Sunday, December 16, 2007

ఇల్లు దొరికింది

చ. బడలిక లెక్కచేయక రమారమిగా పది బాడుగిళ్ళు చూ
సెడి పని పెట్టుకుంటి, నివసించుటకో కుదురైన చోటుకై
పడిపడి రైలు, టాక్సిలను పబ్లికు బస్సుల వాడుకొంచు నే
చెడతిరిగాక చిక్కెనొక సింగిలు యూనిటు త్యాంగుబారులో

ఆఫీసుకి, సంతలకి దగ్గరగా, సదుపాయాలన్ని అందుబాటులో ఉన్న (ఇదివరకటి ఇంటికన్నాకాస్త పెద్దదైన) ఇల్లు దొరకడం వల్ల నాకు ఓ పేధ్ధ పని పూర్తయ్యి గుండెలమీంచి బరువుదిగినట్టు అనిపిస్తోంది.

4 comments:

అనిర్విన్ said...

కంగ్రాట్స్ గిరిగారు.

teresa said...

తర్వాతి టపాలో మీ ఊరి songbirds గురించి రాయండి మరి.

కొత్త పాళీ said...

సంతోషం. పడమటి గాలి తూర్పుకి మళ్ళినంత మాత్రాన ంఈ పద్యధార ఏమాత్రం వడి తగ్గలేదని హర్షం వెలిబుచ్చుతున్నాము. పద్యం అతి సహజంగా అలవోకగా జాలువారింది. మీ శ్రీమతి, చిరంజీవి కూడా కొత్తచోటికి సులభంగా అలవాటు పడతారని ఆశిస్తున్నాము.

గిరి Giri said...

లక్ష్మణ్ గారు, థాంక్సండి.
సావిత్రి గారు, తప్పక ప్రయత్నిస్తాను.
కొత్తపాళీ గారు, థాంక్సండి. మొదట్లో జెట్ లాగ్ ఈ సారి కొంచెం ఎక్కువ బాధపెట్టినా మిగతావన్నీ బావున్నాయి, అలవాటు పడడం నచ్చడం కష్టం కాకూడదని నా అభిప్రాయం.