Showing posts with label Cricket. Show all posts
Showing posts with label Cricket. Show all posts

Friday, October 05, 2007

పప్పు పప్పు

నేను స్నేహితులతో అప్పుడప్పుడు స్క్రాబుల్, చైనిస్ చెక్కర్స్ లేక్ క్రాస్వర్డ్ పిరమిడ్ అడతాను. సాధారణంగా గొడవలేమీ లేకుండా అయిపోయే ఆటలే ఎక్కువ, కానీ అప్పుడప్పుడు పోటి కొంచెం తీవ్రతరమవుతుంది. నువ్వా-నేనా అంటూ సాగే అలాంటి ఆటల్లో ఓడిపోయిన వారికి తెగ ఉక్రోషం రావడం, దానితో వెంటనే (ఓటమి మచ్చని మాన్పుకోడానికి) ‘ఇంకో ఆట ఆడదామని’ అడగడమూ జరుగుతాయి. “కష్టపడి గెలిచినప్పుడు కొద్ది సేపు విర్రవీగడం గెలిచిన వాడి హక్కు” అని నమ్మడం మూలాన నేను గెలిస్తే అలాంటి రిపీట్ ఆటలకి సాధారణంగా ఒప్పుకోను.. నాకెదురుగా అడుతున్నది ఆస్ట్రేలియా, లేక ఒకప్పటి విండీస్ జట్టులలాంటి స్నేహితుడైతే చచ్చినా ఒప్పుకోను.

మరి మన భారతీయ జట్టో? ఒప్పుకోవడమే కాదు, ఎదుటి వాడి చేతిలో పప్పు పప్పు అయిపోయి, అంతకు మునుపు గెలిచిన గెలుపు ఇంకా అభిమానుల మనసులలో పూర్తిగా ఇంకక ముందే ఓటముల పరంపర తెచ్చిపెట్టుకుంటుంది.

1983లో గెలిచిన అంతర్జాతీయ కప్పు తర్వాత చూడండి ఏమైయ్యిందో! విండీస్ వాళ్ళు వచ్చి మనవాళ్ళని చితక కొట్టి, ODIలలో 5-0, Tests లో 3-0 ఓటమిని చవిచూపించారు.

ఇప్పుడు ఆస్ట్రేలియాతో మళ్ళి అదే కధ సాగుతోంది. అప్పటి విండీస్ జట్టుకి ఉన్నట్టి హుందాతనం ఇప్పటి ఆస్ట్రేలియన్లకి లేదు - మనని ఓడించి, 20-20లో మనం ఏదో గుడ్డిగా గెలిచామని పెద్ద రభస చేసినా చెస్తారు వీళ్ళు. అలాంటప్పుడు, మన వాళకి కొన్ని వారాల వ్యవధినిచ్చి, విశ్రాంతి తీసుకోనిచ్చి అటు తరువాత అడనివ్వాల్సింది కదా? అవును, కానీ జట్టుకి ఏది మంచిదో, ఏంచేస్తే మన విజయ పరంపర కొనసాగగలుతుందో అనే మంచి ఆలోచనలే మన బి.సి.సి.ఐకి ఉంటే మన జట్టు స్థిరవిజయాలకి మారుపేరుగా ఎప్పుడో పేరుతెచ్చుకునేది...ప్చ్!