ఉ. దుష్ట సమాసముల్, తగని తుఛ్ఛపు సంకర జాడ్య మౌఢ్య భూ యిష్ట ప్రయోగముల్, అతిశయించిన దుష్పదజాల వెల్లవల్ తిష్టలు వేసె నీ కలము తెచ్చిన పోకడవల్ల మూర్ఖుడా, భ్రష్టవు భాష నీ చలువ వల్ల, నరాధమ ఓ సినీకవీ!
5 comments:
Anonymous
said...
బాగా తలంటుతున్నారండీ. నేను మటుకు చాలా ఆనందిస్తున్నాను మీ పద్యాలు చదివి.
ఈ సారి బాగా రాసారు ,వచ్చేసారి కాస్త మృదువుగా... ఇక సినీ కవుల విషయానికొస్తే ,వాళ్లు మరీ అంత చెడ్డ వాళ్ళేం కాదు ప్రతీ పాట వెనుక ఒక పాత్ర ఉంటుంది , ఆ పాత్ర భౌతిక ,సామాజిక ,మానసిక పరిస్థితిని బట్టి, పాట వెనుక ఉన్న సందర్భాన్ని బట్టి కొన్ని రకాల భావాలు,పదాలు,పద అమరికలు, పద ప్రయోగాలు చెయ్యాల్సి ఉంటుంది అంచేత పాటని పాఠకుడి గా కాకుండా పాత్ర గా చూడాల్సి ఉంటుంది మనకి ఆ పాత్ర , ఆ సినిమా నచ్చకపోతే ఆ పాట నచ్చడం కొంచెం కష్టమే దానికి మనం సినీ కవిని తిట్టడం అన్యాయమే కాస్త కనికరించండి
మీకు నా పూర్తి సమర్థన. ఇలా ఎంత తిడితే అంత మంచిది. దుష్టసమాసాల గుఱించి కాదు గానీ - వాళ్ళు రాసేది తెలుగు కాకపోయినా తెలుగుపాట అని ప్రచారం చేసుకుంటున్నందుకు. సంభాషణలూ అంతే ! అంతా కిచిడీ వ్యవహారం. అనకూడదు గాని వట్టి bastardized Telugu. పైగా "ఇదే ఇప్పుడు hot"అని బుకాయించడం.
నాగమురళి గారూ, సంతోషం బ్లా.వి గారు, ఇక ఓ మత్తకోకిలో, ధృవకోకీలో (తరలము) ఆలోచించాలి - మరింత మృదువుగా మొట్టాలంటే బాలసుబ్రహ్మణ్యంగారు, నాకు తెలిసి సీతారామశాస్త్రిగారు తప్ప మిగతా వారందరూ ఆ కోవచెందిన వారే రాఘవా, తిట్టడానికేమి హాయిగా ప్రేక్షకుణ్ణి అని చెప్పి తిట్టేయచ్చు (తిట్టుకోవడానకి మన సినిమాలు, కవులు మనకి చాలా అవకాశాలు ఇస్తున్నారనుకోండి) కానీ సినీకవిగా అవతరించేటంతటి శక్తి నాకు లేదు
5 comments:
బాగా తలంటుతున్నారండీ. నేను మటుకు చాలా ఆనందిస్తున్నాను మీ పద్యాలు చదివి.
ఈ సారి బాగా రాసారు ,వచ్చేసారి కాస్త మృదువుగా...
ఇక సినీ కవుల విషయానికొస్తే ,వాళ్లు మరీ అంత చెడ్డ వాళ్ళేం కాదు
ప్రతీ పాట వెనుక ఒక పాత్ర ఉంటుంది , ఆ పాత్ర భౌతిక ,సామాజిక ,మానసిక పరిస్థితిని బట్టి,
పాట వెనుక ఉన్న సందర్భాన్ని బట్టి కొన్ని రకాల భావాలు,పదాలు,పద అమరికలు, పద ప్రయోగాలు చెయ్యాల్సి ఉంటుంది
అంచేత పాటని పాఠకుడి గా కాకుండా పాత్ర గా చూడాల్సి ఉంటుంది
మనకి ఆ పాత్ర , ఆ సినిమా నచ్చకపోతే ఆ పాట నచ్చడం కొంచెం కష్టమే
దానికి మనం సినీ కవిని తిట్టడం అన్యాయమే
కాస్త కనికరించండి
మీకు నా పూర్తి సమర్థన. ఇలా ఎంత తిడితే అంత మంచిది. దుష్టసమాసాల గుఱించి కాదు గానీ - వాళ్ళు రాసేది తెలుగు కాకపోయినా తెలుగుపాట అని ప్రచారం చేసుకుంటున్నందుకు. సంభాషణలూ అంతే ! అంతా కిచిడీ వ్యవహారం. అనకూడదు గాని వట్టి bastardized Telugu. పైగా "ఇదే ఇప్పుడు hot"అని బుకాయించడం.
హహ్హహ్హ... బాగుంది, ప్రస్తుత సినీ కవులని ఆడిపోసుకునే బదులు మీరే సినీ కవ్యవతారమెత్తవలసినదని నా విన్నపం :)
నాగమురళి గారూ, సంతోషం
బ్లా.వి గారు, ఇక ఓ మత్తకోకిలో, ధృవకోకీలో (తరలము) ఆలోచించాలి - మరింత మృదువుగా మొట్టాలంటే
బాలసుబ్రహ్మణ్యంగారు, నాకు తెలిసి సీతారామశాస్త్రిగారు తప్ప మిగతా వారందరూ ఆ కోవచెందిన వారే
రాఘవా, తిట్టడానికేమి హాయిగా ప్రేక్షకుణ్ణి అని చెప్పి తిట్టేయచ్చు (తిట్టుకోవడానకి మన సినిమాలు, కవులు మనకి చాలా అవకాశాలు ఇస్తున్నారనుకోండి) కానీ సినీకవిగా అవతరించేటంతటి శక్తి నాకు లేదు
Post a Comment