Wednesday, October 24, 2007

మాయాబజార్ ప్రశ్న

నేను సైతం గారిని చూసి, నేను సైతం నేను సైతం అంటున్నాను, మాయాబజార్ గురించి - ఒక చిన్న ప్రశ్న వేద్దామనే ఉద్దేశ్యంతో...

మాయా బజార్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసినది ఎవరు, ఏ పాత్రలు. చెప్పుకోండి చూద్దాం.

11 comments:

బ్లాగాగ్ని said...

నాగభూషణం. ఒకపాత్ర సాత్యకి రెండోది గుర్తు రావట్లేదు.

Anonymous said...

వల్లూరి_బాలకృష్ణ

Anonymous said...

బాలకృష్ణ (అంజి గాడు) అని గుర్తు. ఒక పాత్ర లక్ష్మణ కుమారుడి సేవకుడు, రెండవ పాత్ర గుర్తులేదు. ఈ వారాంతములో మళ్ళీ ఒక సారి చూసి రాద్దామనుకున్నా.ఇప్పుడే చూస్తే మాయాబజార్,గుండమ్మకథ,మిస్సమ్మ డివిడిలు గల్లంతు :(
ఎవరు తీసుకువెళ్ళారో ఫోనులు చేసి కనుక్కోవాలి.
-నేనుసైతం

Anonymous said...

Savitri

Anonymous said...

రెండోది రథసారధి పాత్ర అనుకొంటా.

Mallik said...

బాలక్రిష్ణ - ఒకటి లక్ష్మణకుమారుడి రధ సారధి, ఇంకొకటి ఘటోత్కచుడు ద్వారక కి వచ్ఛినపుడు ద్వారపాలకుడు - "తానె తన్నెననే" అని పాడే వాడు

కొత్త పాళీ said...

ద్విపాత్రాభినయం అంటే ఒకే నటుడు (నటి) ఒకే సీనులో రెండు పాత్రలలో కనిపించడం. వేర్వేరు సీన్లలో వేర్వేరు పాత్రలు వేసినా అది ద్విపాత్రాభినయం కాదు.
సావిత్రి - శశిరేఖ మరియూ ఘటోత్కచుడు (మాయా శశిరేఖ) .. సీను: ఘటోత్కచుడు మొదట ద్వారక నించి నిద్రపోతున్న శశిరేఖని ఎత్తుకుని తన ఆశ్రమానికి తీసుకురాగానే అక్కడ జరిగే సన్నివేశం. అభిమన్యుణ్ణి ఏడిపించడానికి ఘటోత్కచుడు శశిరేఖ వేషంలో ఉంటాడు. అప్పుడే నిజం శశిరేఖ నిద్ర లేస్తుంది. ఒకే దృశ్యంలో ఇద్దరు సావిత్రులు కనిపిస్తారు.

గిరి Giri said...

కొత్తపాళీ గారు,
నేను ఒకే నటుడు రెండు పాత్రలు పోషించడం అని అడుగుదామనుకున్నాను (ఒకే సన్నివేశంలో వారు దర్శనమివ్వడం జరిగినా జరగక పోయినా).

మీరు ఇచ్చిన వివరణ వల్ల నా ప్రశ్న కాస్తా trick question లా తయారయ్యింది..కాని, అది నేను అలా ఊహించి అడిగింది కాదు.

నేను అనుకున్న జవాబు, నవీన్, నేను సైతం, మల్లిక్ చెప్పినదే - బాలకృష్ణ అని. మల్లిక్ గారు ఆ రెండు పాత్రలు ఏమిటో కూడా చెప్పారు.

కొత్త పాళీ said...

Are you sure? I don't think the door keeper ir Balakrishna. Was this "fact" mentioned anywhere?

గిరి Giri said...

ఎక్కడో చదివిన గుర్తు, కాని ఏ పాత్రలో చెప్పలేదక్కడ.అందుకని మళ్ళీ సినిమా చూస్తే తెలిసింది.

Mallik said...

ఆ రోజుల్లో చిన్న చిన్న పాత్రలకి టైటిళ్ళలో క్రెడిట్ ఇచ్చే వారు కాదు. సినిమా జాగ్రత్తగా చూస్తే బాలక్రిష్ణ అని ఇట్టే పట్టుకోవచ్చు.