Monday, October 01, 2007

Another bolt from the blue

ఇది నా అనుభవం కాదు, నా ప్రియమైన ఇతర సగానిది. తను PhD కోసం చదువుతోంది. ఎందరో ఇప్పటివరుకు ‘ఉద్యోగానికి చెడి పి ఎచ్ డి’ అని జాలి చూపించిన సంఘటనలున్నాయట. కాని వాటన్నిటిలోనూ కేకుని కైగొనేది (one that takes the cake) ఒకటుంది.

తన స్నేహితురాలిని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొకామె కలిసింది. పరిచయాలు అయిపోయిన తర్వాత వాళ్ళ సంభాషణ..

(ఇస: ఇతర సగం; ఇస్నే: స్నేహితురాలు; ఇస్నేస్నే: స్నేహితురాలి స్నేహితురాలు)

ఇస్నేస్నే: నేను తను ఒకే కంపెనీ లో పనిచేస్తాము. నువ్వేమిచేస్తున్నావు?

ఇస: PhD కోసం చదువుతున్నాను

ఇస్నేస్నే: (జాలి ఆవహించిన మొహంతో) అయ్యో ఎక్కడా ఉద్యోగం దొరకలేదన్నమాట!

ఇస్నే: (మొహమాటం ఆవహించిన మొహంతో) అయ్యయ్యో అలా కాదు, తాను ఇష్టపడే చేస్తోంది.

ఇస్నేస్నే: (జాలి తగ్గక) అవునా, నేనర్ధం చేసుకోగలనులే.

ఇస, ఇస్నే: (మొహమాటము, లోలోపల నవ్వు, పైకి అవ్వాక్కు!!)

3 comments:

Raja Rao Tadimeti (రాజారావు తాడిమేటి) said...

phD అంటే జనాలలో ఇంత తక్కువ అభిప్రాయం ఉన్నట్లు నాకు తెలీదు..!! మీ "ఇతర సగం" సరి అయిన రిటార్టు ఇచ్చివుంటే బాగుండేది..

S said...

hmm.... repu nenu kuda mee itara sagam position lo avaakkoutu untaanu emo ani anipistondi!

గిరి Giri said...

రాజారవు గారు,
సౌజన్య చెప్పేంత వరకూ నాకు తెలియలేదు..రిటార్టు విషయమంటారా, మా ఇద్దరికీ 'delayed retort syndrome' ఉంది. అవసరమైనప్పుడు తట్టవు కానీ, తర్వాతెప్పుడో అమోఘమైన రిటార్టులు స్ఫురిస్తాయి.

సౌమ్య,
PhD చేయాలనుకుంటున్నారా? మంచిది. మీకు అంతా సానుకూలంగా అవ్వాలని ఆకాంక్షలు..