Thursday, October 05, 2006

పేరలల్లో రకాలు

పేర్లు రెండు రకాలండి; బలి-ఇష్టమైనవి , బలిష్ఠమైనవి.
మొదటి రకం పాపం ఇంటినించి బైటకి అడుగు పెడతాయోలేదో వాటి నామం పంగనామం అయిపోతుంది. శ్రీధర్, సీతరాం, శ్రీనివాస్ ఈ కోవకి చెందిన పేర్లు. వీరు పక్కింట శ్రీధరన్, సీతరామన్, శ్రీనివాసన్ గా మారడానికి ఎంతో సమయం పట్టదు. మరి గిరి, రవి, సురేష్ లాంటి బలిష్ఠాలు పక్కింటి తమిళ ధాటికి తట్టుకోవడమేగాక చెక్కు చెదరకుండ నిలిచి ఉంటాయి.

గొప్ప విషయమా?

నిజానికి పక్కింట్లో కన్నా దూరతీరాలు చేరి చెక్కు చెదరకపోవడం గొప్ప.

సాధ్యమేనంటారా?

సాధ్యమే, కాకపోతే నామధేయుల మీదా ఆధర పడివుంటుంది మరి; పేర్ల లాగే మనుషులూ రెండు రకాలు .

కొందరు తమ పేర్లని పొందికగా కాపాడుకుంటే, మరి కొందరు నోరు తిరగని వారి మాట రీతికి సరిపడే విధంగా వొత్తులూ గట్రా తీసేసి పేర్లను మార్చేస్తారు.

అవసరమా?

మా బంధువు చెప్పిన చిన్న బుడుగు ఛలోక్తి ఇక్కడ గుర్తుకొస్తోంది.

పక్కింటాయన: ఎంత్లా బులుగు? ఎంతేతున్నావు?
బుడుగు: నాకంతే పలకక అలాంతి మాతలు. నీకేం పోయేకాలం?

అదే విధంగా ఇక్కడి వాళ్ళు నోరుతిరగక మన పేర్లు వింతగా పలుకుతారు. ఆ వింతని మనమూ సొంతమనుకుంటే ఎలా చెప్పండి?

మన పేర్లని మనమే సరిగ్గా పలకక పోతే ఇంకెవరు పలుకుతారు చెప్పండి?

ఎలాంటి పేరునైనా బలిష్ఠం చేసుకోవడంలోనే ఉంది మన గొప్పతనం..

9 comments:

రానారె said...

నా పేరు స్వచ్ఛంగా ఉచ్చరించేదాకా వదలకుండా నేర్పించానిక్క్డడివాళ్లకు.

Bhale Budugu said...

hhahaha baavundi mee TapA..

Bhale Budugu said...

you have got good posts allover..accept my heartfelt greetings

చదువరి said...

గోపాల్ అని మా బావ ఉన్నాడు. ఊటీలో చదివాడు. ఒసారి తన అరవ స్నేహితుడిని వెంటబెట్టుకుని వచ్చాడిక్కడికి. ఈ మణికంఠ మా గోపాల్ ని కోబాల్ అని పిలిచేవాడు. (బలైందనమాట పేరు)

teresa said...

దూరతీరాల్లో మన లాస్ట్ నేం ఉచ్చరించడం వాళ్ళకి కష్టమైనప్పుడు సగానికి కత్తిరించడంఏ బెటర్ యేమో, రొజుకి వంద సార్లు పేరుని ఖూనీ చేయించుకునే బదులు.

గిరి Giri said...

చదువరి గారు, బావుంది :)
టెరెసా గారు, మన పేరైనా ఇంటి పేరైనా అమెరికన్లు ఉఛ్ఛరించడానికి కష్టపడ్డప్పుడు రానారె అన్నట్లుగా, వారిని పట్టుకు పల్లర్చాల్సిందే..మొన్నీమధ్యే మీటింగులో (నా స్వపరిచయం అయ్యాక కూడా) ఒకావిడ నన్ను 'జిరి' అని సంబోధించింది..చెప్పగానే సరిదిద్డుకుంది.

నవ్వొచ్చే ఇంకో విషయం, కొత్తగా పనిచేయడానికి వచ్చిన ఒక కాంట్రాక్టరు ఇంటిపేరు 'పాండి'; దాన్ని ఆవిడ 'పేండి'అని లోతొడుగుని గుర్తు తెచ్చేలా పిలవడం.

netizen నెటిజన్ said...

దక్షిణాది "మురళి" - ఉత్తరాది "ముర్లి"
అన్నపూర్ణ - అనా
కృష్ణ - క్రిస్
కమల - కెమి
కొన్ని పేర్లు..

Anonymous said...

World Of Warcraft gold for cheap
wow power leveling,
wow gold,
wow gold,
wow power leveling,
wow power leveling,
world of warcraft power leveling,
world of warcraft power leveling
wow power leveling,
cheap wow gold,
cheap wow gold,
buy wow gold,
wow gold,
Cheap WoW Gold,
wow gold,
Cheap WoW Gold,
world of warcraft gold,
wow gold,
world of warcraft gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold
buy cheap World Of Warcraft gold t3c6n7om

Anonymous said...

dating game by icp [url=http://loveepicentre.com/]online dating web site uk[/url] headline news speed dating for rich men http://loveepicentre.com/ minneapolis dating escort