Sunday, October 28, 2007

Mow-glee

మ.కో. కత్తెరేయుట, అడ్డకోయుట, గాటుపెట్టుట, గొర్గుటా,

గుత్తగా ముడి పీకివేయుట, కొప్పు మాయము చేయుటా,
బొత్తిగామరి చేతికందని బెత్తెజానలె దిక్కుగా
జుత్తునంతయు తీసివేయుట, జూలు మట్టము చేయుటా

ఆ.వె. గుండు గీసి చల్లగుండు విధముగ గం
ధము పులుముట; బాగ తలనలంక
రించుట; ఇవి కొన్ని రీతులు మంగలి

వాళ్ళు తలకు చేయు మంగళ సేవకు

==

కాని, మనకి ఏ సేవ కావాలో సమయానికి సరిగ్గా చెప్పకోకపోతే కొన్ని కష్టాలు రావచ్చు. ముఖ్యంగా అమెరికాలో.

మన దేశంలో మంగలివారికి సాటి ఎవరూ లేరనే చెప్పాలి. ఒక్కసారి వెళ్ళామంటే చాలు, ఇక మళ్ళీ వారికి తలని నీలాలని ఎలా (ఏ పాళ్ళలో) వేరుచేయాలో చెప్పనవసరం ఉండదు. ఏవెంత మోతాదులో దర్శనమివ్వాలో వారు త్వరగానే పసిగట్టేస్తారు. అమెరికా మంగలి వాళ్ళు అలా కాదు, బడుధ్ధాయిలు ‘పదిని రెండుతో గుణిస్తే ఎంతా?’ అంటే తలగోక్కుని తెల్ల మోహం వేస్తారేమో గాని, గొరగడంలో మాత్రం గణితాన్ని బాగా జొప్పిస్తారు. ‘రెండు’ అనగానే యంత్రాల్లాగ చకచకా సాగిపోయి అన్ని వైపుల నుంచి సరిసమానంగా అగుపించేలాగ జుట్టుని తేసేయడం వారి స్పెషాలిటి.

కొత్తగా అమెరికాకి వచ్చిన మనవాళ్ళకి ఈ అంకెల గొరుగుడు వెంటనే కొరుకుడు పడదు. కాస్త బుఱ్ఱని ఉపయోగించాల్సి ఉంటుంది మరి. లేదా, కష్టాలు (అప్పుడప్పుడు గుండ్లు) తయారవుతాయి. అలాంటి కష్టమే నాకు ఒకప్పుడు వచ్చింది. బుద్ది తెచ్చుకున్నాక రెండవసారి గుండు వెంట్రుక వాసిలో తప్పింది.
అసలు విషయమేమనగా....

అది ఇక్కడ ఎప్పుడో రాసాను, ఇప్పుడు మళ్ళి మీ ముందు ఉంచుతున్నాను.

In India my visits to barbershop weren't intellectually challenging. I usually said "medium" or "the usual" and the barber knew what that meant. He was quick, never made me look much worse than i already was, and i was happy. Here in the US, a barbershop visit is a whole new ball game. One wrong word and you could end up with a tonsured head.


I was flipping a magazine, when he politely said "Sir" indicating it was my turn. I walked up, sank in to the chopping chair and said "medium". He asked me patiently "what NUMBER?", i said "WHAT number??", he said "like 2,3,4 for your hair". I didn't know whether that meant inches or centimeters - but i figured since metric system isn't so common in the US, he must've meant inches; and 2 inches fell in my ballpark of medium. So i said 2.


Before i could see a sample of 2 or change my mind or both, he created a 2 inch wide valley that was hairbreadth away from a tonsure, in the middle of my pate. I was aghast, but there was no use resisting at that point. I let him mow the rest too. I couldn't use a comb for 2 months.

I grew wiser since then, now I regularly mention side numbers and the top numbers also at the barbers’.

But the other day, in another shop, i said 2 on the side and 5 on the top. He (a different he) signalled me to a sample head that was a victim of fresh-and-stylized-tonsuring and asked "do you want that?". That elicited an emphatic NO without much thought from me. He said "then say 2 on the side, and medium on the top". Yessir! Whatever it takes to make you understand i need a normal medium haircut; someone mowed me gleefully once, i won't be a mow-glee* again.

===

*mow-glee: short for someone's whose mop was mowed-gleefully :))

2 comments:

Bhãskar Rãmarãju said...

బ్రదరూ!!
బాగా చెప్పావ్!! నేను అందుకే క్షుర కర్మ నా స్వహస్తాలతో కొంచెం నా కళత్రం సహాయం తో గృహమ్లోనే కానిచ్చేస్తా :):)
బోడి, వాడు (చాలా వరకూ ఆమె, కొసరు ఆమె చెప్పె పిట్టకధల్ని ఓపిగ్గా వినాలికూడా - అర్ధం ఐనా కాక పోయినా) పెట్టె రెండో నెంబరు మనం పెట్టుకోలేమా :):)

Anonymous said...

i have been a victim as well..

Wonderful blog.

samayaabhaavam valla telugu lo raayalekapothunnanu...