Monday, November 26, 2007

Black Friday

ఉ. రాతిరి నిద్రమానుకొని లైనులలో నిలుచుండి సాహసో
పేతముగా పరాయిల సమేతులుగా పడి మంచి డీళ్ళకై
చూతురు చౌక బేరములు సొంతము చేసుకొనంగ చేయరే
ఖాతరు -దండుకొంచు పలు
గాడిద మోతలు- పక్కవారలన్
(తైతకలాటలాడుదురు థాంక్సుగివింగని బేరమాటలో)


That's precisely the response marketers want from the customers year after year. Just for a few throw-away deals hundreds of people flock the stores, jostling and elbowing each other out to lay hands on that ONE deal. Many end up picking up the 'also-ran' items, which again is true to marketers' script :)

6 comments:

రాఘవ said...

ప్రేతపుజీవితాలె అవి రేతిరి నిద్రలుకూడ లేనిచో.

గిరి Giri said...

చూతురు, ఖర్చుచేయ మనసొప్పక బోలెడు డబ్బు చౌకబా
రౌతురెడాపెడా, పొదుపె, లౌక్యులకీ పిసినారిబుధ్ధులా?
(ప్రేతములైనవారెటుల వృధ్ధికి వచ్చెదరోయి, రాఘవా?)

బావుందీ రిలే పూరణ..నాకు గుర్తుండి ఇది మూడవది.
రాఘవా, ఈసారి కొసరు మూడవ పాదం జోడించా, ఇంకా పొడిగించగలవా?

రాఘవ said...

వ్రాతలతో యిలా మనము వాతలు పెట్టెదమోయి వో గిరీ. :)

బ్లాగేశ్వరుడు said...

తే.గీ.

పద్యమున పాదమునకు పై పాదము కొస
రు పలుకుచు పద్య ప్రియబ్లాగరుల నలరుచు
రాఘవ గిరులున్ అనతికాలమున జంట
కవులుగా కడు వాసికెక్కదరు గాక

గిరి Giri said...

నే తలచిందదే కనుకనే చురకేస్తి కదా పడాలనే
వాత, రిబేట్లకై తిరిగు వారలపైన సెటైరుగా కలం
సేత, భరింపజాలక రుచించని అంతరు-జాల మోత, ఎం
తో తలబోసినాక పదునొచ్చె పదాలకి పద్యరూపమున్
నూతనరీతి పూరణముతో కసరత్తులు చేయగా మనో
చేతన హెచ్చె పద్యముల చిక్కుముడుల్ విడదీయ నేర్వగా
(కోతలు కావులే తగని గొప్పలు కావివి, ఓయి రాఘవా)

ఇంతటితో పదహారు పాదాలు పూర్తి, మళ్ళీ ఓ పాదం కొసరు :)

రాఘవ said...

ఈ తరుణం భలే కుదిరె తిక్కకుదర్చగ వీరికిట్టులన్ :)