మా ఇంటి దగ్గర ఉన్న లైబ్రరీలలో ఒక సదుపాయం ఉంది. వారి దగ్గర లేని పుస్తకాలు, డివిడిలు మొత్తం మేరిలాండు లైబ్రరిలలో ఎక్కడైనా ఉంటే, సాలెగూళ్ళలో మనం వెతుక్కుని వాటిని కావాలని అభ్యర్ధన పెట్టుకుంటే, చిల్లి గవ్వ కూడా అడగకుండా తెచ్చి పెడతారు.
బావుంది కదా అని రెండు కురొసావా సినిమాలు కావాలని చెప్పాను. ఒకటి 'డ్రంకెన్ ఎంజల్' ఇంకోటి 'సంజురొ' - ఎప్పుడెప్పుడొస్తాయా అని ఆత్రుతతో ఎదురుచూస్తున్న నాకు, ఈ రోజు వచ్చి పట్టికెళ్ళమని ఒక వేగు వచ్చింది. లైబ్రరీకి వెళ్ళాను.రెండు పెద్ద పెట్టెలు - ఒక్కొక్కటి ఐదు కేజీలకి తక్కువ ఉండదనుకుంటా- తీసుకెళ్ళమని నా చేతిలో పెట్టారు. ఇంత పెద్దగా ఉన్నయేంటిరా బాబు అని నేను నోరు వెళ్ళ బెట్టాను. ఇదివరకూ పుస్తకాలు తెప్పించా కానీ సినిమాలు ఇదే మొదటి సారి కావడం వల్ల, ఏమోలే కెసెట్లని చక్కగా చుట్టి చెక్కుచెదరకుండా పంపారేమోనని అనుకున్నా. కానీ మనసులో ఓ మూల చిన్న అనుమానం. అనుమానాలని అణగదొక్కి చివరకి రెండు పెట్టెలని ఇంటికి పట్టుకొచ్చేసా.
ఒక పెట్టె తెరిచి చూస్తే అందులో సినిమా రీలుంది. హార్నీ, 'మోషన్ పిక్చర్' అంటే బడుధ్ధాయిలు ఏకంగా సినిమా రీలునే పంపేసారే! ఇది చూడడానికి ప్రొజెక్టర్ సదుపాయం ఏదైనా ఉందా అని లైబ్రరీకి కాల్ చేసాను. అక్కడి ఆయన కనుక్కుని రేపు చెపుతానన్నాడు. చూద్దాం ఏమి జరుగుతుందో. ఈ రాత్రి సంజురొ కవర్ చేసేద్దామనుకున్న ఆలోచన ఆలోచనలానే మిగిలింది.
నమ్మకం కుదరలేదా? మీరే చూడండి.
1. రీళ్ళు
2. డివిడి పక్కన రీళ్ళు - అవి ఎంతున్నయో అంచనా కోసం; అటు తర్వాత సాక్షాత్తూ రీలే..
8 comments:
అయిందా? మంచి శాస్తి జరిగింది :-))
నవ్వు ఆపుకోలేక పోతున్నాను.
ROFL!
bhale undi kada. enta varaku ayye pano teliyadu kani, chakkaga projector kuda dorikithe, pedda screen meeda, interest unna friends andaritho kalisi chuste bhale untundi.
నాడా దొరికింది. గుఱ్ఱాన్ని కొనండి
-- విహారి
కొత్త పాళీ గారు,
ఇంకా పూర్తిగా కధ అవ్వలేదు. లైబ్రరీ వాడు ఎక్కడైనా ప్రొజెక్టర్ ఉందేమో చూస్తున్నాడు. దొరకుతుందని ఆశగా ఉంది నాకు. ఇంకోటి, నిన్న ఇవి రాగానే నేను పెట్టిన మిగత అభ్యర్ధనలు చూసుకున్నా, అందులో ఒక్కటే 'మోషన్ పిక్చర్' అని ఉంది, మిగతావి 'డిస్క్' లేక్ 'వీడియో రికార్డింగ్' అని ఉన్నాయి. హమ్మయ్య!
టెరెస, చేతన,
:))
విహారి,
:) గుఱ్ఱాన్ని కూడా అద్దెకిచ్చేలా ఉన్నారు. చూద్దాం.
చేతన,
అప్పుడే ఒక జంటని ఆహ్వానించేసాను, ప్రొజెక్టర్ దొరికితే పండగే అని అనుకున్నాము - వాళ్ళకి చూడాలని చాలా కోరికగా ఉంది.
హిహ్హీ...
Since you are close to
Washington DC Take this to the Smithsonian museum, have it converted into video format and take it to the corner video shop and convert into DVD format..Again load it on the SD card..then enjoy at th etraffic stops on the GPS...by the way burn few DVDs and give to your friends and also donate to Your library
Post a Comment