు పిస్సులయ్యెనే,
ఫుడ్డన భోజనంబు పడు బొంతలు మేట్రెసు బెడ్డులయ్యెనే
Monday, November 26, 2007
Black Friday
పేతముగా పరాయిల సమేతులుగా పడి మంచి డీళ్ళకై
చూతురు చౌక బేరములు సొంతము చేసుకొనంగ చేయరే
ఖాతరు -దండుకొంచు పలు గాడిద మోతలు- పక్కవారలన్
(తైతకలాటలాడుదురు థాంక్సుగివింగని బేరమాటలో)
Wednesday, November 21, 2007
Ratatouille
చిట్టెలుకెన్నొ వంటలవిశేషములన్ పిడికొట్టి, పూటకూ
ళ్ళట్టి ప్రదేశముల్ వెతికె; “రాటటుయీ” యను వంటకంబు చే
బట్టె ప్రభంజనమ్ముగ అమాంతము వీచె పరంగు మెప్పుకై
పరంగుల (French) మెప్పించింది కాని, నాకు పెద్దగా నచ్చలేదు Ratatouille.
Thursday, November 15, 2007
గుండమ్మపై సీసము
పెంకిదయ్యెనది ఆ పెంపకాన
సవతి కూతిరినెల్ల సాధింప వేధింప
పనిమంతురాలయ్యె పసితనాన
గారాల పట్టికి మారాజు కావలె
ఘనమైన పెళ్ళికి, ఘనిడె వరుడు
సరితూగు పనివాడు సవతి కూతురికి ఇ
ల్లరికము వచ్చి, ఇల్లంటి మనగ
ఆ. వె. అని తలచుచు ఇద్దరప్పచెల్లెళ్ళకు
వరుల వేటజేయబట్టె తానె,
మగని తోడులేని బండమ్మ, గుండమ్మ
అన్న గారి సాయమందు కొంచు
కానీ, ఆ అన్నగారు ఎలాంటి వాడయ్యా అంటే..
ఆ. వె. పైకి మంచి వాడె మంచి మాటలు పల్కి
బుట్టలోన వేసి బురిడి కొట్టి
చెల్లి ఆస్తి నెల్ల గుల్లచేయు పధక
మ్ముల మునిగిన మేక తోలు నక్క
పాపం నలిగిపోయేది అణిగిమణిగి ఉండే సవతి కూతురు..ఇంతలో, ఆమె కష్టాలని తీర్చడానికే వచ్చారా అనే విధంగా..
సీ. గుండమ్మ నేర్వగ గుణపాఠమొక్కటి
చెప్పుటే ధ్యేయమై చెంత చేరి
రామలక్ష్మణుల తలపులకు దెచ్చుని
ద్దరు సహోదరులు పన్నిరి కలిసి చ
తుర ఛలము, ధనవంతుడొకడయెను పని
వాడుగనొకడు, భామల మనసుల
దోచిరి, అణచవలసిన గర్వములణ
చిరి, మంచివారకు చేసి మేలు
తే. గీ. తలచుకున్న కార్యముల సఫలము చేసి;
కొడయి బృందావనముల గొడవ లేక
ప్రేమయాత్రలు వలచిన భామల చెంత
హాయి హాయిగా చేయ సుఖదాయకమయె.
ఇదీ గుండమ్మ కధ. విడుదలై ఎభై ఏళ్ళు కావస్తున్నా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే తీరుగా ఉండి, తరతరాల..
తే. గీ. ఆంధ్ర ప్రేక్షకాదరణలనందుకొన్న,
ఆణిముత్యమాద్యంతమాహ్లాదమొలుకు,
విజయవారి, వెండితెరకు వెలుగునొసగు,
డాగులన్నవి లేని, గుండమ్మ గాధ
అందుచేత తెరమీద చూడడానికైనా లేక డీవీడీ కొని చూసినా, ఖర్చుపెట్టిన
ఉ. సొమ్ము వసూలె కాక (మనసొప్పగ తీరిచిదిద్దగా కధాం
శమ్ము భలే తయారయి పసందగు హాస్యపు చిత్రమయ్యె గుం
డమ్మ కధావిశేషము. బడాయి లడాయిల నవ్వు పువ్వులా
కమ్మటి ఆటపాటల సుఖాంతము) లాభము ముట్టు బేరమే.
Wednesday, November 14, 2007
తేట తెలుగు పలుకు - 2
ఉ. తేనెలనూరు పల్కులని, తీయని తేటతెలుంగు మాటలే
వీనులవిందులవ్వునని భేషజమాడుట వట్టిమాటలే
యౌను, నరాలలో ఇమిడినట్టి గులాముల బుద్దికింక స
మ్మానితయౌ విధాన తలమానికమవ్వగ ఆంగ్లమాంధ్రలో
Thursday, November 08, 2007
Tuesday, November 06, 2007
అప్పుల తిప్పలు
మ.కో. చిన్న పద్యము అల్లుదామని చెడ్డకోరిక కల్గగా
పెన్నుపేపరు చేతబట్టుకు పెట్టసాగితి బుఱ్ఱలో
ఉన్న గుజ్జుకు తానతందన*; ఒక్కటైనను తట్టదే
మన్నుమిన్నులు ఏకమైనను మంచి పద్యము బుఱ్ఱకూ
(* సాన పెట్టుట అని కూడా అంటారు లెండి)
అంటూ మత్తకోకిలతో బుఱ్ఱగోక్కుంటున్న నాకు, మా కంపెనీ సీఈఓ గద్దె దిగిపోయాడనే వేగు కనిపించింది. సబ్-ప్రైం ఋణాల గురించి ఇదివరకు రాసానుగా, వాటి దెబ్బ వల్లే ఆయన కంపెనీకి స్వస్తి చెప్పవలసి వచ్చింది. ఆయనెలాగూ మంచి డబ్బుమూటతోనే బయటకి వెళ్తాడు, మరి అప్పుల ఊబిలో చిక్కుకున్నవారి గతి ఏమిటి పాపం అని ఆలోచిస్తుండగా...
వారికి ఏమీ ఇవ్వలేను, పదహారు అణాలు కాకపోయినా కనీసం పదహారు పాదాల పద్యమాల ఇద్దామనిపించి, ఇదిగో ఇది రాసాను.
ఉ. తప్పని కష్టనష్టముల ధాటికి కుప్పగ కూలబడ్డ వా
రెప్పుడు భీతిచెందుచు భరింతురు కట్టడులెట్టివైననూ
అప్పు తనంతతానుగ అయాచితమై జనియించి చేరగా
తప్పునులే ధనార్తియని నమ్మిక పుట్టగ వెర్రివారలై;
అప్పుల ఊబిలోనపడ ఆరడులాగవు ఎంతమాత్రమూ
తప్పుల తుప్పలో తుదకు తప్పని తిప్పల పాలుపడ్డ వా
రప్పుడు నేర్తురెంతటి చిరాకుల చీదరయో ఋణేచ్చకం
చప్పున ఉచ్చులాగునది, జాడ్యము, తెచ్చునదే వినాశనం
తప్పులు తేటతెల్లమవు నాటికి ఆగత కష్టకాలముల్
కుప్పల తెప్పలై పెరిగి గుత్తగ వాలు దివాళ తంతులున్
ముప్పులు ముంచిదెచ్చునిల ముంగిట, ఆస్తులు జప్తులవ్వగా
అప్పుడు కంటినీటి తడి ఆర్పదు మండెడి అప్పుచిచ్చులన్
ఒప్పులు తప్పులున్ తఱచి ఓర్పుగ చూడగ తెల్లమవ్వదా
గొప్పల అప్పుసేతలకు కూలును వడ్డికివడ్డి కూడ, పై
కప్పులు జప్తు వేలముల, కావున చేయకు అప్పులూరికే
చెప్పగనేమిలేదు ఇక చెప్పితినంతయు పద్యరూపమున్
Saturday, November 03, 2007
Selling a car
కారని ఎంచి నేను పలు కారుల సైటులు చూడబట్టి* ఏ
కారుకి ఎంతపైకమడగాలను మత్లబు తెల్సివచ్చె నా
కారు (ఒకింత కొత్తటి ఎకార్డుని) పెట్టితి క్రేగ్సులిస్టులో
మీకు తెల్సినట్టి వేరేవి, అక్కర
కొచ్చు మంచి సాలె గూళ్ళు ఉన్న
చో తెలియపరచిన, ఎంతో సహాయము
నాకు; మీకు తెలుపు కృతజ్ఞతలివె
==
*పడిగాపులు మస్తుగ చేయబట్టి
Friday, November 02, 2007
అమెరికా, ఉంటా మరిక..
ఉ. మోజిక తీరిపోయెను అమోఘ ధనార్తులదేశరాజమై
రాజిలు "శాము మామ"కు పలాయన చిత్తుడనై ఎడంబడే
రోజిక వచ్చెగావున పొలోమని - కట్టితి మూటముల్లెలూ
బూజుని దుల్పివేసి అలవోకగ- వేగిరమే బయల్పడన్
త. కదలి రా ఇటవచ్చి చేరగ కాసుకాన్కలు భత్యముల్
బదిలి ఖర్చులు అద్దెకొంపకు బాడుగాదులు ఇచ్చెదమ్
వదలివచ్చిన చోటయుండిన మంచిసౌఖ్యపు భోగముల్
సదరుచోటుననుండు తప్పక సావకాశపు భోగ్యముల్
ఆ. వె. అనుచు నాకు మంచి అవకాశమొక్కటి
చేతికందజేయ, కాదనియన
లేక ఒప్పుకొంటి రీలొకేషనుకు మొ
న్నీ నడుమనె కంపెనీయు నచ్చి
==
శాము మామ: Uncle Sam!
Wednesday, October 31, 2007
తేట తెలుగు పలుకు
ఉ. వాళ్ళకి వాల్లు; కళ్ళకట మారును కల్లుగ; హవ్వ! వాణియా
నోళ్ళబడంగ వానియగు; నోళ్ళిక నోల్లయినిల్వ నిట్టి యా
రళ్ళవె కర్ణభేరులకు ఱంపపుకోతల కూతలవ్వ, యె
న్నాళ్ళు భరించుటంచు చెడునాల్కెలనెల్లను చీరివేతువా?
ఆ.వె. సల్పవచ్చునట్టి సాహసము తెగించి
తప్పులేదు కాని తరచి చూడ
మూగవారు తప్ప మిగలరెవ్వరు మరి
చివరకు మన చిత్రసీమలోన*
చిత్రసీమ అని వ్రాసాను కాని, ఇది నేటి టీవికి రేడియోలకి కూడా వర్తిస్తుంది.
Saturday, October 20, 2007
Fargo
హేలగ చూసి పొమ్మనియె హేళననోర్వని పెన్మిటంతనే
కూలికి పిచ్చిలిద్దరిని కొల్లయు గొట్టగ మామ సంపదా
తోలెను మంచిచెడ్డ విడ తొందరపాటున చిక్కెనూబిలో
ఫార్గొ చిత్రంలో జీన్ లండ్గార్డ్ తన భర్త జెరి లండ్గార్డ్ గురించి అనదగ్గ మాటలవి.
Coen Brothers’ Fargo is a crime thriller that also happens to be a dark comedy, OK make that very dark. Set in the middle of nowhere where a lot can happen and it does, it has some chilling scenes that stay with you long after; like a severed leg being pushed into a wood-chipper that's spewing bloody pieces into bloodied snow or the half-shot face of Steve Buscemi plastered with tissue paper.
The movie is set in North Dakota and Minnesota’s heavy snow season. The contrast with the dark deeds that happen is starker because of the setting. The ‘Minnesota nice’ folks that gel well with the background also add to the usual quirky and eccentric characters that populate Coen Brothers’ films. William Macy’s performance in the movie is a stand-out though Frances McDormand won the coveted statuette for her ‘carrying quite a load here’ cop.
He plays Jerry Lundegaard, a ‘i-am-carpet-walk-all-over-me’ character. People do just that while he ends up losing respect at home and work. Add to this a bully of a father-in-law, you have a perfect case of horribly repressed fellow dying to show his alpha-masculinity. He wants to make it big, but the problem is, he goes about it in a wrong way.
His father-in-law refusing to pony up money for his business proposal, then stealing the idea and humiliating him proves to be the last straw. Jerry hatches a plot to stage fake kidnapping of his wife to extract money out of the father-in-law. Things go horribly wrong and much blood is shed in the snowy town. Frances McDormand, the heavily pregnant and the unlikeliest of cops to go after killers, does it in her own dogged and meticulous way. She also gives us some laughs along the way, her interview with a pair of hookers being the highlight.
The same line repeated by various characters in different scenes is one way Coen Brothers extract comical results in their movies. Here it is Steve Buscemi being described as ‘Funny looking small fellow’ by many people that does the job. Characters struggling to pronounce tough words (remember, O brother where art thou? and ‘accompanist’?) is another recurring feature. Steve Buscemi does that with ‘carcinogenic’ in one scene and settles for an easier ‘gives cancer’.
Small characters shine too. Like the bartender who gives a cop the whereabouts of the killers. The way he narrates his interaction with Steve Buscemi, the repeated ‘I’m going crazy out there at the lake” line and the final “oh, he was funny in a general kind of way” makes the little scene a very very funny one. You can see that and another funny scene here.
If you like dark comedies and don’t mind some blood on the way, Fargo is right up your alley.
Thursday, October 18, 2007
దిగిన ముద్ద
ఉ. పెట్టిరి చేత రెండు కడు పెద్దవి పెట్టెలు ఒక్కసారిగా
పెట్టితి నేను నోరునట వెళ్ళ ఇవేమిటి ఇంతవింతనీ
తట్టెను బుఱ్ఱకాయకటు తప్పిదమెవ్వరు చేయలేదనీ
పెట్టెలు నేను కోరినవి పిక్చరు రీళ్ళని తెల్సి తేటగా
రీళ్ళని చూడకుండానే తిరిగి ఇచ్చేద్దామనుకున్న తరుణంలో, కాల్ చేస్తానన్న లైబ్రరీ ఆయన చేసాడు. ఇంటికి దగ్గరలో ఉన్న ఇంకో శాఖలో ప్రొజెక్టరు ఉందని, వాళ్ళని కనుక్కొమ్మని చెప్పడు. వాళ్ళతో మాట్లాడితే తెలిసింది, ప్రొజెక్టర్ ఉంది కాని, దాన్ని ఇరవై ఏళ్ళ పాటు ఎవరు వాడకపోవడంవల్ల నేను వాడుకుంటానంటే వాళ్ళు ఒక గది, బల్ల, చూడడానికి తెర లాంటి సదుపాయాలన్ని ఇవ్వగలరు కాని, ప్రొజెక్టరు నడిపించడంలో మాత్రం సహాయం చేయలేరని. నాకు కాసేపు సినిమా పారడీసో లో టొటొలా అయిపోవాలనిపించింది.
అయినా అప్పుడప్పుడు పాత ప్రొజెక్టర్ నడపడం లాంటి కొత్తవి నేర్చుకోకపోతే బ్రతుకులో స్పార్కు ఎక్కడుంటుందని ఇతర సగం అనడంతో పట్టుదల కలిగింది. ప్రొజెక్టరు, గది కావాలని శాఖవారికి చెప్పాను. వాళ్ళు వీలున్న రోజు చూసి, ఆ తేదిన రమ్మనారు.
ఒక రోజు ఆ రోజు రానే వచ్చింది. రీలొకటి పట్టుకు వెళ్ళాను. ఒకావిడ నాకు ప్రొజెక్టరు ఇచ్చి చల్లగా జారుకుంది. ప్రొజెక్టరు తెరిచి చూద్దునా, ఏదెటు వెళ్తుందో ఒక్కింతైనా అర్ధం కాలేదు. ముప్పావుగంట ట్రైనింగులేని వాడు విమానం మీటల ముందు కష్టపడ్డట్టు కుస్తీ చేసాను. విమానం ఒక్క అంగుళం కదలని విధంగా ప్రొజెక్టరు కూడా మొరాయించింది. నిరాశతో ఇంటి ముఖం పట్టాను.
మొదటి రోజు నా ప్రయత్నాలు ఇవిగో. చివరకు సాధించింది ఆ ఖాళీ తెరొక్కటే.
కధంతా విన్న ఇతర సగం ఇంకోసారి ప్రయత్నిద్దామంది. ఇలాంటి వింటేజ్ పరికరాలు కొద్దిగా కష్టపెడతాయనీ, వాటిని అదుపులోకి తెచ్చుకుంటే ఉండే ఆనందమే వేరని అంది. తన మాటులు విన్న నాకు అబ్బురమేసింది. కొంచెం తొందరగానే ఓటమిని ఒప్పుకున్నానేమో అనిపించి, శాఖ వారికి మళ్ళీ కాల్ చేసి ఇంకో రోజు కావాలని అడిగాను. వాళ్ళు ఇంకో తేది ఇచ్చారు.
ఓటమిలోనే విజయానికి మెట్లు పడతాయన్నారెవరో, అలానే అయ్యింది. మొదటి సారి తీసిన ఫొటోల వల్ల తెలిసింది ప్రొజెక్టరు ‘బెల్ అండ్ హొవెల్’ వారిదని. గూగులమ్మని బుజ్జగించి చూసాను. ముందు ఈబె లో అలాంటి ప్రొజెక్టరుని అమ్మాలనుకునే వాళ్ళ ప్రకటనలే తప్ప ఇంకేమీ కనబడలేదు. నానారకాలుగా ప్రయత్నించిన తర్వాత ఒక లంకె తగిలింది. మోడలు అదే కాక పోయినా, ‘బెల్ అండ్ హొవెల్’ వారి ప్రొజెక్టరు నడపడం గురించి వివరాలందులో ఉన్నాయి.
రెండవ సారి వెళ్ళినప్పుడు, ఇతర సగానిదే పైచేయి. ముందు నుంచి, చంటి పిల్లని నా చేతికిచ్చేసి, తను ముందడుగేసేసింది. పావుగంటలో ప్రొజెక్టరు నడవడం, చక్కగా తెర మీద బొమ్మలాడడం మొదలు. మా ఇద్దరి ఆనందానికి హద్దు లేదంటే నమ్మండి. (ఇదిగో ఇక్కడ చూడండి. బొమ్మ తెరమధ్యలో పడలేదు కాని, you get the picture, right? బొమ్మ డ్రంకెన్ ఎంజెల్ లోనిది. డాక్టర్ గా తకాషి షిముర, పక్కన తొషిరో మిఫునె)
నిన్న పది మంది స్నేహితులని ఆహ్వానించి, సంజురో సినిమా చూపించాను. మాకు తప్ప అందరికి, జపనీయుల చిత్రాలతో అదే మొదటి పరిచయం. వీలైనంత మేరకు కురొసావ, మిఫునెల పూర్వరంగం, వారి గొప్పదనం గురించి చెప్పాను. అందరికి ఇక చూడాలని ఉత్సాహం హెచ్చడంతో నా మాటలు కట్టిపెట్టి, ప్రొజెక్టరు నడిపించాను.
అందరం పాప్కార్ను, చిప్సు తింటు హాయిగా ఓ రెండు గంటల పాటు సంజురో చూసి ఆనందించాము.
ఎట్టకేలకు ముద్ద దిగింది.
Wednesday, October 17, 2007
Maggi కో మాల
చళ్ళిటు ఊరగాయలటు చక్కగ కర్కరలాడు దుంప వే
పుళ్ళకు పెర్గుతర్కలిటు పుట్టవు ఊరకె కంచమందు; ఆ
కళ్ళును దీర్చుభోగ్యము బకాసుర పూజ్యము మేగియే కదా
(ఊకదంపుడు గారు చేసిన మార్పులతో ఈ పద్యం ఇంకా సహజంగా తయారయ్యిందని నా అభిప్రాయం. మార్పులు బోల్డు వత్తుగా టైపాను చూడండి)
ఉ. పెళ్ళియె కాని ఒంటరికి వేళకు అన్నము నంజుకోను ప
చళ్ళిటు ఊరగాయలటు చక్కగ కర్కరలాడు దుంప వే
పుళ్ళకు పెర్గుతర్కలెటు పుట్టవు ఊరకె కంచమందు; ఆ
కళ్ళును దీర్చుభోగ్యము బకాసుర పూజ్యము మేగియే కదా
మేగి (Maggi) బ్రహ్మచారులకి చేసే మేలుని ఉత్తిమాటల్లో చెప్పడం సాధ్యం కాదు కనక, ఒక ఉత్పలమాలలో చెప్ప ప్రయత్నించాను. ఇప్పుటంటే తినట్లేదు కానీ, పెళ్ళి కాని రోజుల్లో నా వంటింటి నేస్తం మేగియే మరి. రొట్టె ముక్కల్లొ, కూరల్లొ, ఆఖరికి పెరుగులో కూడా కలుపుకుని తిన్న రోజులున్నాయి. అదంతా వంట రాక చేసిన నిర్వాకాలే. మొక్కజొన్న రేకులు (corn flakes), మేగి లేక పోయుంటే నాగతి ఏమయ్యేదో?
అందుకే ఈ పద్యాన్ని మేగికి అంకితమిస్తున్నాను.
Monday, October 15, 2007
Coen brothers
రాయగ పాప్యులర్ కధలు రైయ్యని వెండితెరెక్కి హిట్టులై
చేయగ వారినిద్దరి నెసెట్టుగ ఎట్టిపటానికైన ప
ర్చేయద హాలివుడ్డు మరి రెడ్డుతివాచిని వారి ముంగిటన్
(ఇక వికటకవి గారి వ్యాఖ్యకి సమాధానంగా ఆంగ్ల పద ప్రయోగంలేకుండా రాసినది ఇదిగో..)
ఉ. కోయెను సోదరుల్ జతగకూడి విభిన్నపరంపరన్ కధల్
వ్రాయ విరాజిలున్ కధలు రైయ్యని వెండితెరెక్కి గొప్పవై
పోయె (ధనార్జనా పెరిగె) పొందిరి పేరును చిత్రసీమలో
పూయవ హాలివుడ్డుకడ పూలతివాచిలు వీరి బాటలన్
బ్లడ్ సింపుల్ నుండి మొదలు పెట్టి లేడికిల్లర్స్ దాక (ఒక్క హడ్ సకర్ ప్రాక్సి ని మినహాయించి) కోయన్ సోదరులు తీసిన చిత్రాలన్ని చూసేసాను. ఓ, బ్రదర్ వేరార్ట్ దౌ వాటిల్లో నాకు అత్యంత ప్రియమైన చిత్రం. వీరి కధనం చూస్తే నాకు ఎందుకో వంశీ చిత్రాలు గుర్తుకువస్తాయి. వీలు దొరికినప్పుడు వారి ఇతర చిత్రాల గురించి రాస్తాను. మీకు వారి చిత్రాలు నచ్చుతాయా?
Akira's Hidden fortress - 1
ఉ. కొండలలో రహస్యముగ కోటను కట్టి ధనమ్మునంతయూ
దండిగ కట్టెడొల్లలను దాచిననూ పసిగట్టి వెంట వే
టాడుచు వచ్చుశతృవులు (టక్కరులిర్వురు ఇంతలో జతై
యుండగ హెచ్చుకష్టములు) యుధ్ధముదెచ్చునదెన్ని చిక్కులో
ఆ. రాకుమారిని శతృరాజుల చేజిక్క
నీయకుండ రక్షనిచ్చి మిత్ర
రాజ్యమునకు చేర్చిరక్షించుకొనుటకై
పీకులాడుచున్న వీర భటుకి
Now that might sound serious, but believe me, The Hidden Fortress is one of Kurosawa's most light-hearted movies. More details in the next post.