చ. గణములకాధిపత్యమును గైకొన వేడగ తల్లిదండ్రులన్
అణకువతోడ; తమ్ముని, గజానన, నెగ్గిన ఇత్తుమంటిరే;
బెణకని మందగామివి అభీప్సితసిధ్ధికి భక్తితో ప్రద
క్షిణలు ఉమామహేశ్వరుల చెంతనె చేస్తివి నాయకుండవన్
(మణిమయ భూషితా మహిత పార్వతి పుత్ర మహాగణాధిపా)
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
యతి సరిచూడటానికి సంయుక్తాక్షరాలలో చివరిగా వచ్చిన హల్లుని తీసుకోవాలని అనుభవంమీద నా యభిప్రాయం. క్ష అన్న సంయుక్తాక్షరాన్ని క్+ష క్రింద విడగొడితే వీటిలో తుదిది ష కాబట్టీ షకారానికీ చకారానికీ యతి చెల్లుతుంది కాబట్టీ క్షకి చకి కూడా యతి చెల్లుతుందనే పరిగణించాలి.
గణపతి సర్వదా శుభము కామిత మిచ్చునుగాక మీ కిలన్. పద్యం బాగుంది.
కం.
ఏపాపం చేసితినో
ఈపాపితలకు కరముకు ఈశ్వర స్తోత్రం
చేపట్టుటకైఎంతకు
ఓపాదముపూర్ణకూడ ఊహకు రాదే
ఆ.వె.
కోరెదనొక కోర్కెని కార్తీక మాస
మున కపాలిని మనసార స్తుతి
చేసెడి వృత్తాల రచన చేయమని
బ్లాగెసుండు గిరిని వేడుకొనెను
రాఘవా,
"కనుకనె భక్తితో కొలుతు కైవసమొంది అహంబెల్లను నే
నెనరున కొల్వగా జనులనెల్లను బ్రోచెడి విఘ్ననాయకున్"
బ్లాగేశ్వరా,
నేను తప్పక ప్రయత్నిస్తాను. మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండండి, త్వరలో మీకూ వచ్చేస్తుంది.
రాఘవ గారు సమ్యుక్తాక్షర యతిని గూర్చికొంత అవగాహన కొచ్చినా ఇంకొంచం వివరంగా తెలుసుకోవచ్చు.
సమ్యుక్తాక్షరంలో అచ్ సామ్యంతో పాటు సమ్యుక్త హల్లులలో యేవొక్క హల్లుకైనా యతి వేయ వచ్చును.
ఉదా:- "క్షా" ను గైకొని చూచిన "కా" కు "షా" కు
"క్షా" నె గైకొని చూచిన "షా" కు " కా " కు
అచ్చు సామ్యంబుతో యతి అమర నగును.
"చివరి హల్ల్" అను మాటకు సవరణ యిది. బ్లాగేశ్వరుడు వ్రాసిన కందం బాగానే వుండి.. ఐతే ఆటవెలది మాత్రం సరి చూసుకోవలి.
ఆ.వె:-కోరెదనొక కోర్కెని కార్తెక మాస
ఆ.వె.
కోరెదనొక కోర్కెని కార్తీక మాస { కి బదులు }" కోరెద నొక కోర్కె చేరి కార్తీకమున్ {అనీ}
మున కపాలిని మనసార స్తుతి { కి బదులు }' యతులు కుదర జేయ స్థుతి యొనర్చి {అనీ}
చేసెడి వృత్తాల రచన చేయమని { కి బదులు } వృత్త పద్య రచన వేవేగ యొనరింప {అనీ]
బ్లాగెసుండు గిరిని వేడుకొనెను { కి బదులు} బ్లాగు నుండి గిరిని బ్రతిమ లాడ్దు. {అనీ}
లక్షణయుక్తంగా వాస్తే యింక బాగుంటుంది.
{ చింతా రామ కృష్ణా రావు.}
గిరి వర్యా! సుమనర్నమః పూర్వక అభినందనలు.
క:- అభి నందన గిరివర్యా!
శుభ పరిణతి తోడ మీరు శోభిలు చుండన్
విభవము వాణికి, మీకిక
నభయము. విధు రాణి యిచ్చు.నద్భుత శక్తిన్.
మీ బ్లాగుతో పాటు మీరూ దీర్ఘాయుష్మాన్ భవ.శతాయుషుమాన్ భవ
చింతా రామ కృష్ణా రావు.
Post a Comment