శా. మైహూనా - చవి చూపి చెత్తను, శిరోభారమ్ము పెంచేయగా
నా హూనంబయినట్టి బుఱ్ఱకు ప్రమాణంబిస్తి, మళ్ళీ ఫరా
కాహారంబెపుడూ తనవ్వదని; వాగ్దానాలు కల్లల్ కదా,
ఆహా, నేడు సమీక్షలన్ చదివి, హైహై యంటి ఓంశాంతిఓం
తే.గీ. చిత్రమును చూడ పంతము చేయ బుద్ది
తానె గడ్డి మేసినదై; ఇదంత మీకు
చెప్పు కారణమేమన, పప్పులోన
కాలు పడకముందె నను ఆపాలి తమరె.
మీలో ఎవరైనా ఈపాటికి ఓం శాంతి ఓం చూసి ఉంటే, పై పద్యంలోని 'మీరు' మీరే. Reviews please!
11 comments:
నాకు ఈ సినిమా కథ తెలుసోచ్.
70 కాలంలో షారూఖ్ , దీపికను ప్రేమిస్తాడు. ఆమె లవర్ ఆమెను చంపేస్తాడు. అది చూసిన షారూఖ్ బాధతో చనిపోతాడు. మళ్ళీ ఇద్దరూ పుట్టేసి ప్రేమలో పడి షారూఖ్ మాత్రమే గుర్తు పట్టడానికి బ్రతికున్న విలన్ ని చంపడానికి పూనుకుంటారు. అన్నట్టు ఆ విలన్ గతజన్మలో దీపిక కాబోయే భర్త ..లవర్ ఎదో...ముసలితనాన కుసుమగుడాలన్నట్టు షారూఖ్ ఖాన్ 6 pack బాడిని చూపి ఎదో వెరైటీ అన్నట్టు ఫీలైపోతున్నారు నిర్మాతలు మున్నగువారు. నిర్మాత ఎవరో కాదు మన హీరో భార్య.
ఐనా ఈ సినిమా సూఫర్ హిట్ అంటున్నారు కుర్రకారు..
ఇంకా వివరాలకు
http://en.wikipedia.org/wiki/Om_Shanti_Om_%28film%29
హమ్మయ్యా ...ఇదీ కథ....తెలిసినట్టే ఉందికదా.
చాల బావుంది. మీ పుణ్యం ఊరికే పోదు . శ్రీదేవి
మీ కోసం నా సైట్ లో OSO రివ్యూ చూడండి.
సారీ.లింకు తప్పుగా వచ్చింది.
www.24fps.co.in చూడండి.
review on http://valleychai.com/blog/2007/11/13/reviews-saawariya-vs-om-shanti-om/. enjoy!
మీ బ్లాగులొ తప్పులు చెబుతున్నాను అని అనుకోకండి అన్యధా భావించకండి.నేను కూడా చాలా తప్పులు వ్రాస్తాను. లేబుల్స్ లొ శార్దూలము వర్ణక్రమము సరిగా లేదు. సరిఛూడండి. శార్దూలము భలే తేలికగా వ్రాశారు నేను శార్దూలము ప్రయత్నిస్తున్నాను. చివరి పాదము తేలింది కాని మిగతా మూడు పాదాలు తేలడం లేదు. ఎప్పటికైనా ఈశ్వరానుగ్రముతో పద్యముతో తేలుతుందో లేదో.
అదేమిటి మీరు శార్దూలానికి ఉపజాతులు జోడీస్తున్నారు (తేట గీతి, ఆట వెలది) ఇది మీ బాణియా??
బ్లాగేశ్వరా, తప్పులు ఎత్తి చూపండి, నేను అన్యధా భావించను.
మీరు చెప్పినవి సరి చేశాను.
ఇక మీ ప్రశ్న విషయానికి వస్తే, నేను చెప్పదలచుకున్నది ఇంకా మిగిలి ఉన్నప్పుడు తేలికైన గీతపద్యాలు జోడిస్తున్నాను, అంతే!
ఫరా ఖాన్ రాక్స్ అండి.
తప్పక చూడండి సినిమా..
చాలా బాగా చెప్పారు. ఈ పాపం ఊరికనేపోదు.
వాఖ్యలు రాసి నన్ను కాపాడదల్చిన అందరికీ (శ్రీదేవి, ప్రియతమ గార్ల పుణ్యపాపాల సంగతి అంతు చిక్కకపోయినప్పటికి)ధన్యవాదాలు..
ప్రస్తుత దాఖలాల ప్రకారం ఓం శాంతి ఓం దెబ్బ నుంచి నేను తప్పించుకున్నట్లే గోచరిస్తోంది.
Post a Comment