Friday, October 19, 2007

అలవోక సినీపృఛ్ఛకం - 7 (సమాధానాలు)

1. తెలుగులో చిరంజీవి నటించిన ఈ చిత్రం పేరుతోనే దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం హిందిలో ఒక చిత్రం వచ్చింది. ఆ చిత్రం అనూహ్య విజయం వల్ల అందులోని హీరో హింది చలన చిత్ర రంగంలో కొన్నేళ్ళు ఒక వెలుగు వెలిగాడు. అందులోని పాటలన్ని చాలా ప్రాచుర్యం పొందాయి. వాటిలో భావోద్వేగ పూరితమైన పాట ఒకటి ఉంది. ఆ పాట చిత్రీకరణకి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటది?

జవాబు: చిత్రం పేరు ఆరాధన. పాట ‘రూప్ తెరా మస్తానా’. దీని ప్రత్యేకత ఏమిటంటే, మూడు నిమిషాలకు పైగా ఉన్న ఈ పాట మొత్తం ఒకే షాటులో తీసాడు దర్శకుడు శక్తి సామంత.. ఇంకా నమ్మకం కలగక పోతే యూ-ట్యూబ్ లో ఉన్న
ఈ వీడియో చూడండి.

2. రాకి (హింది), విక్రం (తెలుగు), ఆరెంజ్ కౌంటి (ఆంగ్లం) చిత్రాలకి ముడి వేయండి?

జవాబు: ప్రముఖ హీరోల కొడుకుల మొదటి చిత్రాలు. దోసనార, కొత్తపాళీ గార్లు సరుగ్గా చెప్పేసారు.

3. ఈ కధానాయకి మొదటి హింది చిత్రం ఒక తెలుగు చిత్రానికి రీమేక్. ఆ రెండు చిత్రాలలో ఆమే కధానాయకి. ఆ తెలుగు చిత్రానికి, వేటూరి గారికి ఒక ప్రత్యేక సంబంధం ఉంది. ఏంటది?

జవాబు: నటి జయప్రద. చిత్రం సిరిసిరి మువ్వ. వేటూరి గారు (జంధ్యాలతో కలిసి) సంభాషణలు రాసిని ఒకే ఒక చిత్రమిది.

4. శోభన, సౌందర్య, విద్యా బాలన్ - వీరు ముగ్గురూ ఒకే పని చేసారు, ఏమిటది? ఇదే చిట్టాలో ఇంకో కధానాయకిని కూడా చేర్చచ్చు, ఆమె ఎవరు?

జవాబు: చంద్రముఖి, జ్యోతిక. దోసనార గారు సరిగ్గా చెప్పారు

5. చంద్రమోహన్, కె రాఘవేంద్రరావు, చక్రవర్తి, కమల్ హసన్, భారతి రాజ, ఇళయరాజ - వీరిని ఒక చిత్రం ముడి వేస్తుంది. ఏమిటది?

జవాబు: సినిమా పదహారేళ్ళ వయస్సు. ఈ చిత్ర తమిళ మాతృకకి సంబంధించిన వారు చివరి ముగ్గురు. చంద్రమోహన్ కమల్ హసన్ వేసిన పాత్ర వేయగా, రాఘవేంద్రరావు భారతిరాజ లాగ దర్శకత్వం, చక్రవర్తి ఇళయరాజా లాగ సంగీత దర్శకత్వం చేసారు (సిరిమల్లె పూవా పాట ఇళయరాజా బాణియే)

6. శ్రీ శ్రీ రాసిన ఈ పాటని తెరమీద నాగేశ్వరరావు పాడుతుండగా రెప్పపాటు సమయం సంగీతదర్శకులు పెండ్యాల దర్శనమిస్తారు. ఏ పాట, ఏ చిత్రం?

జవాబు: ‘కల కానిది విలువైనది’ పాట. ఈ పాట నాగేశ్వరరావు స్టూడియోలో పాడతాడు. అక్కడ పెండ్యాల రప్పపాటు పాత్రలో కనిపిస్తారు. సౌమ్య సరిగ్గా చెప్పారు.

7. నట రత్న ఎన్. టి. ఆర్, హింది నటుడు గోవింద, హాలివుడ్ యువ నటుడు బ్రాండన్ రౌత్ - ముగ్గురికి ముడి వేయండి?

జవాబు: ముగ్గురూ సూపర్ మాన్ పాత్రలు ధరించారు.(హ హ...అవును!) దోసనార గారు సరిగ్గా చెప్పారు.

2 comments:

బ్లాగేశ్వరుడు said...

మేష్టారు, ఈ సినిమా మరియు సాహిత్య క్విజ్లులు చాలా కష్టంగా ఉన్నాయి, నాలాటి వాళ్ళు అందుకోలేక పోతున్నారు

Anonymous said...

ఆరాధన సినిమాలో 'మేరే సప్నోంకీ రానీ' పాట YouTube లో చూసాను. (వేరే లింకులో అనుకోండి). కాని ఈ పాట ఒకే షాట్‌లో తీసారని మీరు ఎందుకు వ్రాశారో తెలియలేదు. ఇందులో లాంగ్‌షాట్‌లు, క్లోజప్ షాట్లు.. ఇలా రకరకాల షాట్లు అనేకం ఉన్నాయండీ.....