Tuesday, October 02, 2007

అలవోక సినీ పృఛ్ఛకం (Random cine quiz) - 4

మూడవ పృఛ్ఛకంలో సౌమ్య అన్నిటికీ, విశ్వనాధ్ కొన్నిటికి సరైన సమాధానాలు చెప్పారు. అదే ప్రశ్న తరహాలో ఇంకోటి.

క, ఖ, గ ముగ్గురూ హింది చిత్రరంగంలో పేరుపొందిన సంగీతదర్శకులు. క, ఖ సమకాలీకులు కూడా. గ ని చిన్నప్పుడు రికార్డింగ్ స్టూడియోకి తీసుకు వెళ్ళే అలవాటు క కి ఉండేది. ఒక సందర్భంలో గొంతెత్తి ఏడుస్తున్న గ ని చూసిన ఖ - "ఏడుపు కూడా స్వరబధ్ధంగానే ఏడుస్తున్నావే" అని అబ్బురపడి ఒక స్వరంపేరు ముద్దు పేరుగా పెట్టాడు. గ పెరిగి పెద్దైన తర్వాత కూడా చాలా మంది ఆ పేరు (చ) తోనే పిలిచేవారు.

క, ఖ, గ ఎవరు? చ ఏమిటి?

(ఒక క్లూ: గ సంగీతం కూర్చడంలోనే కాక, తబల, హార్మొనిక (మౌతార్గన్) వాయించడంలో దిట్ట)

5 comments:

Anonymous said...

అయ్యా....సినీ ప్రశ్నలనగానే ఆసక్తిగా తెరవడం, ప్రతి సారీ హిందీకి సంబంధించిన ప్రశ్న ఉండటంతో నిరాశ చెందటం జరుగుతోంది. తెలుగు చిత్ర్రాలకు సంబంధించి ప్రశ్నలేసే కార్యక్రమం ఉందా లేదా....

గిరి Giri said...

ఉంది. ఐదవ టపాలో తప్పక చేస్తాను..

చేతన_Chetana said...

క - ఎస్.డి. బర్మన్
ఖ - ఆర్.డి. బర్మన్
చ - పంచం / పంచం దా
కాని ఈ ఖ ఎవరు?

Unknown said...

అవును! తెలుగైతే నేనూ పాల్గొంటాను

గిరి Giri said...

చేతన,
మీ సమాధానలు సరైనవి. ఖ 'నౌషాద్'. ఆర్.డి. బర్మన్ కి పంచం అనే పేరు రావడం వెనక ఇంకొక కధ కూడ ఉంది. చిన్నప్పుడు ఎప్పుడు 'పా', 'పా' అంటుంటే చూసిన అశోక్ కుమార్ 'పంచం' అని పేరు పెట్టాడని కూడా అంటారు.