Friday, October 26, 2007

వర కట్టనము, వరుణ్ణి కొట్టడము

ఇది చదవండి - అమెరికాలో ఉంటూ రెండు చేతులా ఆర్జిస్తున్నప్పటికీ వరకట్నపుమోజుతో చివరకు పెళ్ళే కాదు, గౌరవ భంగం కూడా చేసుకున్న ఒక దురాశాపరుడి కధ. (మితిమీరలేదనుకుంటే) వధువు కుటుంబం చేసినది మంచి పనే.

లగ్న పత్రికలు ఎలాగు అచ్చు అయిపోయాయి కాబట్టి ఇక ఆడపెళ్ళివారు వెనుతిరగలేరనే ధిమాతో ఇలాంటి వెర్రివేషాలకు దిగజారే వారందరికీ ఇదొక గుణపాఠంగాను, అనవసరమైన వత్తిళ్ళకి గురవ్వు వధువుల కుటుంబాలకు ఇది మార్గదర్శకం గాను కావాలి.

ఏమంటారు?

శా. ఎన్నో ఆశలు పెళ్ళిపైనె కుదిరే, ఎంతో ఘనోపేతమౌ
సన్నాహమ్మును పూర్తిచేసుకొన ఆశాభంగమై ఘాతముల్
తిన్నారక్కట కట్నకాన్కలతిగా తెమ్మంచు కక్కూర్తితో
పన్నాగమ్మును డబ్బుకాశపడి చేబట్టంగ వియ్యంకులే

ఆ.వె. దెబ్బతగిలె కాని దిమ్మతిరగలేదు
వేగమె నిలబడి గుభేలుమనగ
పెళ్ళికొడుకు గుండె పీకిరి పందిరి
బడిత పూజ చేయ, బంధుతెదుట

2 comments:

Unknown said...

భలే బాగా పెళ్ళి చేసినట్టున్నారుగా!! వధువు కుటుంబానికి శెభాషులు

rākeśvara said...

కొన్ని రోజుల్లో మీ బ్లాగు కావ్య బ్లాగై పోతుందేమో...
పాపం ఆ వరుడు జైలు పాలయ్యాడు.