ఉ. మోజిక తీరిపోయెను అమోఘ ధనార్తులదేశరాజమై
రాజిలు "శాము మామ"కు పలాయన చిత్తుడనై ఎడంబడే
రోజిక వచ్చెగావున పొలోమని - కట్టితి మూటముల్లెలూ
బూజుని దుల్పివేసి అలవోకగ- వేగిరమే బయల్పడన్
త. కదలి రా ఇటవచ్చి చేరగ కాసుకాన్కలు భత్యముల్
బదిలి ఖర్చులు అద్దెకొంపకు బాడుగాదులు ఇచ్చెదమ్
వదలివచ్చిన చోటయుండిన మంచిసౌఖ్యపు భోగముల్
సదరుచోటుననుండు తప్పక సావకాశపు భోగ్యముల్
ఆ. వె. అనుచు నాకు మంచి అవకాశమొక్కటి
చేతికందజేయ, కాదనియన
లేక ఒప్పుకొంటి రీలొకేషనుకు మొ
న్నీ నడుమనె కంపెనీయు నచ్చి
==
శాము మామ: Uncle Sam!
6 comments:
అబ్బో పెద్ద నిర్ణయమే. ఎన్నాళ్ళలో పయనం? ఏదేమైనా, శుభాకాంక్షలు సొంతగూటికేగుచున్నందుకు.
తరళము మూడవ పాదములొ చివరి గణం లొ ఉన్న భొగాన్ని భోగం చేయండి. మీ పద్యాలౌ వ్రాయడం చూస్తుంటే ముచ్చట వేస్తోంది. ఇలాగే కానియ్యండి
అలాగే చివరి పాదం లొ ఉన్న భొగ్యాన్ని కూడా భోగ్యం చెయ్యండి
నిజంగానా?
కొత్త ప్రదేశంలో కొత్త దారుల్లో దిగివిజయమస్తు!
వికటకవి గారు, గూడు సంగతి నిజమే, సొంతదో కాదో సమయమే చెప్పాలి.
బ్లాగేశ్వరా, భో-చేసేసా
కొత్తపాళీ గారు, అవును; ధన్యవాదాలండి..
ఈ దీపావళి సందర్భంగా మహాసయులకు సుభాకాంక్షలు. గిరి గారు, All The Best. నేను బెంగులురికి వచ్చి 6 నెలలు అవుతోంది.
Post a Comment