Wednesday, October 03, 2007

అలవోక సినీ పృఛ్ఛకం (Random cine quiz) - 5

ముచ్చటగా మూడు తెలుగు ప్రశ్నలివిగో..

1. బాలనటిగా తెలుగు తమిళ రంగాలలో పేరుతెచ్చుకున్న ఈ నటి, పెరిగి తెలుగు తమిళ రంగాలే కాక హింది రంగాన్ని కూడా ఒక ఊపు ఊపింది. ఈమె బావమరిది హింది రంగంలో పేరున్న నటుడు. అతను తెలుగులో ఒక చిత్రంలో నటించాడు కూడా. కన్నడలో అతను నటించిన ఒకే ఒక చిత్రానికి ఒక నూతన దర్శకుడు పని చేసాడు. ఆ దర్శకుడు అటు తర్వాత ఒక తెలుగు చిత్రం, పలు తమిళ హింది చిత్రాలు చేసి చాలా పైకి వచ్చాడు. ఇతని భార్య దక్షిణ భారత భాషలలో పేరు తెచ్చుకున్న నటి. ఈ నటి బాబాయ్ ప్రసిధ్ధి పొందిన ఒక కధానయకుడు.

మొదట చెప్పిన కధానాయకి, చివర చెప్పిన కధానాయకుడు పలు హిట్ చిత్రాలలో నటించారు. వాళ్ళు నటించిన ఒక చిత్రంలో ఇద్దరూ అద్భుతమైన నటన ప్రదర్శించారు, కానీ కధానాయకుడికే ఉత్తమ నటుడి జాతియ పురస్కారం లభించింది. తెలుగులో కూడా వచ్చిన ఆ చిత్రం పేరేమిటి.

2. 'ఆయనే రాముడి పాటలు పాడుకున్నారు. ఆయనే నారదుడి పాటలు, చివరకి చాకలివాడి పాటలు కూడా పాడుకున్నారు' అని ఒక గాయకుని గురించి ఇంకో గాయకుడన్న మాటలివి. ఎవరా చాకలి వాడు, ఏమా చిత్రం. గాయకులని కూడా గుర్తించండి. (ఈ ప్రశ్నకి ఒక సవరణ ఇక్కడ ఉంది)

3. 'చిన్నప్పుడు అందరికి ఆలిండియా రేడియో ఉంటే నాకు మాత్రం బాలిండియా రేడియోనే' అని బాలుని పొగిడిన గాయకుడు ఎవరు.

4 comments:

dosanara said...

1.Vasanta Kokila
2.Relangi, Lavakusa , Ghantasala and ??
3.??

చేతన_Chetana said...

1.vasantha kokila
2.?
3.?

కొత్త పాళీ said...

Wow quite a few tough nuts.
I got lost about half through the first one .. right around the kannada movie. Then saw the two answers and worked my way backwards to identify the rest of the characters in the q.
Second q - probably ghantasala singing in Lavakusa .. he sang for both Ramarao as Rama and Relangi as washerman and probably for Narada too. DOn't know who's the commenting singer .. Madhavapeddi, perhaps?
No clue abotu the 3rd q.

Unknown said...

౧.వసంతకోకిల
౨.ఇది నాకు తోచలేదు
౩.మనో (నాగూర్ బాబు) ?