Thursday, February 28, 2008

సహాయం కావాలి

చ. తెలుగు అకాడమీ మనకు తెచ్చెను అర్ధశతాబ్ది ఉత్సవ
మ్ములను పురస్కరించుకొని బోలెడు చక్కని చౌక పుస్తక
మ్ములనని, ఎక్కడో చదివి, పోయి సరాసరి నేను చూడడం
సులభముకాక, ప్రాణము ఉసూరనె; మార్గము చిక్కెనింతలో...

మా మామగారు నా కోసమని వెళ్ళి పుస్తకాలు కొంటానన్నారు! సంతోషమే - కానీ నాకు తెలుగు అకాడమీ ప్రచురణల గురించి ఎక్కువ తెలియదు. తెలిసిన రెండు మూడు పుస్తకాల పేర్లు, ఇద్దరు ముగ్గురు కవి/కధకుల పేర్లు చెప్పాను. (వారి ప్రచురణలో కాదో తెలియదు). అందువల్ల మీకు తెలిసిన చదవదగ్గ తెలుగు అకాడమీ ప్రచురణలు ఏమైనా ఉంటే వెంటనే తెలిపి పుణ్యం కట్టుకోండి.

3 comments:

కొత్త పాళీ said...

Look up the old posts in Rakesvara's blog - people poured suggestions in one of the posts.
Personally, I too am not familiar with Telugu Acad publications except as "official textbooks" for Intermediate :-)

Syam said...

Hello Kotha paali garu,

Rakesvara's blog ki link unte isthaara?

Thanks,
-Syam

గిరి Giri said...

కొత్తపాళీ గారు, మీరు చెప్పినట్టుగానే అక్కడ పాఠ్యపుస్తాకాలు తప్ప వేరేవి లేవట..ప్చ్.

శ్యామ్, లంకె ఇదే అయ్యి ఉండవచ్చు అని నా అనుకోలు