Friday, September 28, 2007

A bolt from the blue

కొన్నేళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది.

ఓ ఏడాది పడ్డ కష్టాలకి ఫలితంగా ఐఐఎం కలకత్తాలో ప్రవేశం లభించింది. కొద్ది రోజులపాటు ఎక్కువ వోల్టేజ్ వచ్చినప్పుడు వెలిగిపోయే బల్బులా తయారయింది నా మొహం. కళ్ళు, కాళ్ళు భూమి మీద ఆనలేదంటే అతిశయోక్తే కానీ, అదే జరిగింది. సరే, అలా ఉన్నప్పుడు ఒక పాత స్నేహితుడు కలిసాడు. కాసేపు, కొంచెం పిచ్చాపాటి తర్వాత..

వాడు: ఏంజేద్దామనుకుంటున్నవ్ రా భై?

నేను: ఎం.బీ.ఏ అనుకుంటున్నా

వాడు: ఎక్కడ్ర భై?

నేను: ఐ.ఐ.ఎం కలకత్తలో (బల్బు వెలుగు ఇనుమడింపు!)

వాడు: కల్కత్తానా?

నేను: అవును

వాడు: హైద్రవాద్లో ఏం దొర్కలేదార భై, అక్కడికోతున్నవ్?

నేను: (మాడిన బల్బు)

కొద్దిసేపు అవాక్కు అనే పదానికి పర్యాయపదంలా అక్కడే నిలిచిపోయాను.

3 comments:

వెంకట రమణ said...

ఇలాంటిదే మరో అనుభవం లో చూడండి.

Unknown said...

హహహ... లే దొర్కలేద్రా భై...
ఏం జేస్తం అనవల్సింది :)

S said...

పాపం... తెలీదేమో లెండీ...
బాగా చదువుకున్న వాళ్ళలో కూడా ఈ తరహా జనరల్ విషయాలు తెలీకపోవడాన్ని చాలా సార్లు చూసాను నేను.