Tuesday, December 25, 2007

Don? Don't!

ఉ. దండిగ డబ్బుచేసుకొని నవ్వుతు బాంకుకి పోవుటెంత బా
గుండు కదా? ఇలాంటి చిరుకోరికలుండని వారి జీవితాల్
దండగలవ్వవా? పొగిడి నాకుతు పెద్దల కాళ్ళనీడనే
పండగ చేసుకొన్న, భలె బాగుగ కోర్కెలు సాధ్యమవ్వవా?


====

ఉ. డాన్సులవీ అదో రకపు స్టైలు, అలాగని ఊరుకోని లా
రెన్సు
ఎడాపెడా పటిమలేని కధాంశములెంచుకొన్ననూ
ఛాన్సులెలాగొలా దొరకసాగెను ప్రేక్షకమూకలో సినీ
ఫాన్సు మెదళ్ళమోదుటకు పైత్యపు దర్శకుడై తలెత్తగా
(పాపము ప్రేక్షక ఖర్మకాలగా!)

నేను డాన్ చూడలేదు కాని స్టైల్ అనబడే చిత్రహింసకి మాత్రం గురయ్యాను.

2 comments:

రాఘవ said...

కం.మన ఆంధ్రుల్లో పలువురు
సినిమా యేదైన గాని సిన్సియరుగ చూ
సి నిజానికి చూసినది న
టుని డేఁన్సు కొఱకనుట విని "థూ" అనుకున్నా.

గిరి Giri said...

రాఘవా, చూసేవారిది ఓ రకం వెర్రి, తీసేవారిది ఇంకో రకపు వెర్రి. మిగతా ఇక్కడ