ఉ. చిత్రవిచిత్రముల్ చలనచిత్రములై తెరకెక్కగా అవే
చిత్రములెన్నియో తెరపి చిక్కని రీతిగ చూసినా సరే
ఆత్రము తగ్గదేం అరెరె ఆకలి కేకల తీరుగా అహో
రాత్రము పెంపుదానగుచు రాతల పిచ్చియు హెచ్చుచేసెనే!
(అనామక వ్యాఖ్య వల్ల మొదటి పాదం చివర కొన్ని మార్పులు చేసాను)
ఉ. చిత్రవిచిత్రముల్ చలనచిత్రములై తెరకెక్కియాడ త
త్చిత్రములెన్నియో తెరపి చిక్కని రీతిగ చూసినా సరే
ఆత్రము తగ్గదేం అరెరె ఆకలి కేకల తీరుగా అహో
రాత్రము పెంపుదానగుచు రాతల పిచ్చియు హెచ్చుచేసెనే!
నేను ఈ రోజు రెండున్నర గంటలపాటు బుఱ్ఱతో కుస్తీపడి రాసిన పై ఉత్పలమాల మీముందు ఉంచుతున్నాను. చదివి మీ అభిప్రాయం చెప్పిండి. నా ఈ కాకిపిల్ల రెండుకాళ్ళ మీదా నిలబడి తన గురించి తాను పూర్తిగా చెప్పుకోగలుగుతోందో, లేక నేను వివరణ రాయాలో మీ ప్రతిస్పందనల వలనే తెలుస్తుంది. అలాగని ఇటకముక్కలు, పూలగుఛ్ఛాలు విసరడానికి మొహమాటపడకండి. నెనరులు!
8 comments:
baguMdaMDi. kAni "avE citamulu" ani sAmAnyaMgA upayOgiMcaM kadA.
మంచి ప్రయత్నమండీ. భావం కూడా బాగుంది. పూడిక మాటలు (ఫిల్లర్లు) కూడా తక్కువే. మన ఛందో వీరులంతా ఇతరత్రా బిజీగా ఉన్నట్టున్నారు, లేకపోతే ఈ పాటికి ఇక్కడ దండు విడియ వలసిందే!
అనామకం గారు, అవే చిత్రముల బదులు ఇంకేమైనా వాడచ్చునేమో ఆలోచిస్తాను. నెనరులు.
కొత్తపాళీ గారు, పూడిక మాటలు లేపపోతే పద్యాలు రాయాలనే నా కోరిక పూడుకు పోయేదేమో :) వాటిని దూరంగా ఉంచాలనే మీ సూచనని మున్ముందు ప్రయత్నాలకి బుఱ్ఱలో తప్పక ఉంచుకుంటాను.నెనరులు.
గిరిగారూ, మంచి ప్రయత్నం. బాగుంది. అర్థం కూడా అయ్యింది. ఇదే జోరు కొనసాగించండి.
అన్నట్లు, "అనామకం"గార్కి యిలాకూడా చెప్పవచ్చేమో చూడండి:
ఉ. చిత్రవిచిత్రముల్ చలనచిత్రములై తెరకెక్కుచుండగా
చిత్రములన్నియూ తెరపి చిక్కని రీతిగ చూసినా సరే
ఆత్రము తగ్గదేం అరెరె ఆకలి కేకల తీరుగా అహో
రాత్రము పెంపుదానగుచు రాతల పిచ్చియు హెచ్చుచేసెనే!
రాఘవగారు, బావుంది మీ పూరణ..
పద్యగుంపుకి స్వాగతం.
బాబోయ్ ఉత్పలమాల చంపకమాలలే!
మేము జాతులతో, ఉపజాతులతో కొట్టుకుంటుంటే,
మీరు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టు కొట్టారు.
చాలా చాలా బాగుంది.
ఈ వూపుని ఇలా నే కొనసాగించండి.
(మీ కమెంటు ఫీడ్ కూడలి కమెంటులలో లేకపేతే, వీవెన్ ని జెత చేయమనండి )
Awesome!!! i did nt know your expertise in telugu. these poems are like fresh flowers,original and memorable for their essence. thank you .
santu
Post a Comment