ఉ. వెడ్డికి crazy, కోపమదె పెచ్చిన madవు,నీరు wateరే,
గడ్డికి graసు చెడ్డికి నిఖార్సుగ knickeరు, దొడ్డి yardయే,
ముడ్డికి bum butt, మలమూత్రము poopలు pissలయ్యెనే,
foodన భోజనంబు పడు బొంతలు mattress bedలయ్యెనే,
ఆ.వె. సిగ్గువల్ల కొన్ని, ఛెంగున ఆంగ్లము
పల్కి గొప్పకొట్టవచ్చు పక్క
వారి ఎదుటనుకొను వారివల్ల మరిన్ని
తెలుగు పదములు పలు తెరమరుగవు
==
పై పద్యంలో గణాలు సరిగా పడాలంటే ఇలా చదువుకోమని మనవి.
ఉ. వెడ్డికి క్రేజి, కోపమదె పెచ్చిన మాడవు,నీరు వాటరే,
గడ్డికి గ్రాసు చెడ్డికి నిఖార్సుగ నిక్కరు, దొడ్డి యార్డయే,
ముడ్డికి బమ్ము బట్టు, మలమూత్రము పూపులు పిస్సులయ్యెనే,
ఫుడ్డన భోజనంబు పడు బొంతలు మేట్రెసు బెడ్డులయ్యెనే
Friday, November 30, 2007
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
మీకు ఒక ఆంశం ఇస్తే చాలు ఇలా పద్యాలు అద్భుతుముగా అల్లుతున్నారుగా...బహు బాగుగా ఉన్నది.
నాలుగు ఐదు రోజుల నుండి అస్సలు తీరిక దొరకలేదు, రోజంతా ఎంత కష్టపడి ఇంటికి వచ్చిన ఒక పద్యము వ్రాస్తే ఎంతో సంతృప్తి లభిస్తోంది.
:-)))
మరిచిపోబోతున్న పద్యాలంకారానికి ప్రాణం పోస్తున్న మీకు నా మనఃపూర్వక అభినందనలు.. చాలా బావుంటున్నాయి మీ పద్యాలు.. పదండి ముందుకు..
గిరిగారు, యిది చూడండి.
very good creative poem.
గిరి గారూ, మీరసాధ్యులు సుమండీ!ఇంగ్లీషు పదాలను భలే అమర్చారు పద్యంలో. ఇక మీ వడి గురించి చెప్పేదేముంది..
వృత్తాలూ 2.0 నా ? :)
బ్లాగేశ్వరా, పద్యాలు రాస్తే కలిగే సంతృప్తి గొప్పదే. పెన్ను, పేపరు లేకుండా పద్యాలు రాయడం మొదలుపెట్టండి - ఇంటికి వస్తున్నప్పుడు దార్లో పద్యాలు కట్టేయచ్చు. నేను తరచూ అదే చేస్తాను.
సావిత్రి గారు, బమ్ము బట్టు పాదానికేనా ఆ నవ్వు?
కృష్ణమోహన్ గారు, ధన్యుణ్ణి. ఎప్పటినుంచే ఛందోబధ్ధ పద్యాలు రాయాలనే కోరిక ఉండేది - ఈ మధ్యనే సాధ్యమవుతోంది. బ్లాగు చదివి మీలాగ ప్రోత్సాహం అందించే వారి సహాయం నాకు ఎంతో తోడ్పాటవుతోంది..
రాఘవ గారు, చూసాను, వ్యాఖ్య రాసాను. అన్నట్టు "BLACK FRIDAY" టపాలో నేను రాసిన పాదాలు ఓ సారి చూడండి.
వికటకవి గారు, థాంక్సండీ.
చదువరి గారు, ఈ పద్యానికి ప్రేరణ మీ టపా వల్ల కలిగింది. ధన్యవాదాలు.
రాకేశ్వరా, మనము మాట్లాడుతున్నదీ తెలుగు2.0నే
కదా? రాఘవ అన్నట్టు ఆంగ్లపంకములో మునిగి తేలుతూ..
Post a Comment