Monday, October 01, 2007

బలైపోయిన ఒక పేరు

పేర్లలో రకాల గురించి ఇదివరకు చెప్పినప్పుడు అందులో తమిళనాట కొన్ని తెలుగు పేర్లెలా దెబ్బతింటాయో రాసాను కదా? అలాంటిదే కానీ కొంచెం రివర్స్ లో జరిగిన విషయమిది.

తమిళంలో త కి, ద కి రాయడంలో తేడాలేకపోవడంవల్ల వాళ్ళు పలకడం కూడా త కి, ద కి మధ్య తేలిపోతున్నట్టు పలుకుతారు. అప్పట్లో నేను పనిచేస్తున్న కార్యాలయంలో బాలాజి కోదండపాణి అని ఒక తమిళుడు ఉండేవాడు.వాడు తన పేరుని ఇంగ్లీషులో బాలాజి కోతండపాణి (Balaji Kothandapani) అని రాసేవాడు. అది చదివిన మా గుంపులో హింది మాట్లాడే కొందరు వాణ్ణి, 'బాలాజి కో ఠండా పాని' (బాలజి కి చల్లని నీరు), అని పిలిచేవారు. నాకు నవ్వాగేది కాదు.

No comments: