కారుల అమ్మకానికని ఖర్చులు ఎక్కువ చేయడాలు బే
కారని ఎంచి నేను పలు కారుల సైటులు చూడబట్టి* ఏ
కారుకి ఎంతపైకమడగాలను మత్లబు తెల్సివచ్చె నా
కారు (ఒకింత కొత్తటి ఎకార్డుని) పెట్టితి క్రేగ్సులిస్టులో
మీకు తెల్సినట్టి వేరేవి, అక్కర
కొచ్చు మంచి సాలె గూళ్ళు ఉన్న
చో తెలియపరచిన, ఎంతో సహాయము
నాకు; మీకు తెలుపు కృతజ్ఞతలివె
==
*పడిగాపులు మస్తుగ చేయబట్టి
Subscribe to:
Post Comments (Atom)
12 comments:
మంచి ఎత్తే వేసారు గిరీ!
చక్కని జత పద్యములను
మక్కువ గని మురిసిపోయి మైకము గమ్మన్
ఠక్కున గొందురు కారును
ఎక్కువ ధరయున్నగాని ఎంచరు ఎవరున్!
Good luck with everything!
వచనం అర్థమవుతుందా, పద్యాల్లోనే రాయాలా? :)
అసలు కంటే కొసఱు ముద్దని...భలే చెప్పారు చదువరి గారు-:) అసలు 6/10 కొసఱు 9/10
కారును అమ్ముట కష్టము
కోరుదు రందరును తాము కోరిన ధరకున్
పేరుకె అమ్మిన మోదము
విరిచెను ఈనా మనసును, విక్రయ గాథల్*|
*http://sreenyvas.wordpress.com/2007/08/06/%e0%b0%b8%e0%b1%86%e0%b0%95%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%b9%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%81-%e0%b0%85%e0%b0%82%e0%b0%a6%e0%b0%82/
"విరిగెను" బదులు "విరుచును" అని చదువగలరు.
చదువరి గారు, 15నిమిషాలలో రాసిపడేసారా? గొప్ప విషయమే!
సావిత్రి గారు, నెనరులు..కొత్తగా రాస్తున్నాను కనుక, పద్యంలో రాయగలిగితే వదిలి పెట్టడంలేదు అంతే..
చచుచ,
వికటకవి గారు, కందమేనా? చివరి పాదం దీర్ఘంతో మొదలవ్వాలి, గమనించండి.
కం.
కారును అమ్ముట కష్టము
కోరుదు రందరును తాము కోరిన వెలకున్
పేరుకె అమ్మిన మోదము
బారుగెయినుతో సొలసితి బావురు మనుచూ!
గిరి గారు,
కృతజ్ఞతలు. ఇంకా తప్పటడుగులుంటే, మీ ఓపికానుసారంగా :-) ఎత్తిచూపగలరు.
వికటకవి గారు, సరిపోయింది, బావుంది..
మీరు బారుగెయిను అంటే బారు లో గెయిననుకొని మా తూగులయ్య పరిగెత్తుకొస్తాడు మరి.
ఊదం గారు,
తూగులయ్య జోలికి కొన్నాళ్ళు వెళ్ళకండి. చూడబోతే, మిమ్మల్ని తన దారికి తెచ్చుకొనేట్లున్నాడు :-)
క్రెయగ్స్ లిష్టూ, లేడీస్ బస్టూ, ఫ్యూరీస్ ఫిస్టూ
కాదేది వృత్తాల కనర్హం
ఔనౌను శిల్పమనర్ఘం
అనిపించారు గిరి గారు.
వహ్వా!
Post a Comment