కురొసావ యొజింబొకి డాషియల్ హామెట్ రెడ్ హార్వెస్ట్ కి నాకు కనిపించిన పోలికలు ఇవి.
సామ్యము గల విషయం | యొజింబొ చిత్రం | రెడ్ హార్వెస్ట్ పుస్తకం |
హీరో | పేరున్నవాడు, వీరుడు, ఇతన్ని చంపడం సినిమాలో ఎవరి తరమూ కాదు. కత్తిసాములోనే కాక యుక్తులు పన్నడంలో దిట్ట | పేరు లేనివాడు. తెలివైన డిటెక్టివ్. ఎలాంటి క్లిస్ట పరిస్తితులనించైనా, పక్కన ఎంత మంది హుళక్కి అన్నా తాను మాత్రం ప్రాణాలతో బైటపడతాడు. |
ఊరు | అన్యాయపు పుట్ట. రెండు ముఠాలు కొట్టుకు చస్తూ ఉంటారు. ఊరి పెద్దలు ఇద్దరు. | ఇదీ అంతే. ముఠాలు మూడు. ఊరి పెద్ద ఒకడు. |
పోలీసు వాడు | ప్రాణభీతితో ముఠావాళ్ళ అడుగులకి మడుగులొత్తు రకం | ఇక్కడా అంతే. |
హీరో ఉపాయాలు | రెండు ముఠాలకి కొంత దూరంగానే ఉన్నా, ఒకరి మీదకొకరిని ఉసిగొల్పుతాడు. తుడిచి పెట్టుకుపోయేలా కొట్టుకుచస్తారు వాళ్ళు. | ముఠాలని ఉసిగొల్పడం ఇక్కడా జరుగుతుంది. చిత్రంలో లాగ ఓ మారు సంధి కుదుర్చుకున్న ముఠాల మధ్య చిచ్చు పెడతాడు హీరో. |
విధ్వంసం | కొట్టుకు చచ్చేటప్పుడు ఒక ముఠా వారి సాకె మొత్తం నేలపాలవుతుంది. చిచ్చుకి దోహద పడుతుంది | ఇలాంటిదే ఒక సిన్నివేశం పుస్తకంలో ఉంది. |
రాకపోకలు | ఊరికి హీరో రాకతో సినిమా మొదలు, ముఠాల తుడిచివేత తర్వాత అతని పోక తో ఆఖరు | ఇక్కడా అంతే |
కారణం | ముఠాలని అంతమొందిచాలనే తపన తప్ప ఇంకే కారణము మనకి కనిపించదు | ఇంచు మించిగా అలానే ఉంటుంది. చిత్రంలో లాగ ఊరు వదలి వెళ్ళే అవకాశం ఉన్నా వదలక అక్కడే ఉండి పని పూర్తి చేస్తాడు హీరో. ఒక ముసలి వాడి వద్ద డబ్బు లాగినా, డబ్బు కోసం పని చేసినట్టు అనిపించదు. |
మీరేమంటారు?
No comments:
Post a Comment