Monday, October 15, 2007

Coen brothers

ఉ. కోయెను సోదరుల్ జతగ కూడి వెరైటివి ఎన్నియోకధల్
రాయగ పాప్యులర్ కధలు రైయ్యని వెండితెరెక్కి హిట్టులై
చేయగ వారినిద్దరి నెసెట్టుగ ఎట్టిపటానికైన ప

ర్చేయద హాలివుడ్డు మరి రెడ్డుతివాచిని వారి ముంగిటన్

(ఇక వికటకవి గారి వ్యాఖ్యకి సమాధానంగా ఆంగ్ల పద ప్రయోగంలేకుండా రాసినది ఇదిగో..)

ఉ. కోయెను సోదరుల్ జతగకూడి విభిన్నపరంపరన్ కధల్
వ్రాయ విరాజిలున్ కధలు రైయ్యని వెండితెరెక్కి గొప్పవై
పోయె (ధనార్జనా పెరిగె) పొందిరి పేరును చిత్రసీమలో
పూయవ హాలివుడ్డుకడ పూలతివాచిలు వీరి బాటలన్



బ్లడ్ సింపుల్ నుండి మొదలు పెట్టి లేడికిల్లర్స్ దాక (ఒక్క హడ్ సకర్ ప్రాక్సి ని మినహాయించి) కోయన్ సోదరులు తీసిన చిత్రాలన్ని చూసేసాను. ఓ, బ్రదర్ వేరార్ట్ దౌ వాటిల్లో నాకు అత్యంత ప్రియమైన చిత్రం. వీరి కధనం చూస్తే నాకు ఎందుకో వంశీ చిత్రాలు గుర్తుకువస్తాయి. వీలు దొరికినప్పుడు వారి ఇతర చిత్రాల గురించి రాస్తాను. మీకు వారి చిత్రాలు నచ్చుతాయా?

8 comments:

Anonymous said...

గిరి గారూ,
మీ పద్యాల్లో కాసింత తెలుగు ఎక్కువగా వాడండి. కాస్త కొత్తవాళ్ళకూ పనికొస్తుంది కదా పద ప్రయోగం.

గిరి Giri said...

అయ్యా వికటకవిగారు,
మీ వ్యాఖ్య సవాలుగా తీసుకుని ఆంగ్ల పదాలన్నీ తొలగించి ఇంకొక పద్యం రాసాను..మొదటిది చక్కగా అరగంటలో రాసుకున్నా, రెండవది ప్రాణాలు తీసింది.

నాకున్న పరిమితమైన పదజాలం వల్లే ఆంగ్ల రాతలు, తెలుగులో తప్పటడుగులు.అంతే కాని, తెలుగు పదం దొరికినా వాడకుండా మారుగా ఆంగ్ల పదప్రయోగం చేయలేదెక్కడా.. :)

గిరి

చదువరి said...

గిరి గారూ, మీకీ ఛందాలపై మంచి పట్టు ఉంది. అలవోకగా రాసేస్తున్నారు. మొదటి దానికంటే రెండో పద్యం అందంగా ఉంది.

బ్లాగేశ్వరుడు said...

ప్రయోగం

బ్లాగేశ్వరుడు said...

నా వేగు చిరునామా నుండి చొప్పదంటు వేగులు రావు, పోవు, అన్ని సంఖ్యలు గుర్తు పెట్టుకోవడం మాములుగా జరగదు.మీరు ఇంత త్వరగా వృత్తాలు వ్రాస్తుంటే చాలా ముచ్చటగా ఉన్నది కొద్దిగా కుళ్ళుగా ఉందిఅని వ్రాద్దామని అనుకొన్నాను. నాలుగు సార్లు వ్రాశాను, నాలుగు సార్లు నొక్కాను, ప్రతి సారీ తప్పిపోయేది. సరే ఆ

కొత్త పాళీ said...

కోయెను సోదరుల సినిమాలంటే నాకూ ఇష్టమే. ముఖ్యంగా తలతిక్క పాత్రలు. నాఖు బాగా నచ్చినది ఫార్గో.

Anonymous said...

గిరి..మీ ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఇచ్చాను:
http://gsnaveen.wordpress.com/2007/09/19/anna_blaagaadu/#comment-529

Anonymous said...

ఇప్పుడు హాయిగా ఉందండి చదువుకోటానికి. :-)