Saturday, September 30, 2006

ఇదేనా ఢంకా మోత?

ఈ ఫొటో చూడండి. ఒక పక్క స్టాలిన్ మోగిస్తున్న విజయ ఢంకా గురించి అలుపు లేని విధంగా ఆగని వార్తల రాతలు. ఇంకో పక్క ఇంటువంటి ప్రమోషన్స్. కధ ఎలాగూ "పే ఇట్ ఫార్వడ్" నుంచి దింపేసినట్టు ఉంది; ముగ్గురికి ప్రతిఫలాపేక్ష లేకుండా సహాయం చేయాలనే ఒక ఆలోచనని అమలు చేయడం వల్ల ఒక చిన్న పిల్లాడి జీవితంలో జరిగే మార్పులన్ని చూపించిన సినిమా అది.స్టాలిన్లో ఆ పిల్లడి అవతారం చిరంజీవి ఎత్తినట్టునారు.
ఇంతకు మునుపు మురుగదాస్ ప్రయత్నం "ఘజిని" - అదీ మెమెంటో నుంచి కొట్టి పట్టుకొచ్చాడు మహానుభావుడు. కొత్తలో అది మెమెంటో ప్రేరణ అని విని, అబ్బో అలాంటి అవకతవక టైంలైన్ సినిమాని తెలుగులో (సర్లేండి, తమిళ్ లోనే) ఎలా తీస్తాడా అని చాలా కుతూహలపడ్డా. తీరా సినిమా చూస్తే తెలిసింది, మెమెంటో నించి కాపి చేసినది "షార్ట్ టర్మ్ మెమరీ లాస్" అన్న ఒఖ్ఖ విషయాన్నే అని, మిగతాదంతా అర్ధంపర్ధం లేని స్వయంపాకమేనని.
అలాంటి ప్రతిభావంతుడు "పే ఇట్ ఫార్వడ్" లాంటి అంతగొప్పగాలేని సినిమాని తెలుగులోకి ఎలా తీస్తాడనే విషయం మీద నాకు పెద్ద ఆసక్తి కలగలేదు.మరి ఫ్రెమోంట్లో ఎవరో దీన్ని చూడడానికి వెయ్యినూటపదహార్లు (డాల్లర్లు!) చెల్లించారని విని ముందు ఆశ్చర్యము తర్వాత జాలి పడ్డా.ఎవరి పిచ్చి వారికానందం లెండి అనుకుని సరిపెట్టుకున్నా.

మరి అలాంటి వారు పై ఫొటో చూసి ఏమనుకుంటారు?


థియేటర్ ఓనర్ కూడా సినిమా చూసేసి దాన్లోని సారన్ని మూడవ వంతే అర్ధం చేసుంకుని ముగ్గురికి బదులు ఒక్కరికే ఉచితం పెట్టాడేమో.

Thursday, September 28, 2006

అంతాక్షరితో విసుగు కలిగితే...

పాటలు పాడడంలో మా స్నేహితుడిది ఎప్పుడూ వెనకంజే, వాడి పాట విని, దానిలోని సాహిత్యం ఎక్కడో విన్నట్లున్నదని తికమక పడేవారున్నరంటే అది అతిశయోక్తి కాదు. అంటే వాడి పాట వల్ల పక్కవాళ్ళకి అసలు పాట గుర్తుకు రాకపోగా ఇదెకాడో చదివిన విషయంలా ఉందనిపిచే సంధర్భాలు చాలనే ఉన్నాయి. ఓసారి మావాడు జగ్జిత్ సింఘ్ ఘజల్ పాడగానే పక్కనున్న వాళ్ళంతా ఫక్కున నవ్వారు. నేను నవ్వే వాడినే కాని, నా గాన-సూరత్వం అందరికీ తెలిసిన విషయం కాబట్టి నోరుమూసుకుని కూర్చున్నా.

అలాగని మేము అంతాక్షరిలో వెనకాడడం లేదు. పాడే ప్రావీణ్యతా, అంతాక్షరి ఆడగలగడం రెండూ ఒకటి కావని నా నమ్మకం. అదే నమ్మకం వలన ఇప్పటికీ చాల చోట్ల ఆడడం (పాడడం) జరిగింది. నే పాడే పాటలకి సాధరణంగా నిశ్శబ్దమో, లేక పాక్కవాడు త్వరగా తర్వాత పాట పాడడమో జరుగుతాయి - ఐనా అదంత పెద్దగా నేను పట్టించుకోను.

ఇంతకీ ఈ విషాలన్ని ఎందుకు చెప్పనంటే, కొన్నాళ్ళ క్రితం మా చుట్టాలు మా ఇంటికి వచ్చారు. నలుగురం భోంచేసి కాసేపు పిచ్చపాటి ప్రారంభించాము. కూర్చుని ఆడగలిగినదేదైనా ఉంటే బాగుండనిపించింది. నాకు అంతాక్షరి గుర్తుకు వచ్చింది కాని, ఇప్పుడే అందరూ చక్కగా నవ్వుతు కూర్చున్నప్పుడు నా గాన-ప్రావీణ్యతా ప్రదర్శన ఎందుకని కొంచెం మొహమాట పడి, తప్పని పరిస్థితిలలో ఒక కొత్త ఆటని కనిపెట్టా..తీరికగా ఆడడం మొదలుపెట్టాము.

కొత్త ఆట. అందండీ నేను చెప్పదలచుకున్న అసలు విషయం.

ఇహ ఆట సంగతా, చాల సులభం. ఇద్దరు సినిమా పిచ్చాళ్ళు, ఒక పెన్ను, ఒక చిత్తు పుస్తకం ఉంటే చాలు - ఆట మొదలెట్టేయచ్చు.

మొదట మీరు రెండు పేర్లు చెపుతారు. ఆ రెండు పేర్లక ఒక సినిమాకీ ఎదో విధంగా సంబంధం వుండాలి, అది అవతలవాళ్ళు కనుగో గలిగితే వారికి ఒక పాయంటు. లేదా ఆ పాయంటు మీకు. అంతే.

వినడానికి చాల తేలికగా ఉన్నా, మీరు సినిసంగతులు బాగా నెమరువేసినట్టైతే ఈ ఆటలో అవతల వాళ్ళని దున్నేయచ్చు. అనవసరమైన విషయాలన్ని బుర్రలో ఉంచుకోవడం అంత పనికిరానిపని కాదని చూపించే ఆట ఇది.

మొదలు పెట్టిన కొత్తలో మేము హీరో, హీరోయిన్ల మీదే ఎక్కువగా ప్రశ్నలు అడిగాము కాని పోగా పోగా నానా ప్రశ్నలూ మొదలుపెట్టాము. బుర్ర తిరిగి పోయింది. కానీ బాగా మజా కూడ వొచ్చింది.

వీలుంటే, మీ పక్కన సినిమా పిచ్చి ఉన్నవాళ్ళు ఉంటే, ఇది ప్రయత్నిచండి. మీకు ఇది నచ్చవచ్చు.

మీకోసం ఇక్కడ కొన్ని ప్రశ్నలు... ప్రయత్నిచండి. జవాబులు త్వరలోనే నా అభిప్రాయలలో రాస్తాను.

1. సుత్తి వేలు, షహుకారు జానకి
2. నాగేశ్వర రావు, రోజా
3. శుభలేఖ సుధాకర్, మురళీ మొహన్
4. కృష్ణ , ఇళయరాజా (నటన కాదు, కేవలం సంగీతమే)
5. సౌందర్య, చక్రవర్తి (సంగీతదర్శకుడు)

Saturday, September 23, 2006

టైం బాగుండడమంటే ఇదేనేమో

హరివిల్లులో శ్రీ రాసిన గత స్మృతి చదివగానే నాకు ఓ జరిగిన సంగతి గుర్తుకొచ్చింది. కాకపోతే ఇది 'టైం బాగున్నప్పటి' విషయం.
లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ లో చదివే రొజులు. ఒక రోజు ఎప్పుడు మా క్లాస్ కి టైంకి వచ్చే ఇంగ్లీష్ లెక్చరర్ రావడం కొంచెం ఆలస్యమైంది.ఇంకలాంటప్పుడు ప్రతివాడు గొంతెత్తి పక్కవాడితో అరుస్తూ మాట్లాడడమే.అలాంటి రణగొణ ధ్వని లో నెమ్మదిగా మాట్లాడితే ఎలాగూ సరిగా వినిపించదని అందరమూ అరవగల (గళ) స్థాయినిబట్టి మాట్లాడడం మొదలుపెట్టాము.
కొంచెం సేపటికి ఆ అల్లరి పక్కనున్న సెక్షన్లవారికి కూడా వినిపించే స్థాయికి చేరింది. అప్పుడే అటుగా వెళ్తున్న (ఫాదర్ అనబడే) మా ప్రిన్సిపల్ మా క్లాస్ గుమ్మం ముందొచ్చి నిల్చున్నారు.
మేము నాలుగు వరసల్లో కూర్చునే వాళ్ళం, ఆయన నుంచున్నది ఒక మూల, నేను కూర్చున్నది అదే పక్క ఇంకో మూలా - అందువల్ల ఆయన రాక నేను గమనించలేదు, కాని మిగతావాళ్ళందరికీ తెలిసిపోవడం మూలాన అంతా గప్-చుప్ . చుట్టూ నిశ్శబ్దమయిపోయినా నా కేకొక్కటి కాసేపు వినపడి ఆగిపోయింది; అదృష్ఠవశాత్తు ప్రిన్సిపల్ గారికి నేను కనపడలేదు.
ఇంకాతర్వాత ఎం జరుగుతోందో నాకు తెలిసేలోగా ప్రిన్సిపల్ గారు చర చరా నా ముందుకు నడిచి రావడం, నా ముందు కూర్చున్న వాడి చెంప ఛెళ్ళుమనిపించడం జరిగిపోయాయి.నా ముందు వాడు చెంప నిమురుకుంటూ తాను దెబ్బెందుకు తిన్నాడో తెలియక తికమక పడుతుంటే అది చూసి నాకు నవ్వు, నవ్వితే నాకూ అదేగతి పడుతుందనే భయము ఆగలేదు.
టైం బావుండడమంటే అదేనేమో.

హోండా కార్ తో కష్టాలు

నిజం చెప్పాలంటే కార్ తో ఏ కష్టాలూ లేవుగానీ సీ.డీ. ప్లేయర్ తో వచ్చాయి చిక్కులు. వివరాలు ఇక్కడ చదవండి.

Friday, September 22, 2006

Lawrence's Style (2/5)

dancer, juvenile killer uncaught,
lives in vizag a life unsought,
dances well with bullets in a knee,
also plays sycophant to a T,
full of senti, devoid of thought!

(So you better leave the DVD, un-rented, un-bought!)

Friday, September 15, 2006

అడకత్తెరలో పోకచెక్క

ఇంత క్రితం నేను 'తెలుగు పెరుగుతోందా?' అని ప్రశ్నించాను ; ఆ విషయం గురించి ఈ రోజు ఆలోచిస్తూంటే ఒకప్పుడు మా లెక్చెరర్ చెప్పిన ఒక విషయం గుర్తొచ్చింది. ఆయన కాల్క్యులస్ లో లెగ్రాంజెస్ సూత్రం* గురించి చెపుతూ ఒక తెలుగు గణిత పుస్తకములో లిమిట్ ని ఏవిధంగా వివరించారో చెప్పారు .
ఒక ప్రమేయానికి ఎడంపక్క లిమిట్ విలువ , కుడిపక్క లిమిట్ విలువ సమానమైన పక్షంలో ఆ ప్రమేయం లిమిట్ కూడ అదే విలువ అని. ఈ సిద్ధంతాన్ని ఇంగ్లీషులో ఎమంటారో మర్చిపోయాను కాని, తెలుగులో మాత్రం ఒక పుస్తకం వారు చాలా సృజనాత్మకంగా 'అడ కత్తెరలో పోకచెక్క' సిద్దంతమని పేరు పెట్టారట. కొద్దిగా ఆలోచిస్తే ఆ పేరు ఎంత ఉచితమైనదో అర్ధమవుతుంది.

ఇక నేను చెప్పదలచుకున్న అసలు విషయమేమిటంటే, మనము తెలుగులో కొత్త పదాలు ప్రవేశ పెట్టేటప్పుడు ఇటువంటి కల్పనా శక్తినే ఉపయోగించాలి. కొత్త పదాలని మన ఆలోచనా విధానానికి అన్వయించి తీసుకువస్తే వాటి వాడుక తొందరగా పెరుగుతుందని నా అభిప్రాయం.

ఒక్కసారే విన్నా నేను అడ కత్తెరలో పోక చెక్క సిద్ధాంతాన్ని మర్చిపోకపోవడమే దీనికి తార్కాణం.
Q.E.D

==

*ఈ సిద్ధాంతం క్లుప్తంగా (అ-గణిత భాషలో) చెప్పలంటే రెండు బిందువుల మధ్య వాలు, వాటి మధ్య గీసిన వంపుగీతలో ఏదో ఒక చోట గీసిన స్పర్శరేఖ వాలుకి సమానంగా ఉంటుంది. ఈ సిద్ధాంతాన్ని Rolle's సిద్ధాంతనికి పొడిగింపనే చెప్పచ్చు.**
**ఈ విధంగా సిధాంతాన్ని తెలుగులో రాయడానికి నాకు సాహితి చేసిన సహాయం అంతా ఇంతా కాదు.

Thursday, September 14, 2006

ఈ రోజే లేఖినిని కనిపెట్టాను

హరివిల్లు పుణ్యమా అని ఈరోజు నేను లేఖిని ని చూసాను. నేను 'తెలుగులో...' మొదలు పెట్టినప్పటినుంచి పద్మని వాడాను;అప్పటినుంచే ఒకే చోట టైప్ చేయడం,తెలుగు లిపి చూడడం సాధ్యమైతే బాగుండనిపించేది. లేఖిని వల్ల అది కుదురుతుంది. నాకు చాలా నచ్చింది.
ఇప్పటినుంచి లేఖినిలోనే లేఖనం.

(ఈ రోజే Firefox లో తెలుగు లిపిని కూడా install చేసాను)

అంటే అన్నానంటావుగాని..

వినదేరా చెప్పినా నయానా భయానా
ఇంటికి రాదేరా ఎప్పుడూ సరైన టైయాన?
అంటే అన్నానంటావుగాని నాయనా,
మీ నాయనే ఉంటే మోగదా వీపు విమానం విధాన?

ఇదేం చోద్యం రా అబ్బాయీ?
ఒంటిన గుడ్డలు పీలికల్లా ఉన్నాయి
అంటే అన్నానంటావుగాని నాగన్న
చీర, పరికిణి, వీటికన్నా ఏంచిన్న?

శిక్ష లేందే క్రమశిక్షణ రాదురా బాబూ
బెత్తం తీయమంటే అప్పుడు మరి విన్నావు కాదు
అంటే అన్నానంటావుగాని కుర్రాడా
పిల్లల్ని సరిగా పెంచనివరు, ఇదేం వింతరా ఇక్కడ ?

ఏదో కరువైనట్టు ఇంత తిండి ఎందుకిక్కడి కొట్టుల్లో
అంత తినడానికి చోటుందా వీళ్ళకి పొట్టల్లో
అంటే అన్నానంటావుగాని ఒరేయ్,
బాన కడుపులు, జజ్జు జబ్బులు
ఊరికే రావు, మరే!

Friday, September 08, 2006

నాగఫణిశర్మ గారి గురించి వార్తలు నిజమా?

ఈరోజు పొద్దున్న ఇక్కడ నాగఫణిశర్మ గారి గురించి వచ్చిన వార్త చదివి నేను చాల ఆశ్చర్య పడ్డాను.

1996లో ఆయన చేసిన సహస్రశతావధానం నాంపల్లిలో నేను చూసాను. ఎంతోమంది ప్రముఖ కవులు ఆంధ్రా నలుమూలల్నుంచి రావడంవలన ఆ అవధానం ఎంతో ఆసక్తికరంగా జరిగింది. నాకక్కడ కొంతమంది కవులతో స్నేహం కూడా కుదిరింది. అప్పటినుంచి నాగఫణిశర్మగారంటె నాకు అభిమానం ఏర్పడింది, అప్పుడప్పుడు ఆయనని టి.విలో చూసిన గుర్తు, దూరదర్శనిలో ఆయన ఉగాది పంచాంగశ్రవణం చేసేవారనుకుంటా.
అటువంటిది ఇప్పుడు ఇలాంటి ఇరకాటమేమిటొ. ఈ వార్తలే నిజమైతే ఆయన మళ్ళీ గౌరవం సంపాదించుకోడానికి చాల ఏళ్ళు పట్టవచ్చు. ఇదంతా ఆయన డబ్బు, హోదా చూసి ఎవరో చేసిన కుట్ర అంటే నమ్మడం కొంచం కష్టమే. ఆయనని california రప్పించింది, డబ్బు, సమయం వెచ్చించింది, కేవలం అవమానపరచడనికంటే ఎవరు నమ్ముతారు?


ఏది ఏమైనా ఆయన ధైర్యంగా ముందుకి వచ్చి నిజం చెప్పడమే ఉచితం. తప్పు చేసినట్లైతే, ఆ గృహిణిని, అభిమానులని వెంటనే క్షమాపణ అడగాలి.

1. ఈనాడులో వచ్చిన కథ ఇక్కడ చదవండి

2. ఆంధ్రజ్యోతి కధనం ఇది

3. ఆంధ్రభూమిలో రాసింది నాగఫణిశర్మ గారి గురించే కాకుండా, అమెరికాకి తెలుగుసంఘాల ఆహ్వానం మీద వచ్చే ప్రముఖులు కొందరి మీద ఉంది.

Thursday, September 07, 2006

చందమామా? బాలమిత్రా? - 1

చిన్నప్పుడు ఇంట్లో చదువుకి సంబంధించిన పుస్తకాలు తప్ప వేరేవి చందవడానికి వీలు (అంటే "పెద్దల అనుమతి" ) దొరికేది కాదు. చదువు పూర్తి చేసిన తరువాతే ఆటలు, కధల పుస్తకాలు .
వేసవి సెలవలలో మాత్రం వీటికి అనుమతి గినుమతి అవసరముండేది కాదు. అల్లరి చేయకపోతే చాలు, ఓ మూల కూర్చుని ఎన్ని కధలపుస్తకాలు తిరగేసినా ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు.


సాయంత్రపు ఆట వీధి క్రికెట్ ఉండనే ఉంది, మట్టి కొట్టుకుపోతూ ఆడెయ్యడమే. కానీ పగలు, మధ్యాహ్నము ఎండల వలన ఇంట్లోనే కూర్చోవలసి వచ్చేది; ఇంకప్పుడు చందమామలు, బాలమిత్రలు తిరగవేయడమే పని. ఈ పుస్తకాలు అప్పట్లో కొనడం (అంటే 'నాన్న చేత కొనిపిండం') చాలా (చాలా అంటే చాలా) తక్కువ; పక్కినింటివాళ్ళింట్లోంచి తేవడమో, పావలాకో అర్ధరూపాయకో అద్దెకి తీసుకురావడమో జరిగేది. ఇక తెచ్చినప్పడినుంచి పూర్తిగా చదివేదాకా మనసు నిలిచేది కాదు, చదివిన తరువాత ఫ్రెండ్స్ తో భేటీ.

కధలని, ప్రత్యేకంగా "ఇంకా ఉంది" కధలని తెగ తిరగతోడడమే పని. చందమామలో కన్నా బాలమిత్రలో "ఇంకా ఉంది" " కధలు చాలా నచ్చేవి.. బి. ఆర్. వరదరాజులు గారు రాసిన 'సాగరలోయ ' వంటి కధలంటే విపరీతమైన పిచ్చి. పీష్వా, చంద్రహాసుడు, మనోహర్ వంటి పాత్రలే అప్పుడు శత్రువులు, స్నేహితులు. ఏంతంటే అలాంటి కధలో చంద్రహాసుడు చనిపోతే, నాకు ఓరోజు మనసంతా చెడి పోయింది. అన్నం సహించిందో లేదో గుర్తు లేదు కాని, విపరీతమైన బాధ మాత్రం కలిగింది. ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది!

ఇంతకీ చెప్పదలచుకున్న విషయమేవిటంటె, నాకు చందమామ కన్నా బాలమిత్ర ఎక్కువగా నచ్చేది. ఎందుకో చందమామలో కొంచం 'పెద్దరికపు వ్యవహారం' కనిపించేది; బాలమిత్ర మాత్రం అలాకాకుండా ఓ స్నేహితుడిలానే ఉండేది. ఇప్పుడాలోచిస్తే అనిపిస్తోంది, చందమామలో వ్యావహారిక భాష కొంచం తక్కువే; బాలమిత్ర తమిళం నుంచి తర్జుమా అవడం మూలనో ఎమిటొగానీ అంతగా High brow గా ఉండేది కాదు :) బాలమిత్రలో కన్న చందమామలో Print కూడా కొంచం హుందాగా ఉండేది.


ఒకవిధంగా చెప్పాలంటే చందమామ ఒక Teacher లాగ, బాలమిత్ర ఒక Friend లాగా అనిపించేవి.

మీరేమంటారు?


(ఇంకా ఉంది..)

Monday, September 04, 2006

తెలుగు పెరుగుతోందా? (Updated)

ఏ భాషైనా పెరగడానికి కొత్త పదాలు చేకూరుతూ వుందాలి. ఇంగ్లీష్ భాషకి ప్రతి ఏడాడి వెబ్స్టర్ వారు కొత్త పదాలు కూడుస్తున్నారు, కొన్నాళ్ల క్రితమే "google" (చిన్న జి) ఆ కోవలోకి చేరింది. మొదటినుంచే ఇంగ్లీష్ భాష మన సనాతనధర్మంలాగ కొత్త ప్రయోగాలని తనలో మిళితం చేసుకుని ముందుకు సాగింది, అందుకే ఈనాడు అది లోకం నలుమూలల వ్యాప్తి చెంది ఇంత ఆదరణకి నోచుకుంది.

ఈ విషయంలో మన భారతీయ భాషలన్ని వెనకబడి ఉన్నాయి. ఉదాహరణకి మన భాషల్లొ Internet (అంతర్జాలం*) కి సంబంధించిన పదాలు ఎక్కువగాలేవు లేవు. ఫ్రెంచ్ వారు రెండేళ్ళ క్రితం Email బదులు Courriel అనే పదాన్ని ప్రవెశ పెట్టి, ఫ్రాన్స్ లో దాని ఉపయోగాన్ని ప్రాచుర్యం చేసారు. ఇటువంటి ప్రయత్నాలు మనం చేయకపోతే కొన్నాళ్ళకి మన మాతృభాషలన్ని అలంకార ప్రాయాలైపోతాయి. ఇప్పటికే ఇంగ్లీష్ పదాలు లేకుండా మనం తెలుగులొ మాట్లాడుకోలేకపోతున్నాము. రాబోయే రోజుల్లొ మన మిగిలిన భాషలుకూడ సంస్కృతంలా కేవలం పుస్తకాలకి, ఉత్సాహం ఉన్న కొంతమందికీ, పరిమితం కాకుండా ఉండాలంటే మనము ఇప్పడినుంచే కృషి చేయాలి.

ఈ ప్రయత్నంలొ కొన్ని పరాయి భాషల పదాలని మనం సొంతం చెసుకోవలసి రావచ్చును, అది తప్పు కాదు; ఒక విధంగా చూస్తే మనమాపని ఎప్పుడో మొదలుపెట్టాము. ఇంగ్లీష్ కూడ ఇప్పటికీ వేర్వేరు భాషల పదాలని కలుపుకుంటూనే ఉంది. ఈ విషయంలొ Microsoft వారు తమ వెబ్-సైట్లో ఒక ప్రణాలికని ప్రవేశపెట్టారు.
ఇక్కడ చూడండి**. మీకు తెలుగులొ ఉన్న పటిమని ఇక్కడ చూపించే అవకాశం ఉంది, ఇక్కడ చేర్చిన పదాలు మన భాషాపరిధిని పెంచుతాయి. ఇటువంటి ప్రయత్నాలు వేరే చొటా జరుగుతూ ఉండవచ్చు, నాకు తెలిసినది ఇదే. ఇటువంటి వెబ్-సైట్స్ ఇంకా ఉంటే నాకు తెలపండి.
====
* వేమూరి వారి నిఘంటువు
* ఇంగ్లీష్ పదాలకి తెలుగు పద సంతులాలు కనుక్కోవడానికి సాహితికి వెళ్ళండి.
**Microsoft వారి ప్రణాలిక కొన్ని నెలల క్రితమే పూర్తి అయ్యింది (మార్పు, 09/08/06)

హాస్యం, అపహాస్యం

ఇప్పటి తెలుగు చిత్రాలలో హాస్యానికి మరో పేరు అతిశయంగా మారింది, ఇదివరకటి చిత్రాలలో ఉందే హుందాతనం పూర్తిగా పోవడమే కాకుండ వెకిలితనాన్ని, తెలివితక్కువతనాన్ని హాస్యం గా చూపించదం జరగుతోంది. అతిగా ఉండకుంటే ఏదైనా అందంగానే ఉంటుంది, హాస్యం విషయంలో ఇది మరింత నిజం. ఒకే రకమైన సన్నివేశాలని తిరగతోడి మళ్ళీ మళ్ళీ చూపించి చూసేవాళ్ళని చావబాదే రచయితల తలల్లో కొత్త ఆలోచనలు ఎందుకు రావో అర్ధం కాదు.

అతిగా ఉలిక్కి పడడం, తల ఊరికే బాదుకొవడం, తమని తాము ఛీత్కరించుకోవడం ఇటువంటివి అతిగా చేసి దానినే హాస్యమంటున్నారు, Jokers! హాస్య నటులు నిజానికి ఎంత దూరమయ్యారంటే, వారు ఏదైన చిత్రంలో హాస్యనటన కాని Serious పాత్ర చేస్తే అది నవ్వు తెప్పిస్తోంది. బ్రహ్మానందం రాంగోపాల్ వర్మ చిత్రల్లో చేసిన కొన్ని పాత్రలు దీనికి ఉదాహరణలు.

ఇటువంటి హాస్య నటులకి, రచయితలకి ఒక్కమారు హ్రిషికేష్ ముఖర్జి చిత్రాలలొ జరిగే హాస్య సంఘటనలు చూపించి నవ్వించడమెలా అనేది నేర్చుకోమనాలి.

Pronunciation woes..

In 90s when SP Balasubramanyam sang regularly for Salman Khan, my northie friends complained about his accent. I thought SPB was much more competent than many bollywood singers, but had to grudgingly agree on the accent bit. He wasn't bad, but didn't sound like a native speaker, that's all!

Big deal! these days, after listening to what Hindi singers are doing to Telugu songs, such a complaint sounds damned trivial to me.

Udit Narayan (Narayanan, if you go by Tamil CD covers!), Sukhwinder Singh and Shreya Ghoshal are now very popular in South India. Shreya is the better of the lot, but they all suck at pronouncing Telugu words. Part of the blame must also go to the lyricists and composers for not insisiting on స్వచ్ఛమైన ఉచ్ఛారణ (impeccable pronuciation) i guess.

I can't recollect a song where SPB changed the meaning of Hindi words by wrong pronunciation; on the other hand, i spot many cases where Udit et al do it in Telugu.

- Raadha! (రాధ, the Gopika) becomes Raada? (రాదా? won't she come?);
- KaLLu (కళ్ళు, eyes) become Kallu (కల్లు, toddy, a type of liquor) ;
- Bhoomi (భూమి, Earth) becomes Boomi (బూమి, no such word);
- Rendu (రెండు, two) becomes Randu (రండు, no such word); I can go on and on.

Funnily enough, for the Song "Radhe Govinda" the composer was forced to use a guest singer for some tough words. The song is credited to Udit Narayan, an uncredited Telugu singer comes to his rescue to say "Mridu vadana". Listen to the song here - pay attention to the second half of the pallavi (mukhda).

So, having a Hindi singer and Telugu composer is a surefire screw up recipe, right? What will happen if you had a Hindi music composer in the mix? Hilarious results?? Well, not necessarily. RD Burman's "జీవితం, సప్తసాగరగీతం" (Life, a song of seven seas..) sung by Asha Bhonsle - for the movie Chinni Krishnudu- is far less blemishless by the same standards. How did they achieve it, i wonder?

May be the recent crop of composers, singers and lyricists are too damned busy to focus on minor details like pronunciation.

Of course, the problem is not limited to singers, new actors and actresses join the bandwagon too - but again that's a separate crib story.

Com'posers' without formal training, how do they do it?

We have many music composers in Telugu film industry without any formal training in classical music. Let alone classical music, i seriously doubt if they had any training in composing music. But they seem to do a good job of creating marketable music, how?

Singing is a different thing, practice makes you a good singer provided you have a good/passable voice to start with. Kishore Kumar is a sterling example of practice makes a singer perfect. But composing is a different ball game, isn't it?

I am not a composer, but something tells me that composing songs is not easy as copying tunes.

A few years ago RP Patnaik created a bunch of good songs, then got repetitive and soon faded into Kannada filmi oblivion. No formal training in music, but that didn't stop him from composing some classical numbers. Here's an example, check out "Chinuku tadiki" song from "Nee sneham". How did he do it?

Now we have Kalyani Mallik scoring music for Nagarjuna's latest movie Boss. He too doesn't have the benefit of formal training.
See my review of the songs below, except for a couple of songs (one of which sounds very much inspired) all others sound very amateurish. He is the brother of talented (but prone to occassional plagiarism) and famous Keeravaani. Thankfully for now, Boss's music doesn't make us suspect his lack of training. It is very much in line with it.

I am always sceptical of music composers without formal training. Sure, there are some who compose good songs sometimes, but in general they are not as good as their trained counterparts. I think a big reason for this is that owing to their limited exposure, they don't know where to copy from. Damn!

Bommarillu (3/5)

2006;
Bhaskar;
Siddharth, Genelia, Prakash Raj;

Bommarillu is Siddharth's third straight movie in Telugu and it opened to very positive reviews. That's the reason i drove over an hour (far away to Viriginia) to watch it; imagine my disappointment when i found that all the shows for the day were sold out. Good reviews again prompted me to book tickets for the next days show, for a good movie long drive isn't an issue, so i thought. Does the movie deserve such a long drive (twice!), time and effort? Not really! Its a good movie, but not a great one the reviewers plugged on me.

Here's the story: Siddhu's father is a control freak, no one at home dares to go against his word. Siddhu complains to his friends, but never dares to confront him. Micromanaged at home, he vents out his frustrations outside home by boozing and hanging out with his good-for-nothing friends.

Things come to a boil when Siddhu's dad finds a suitable girl for him. The girl (a dad's girl) is good-looking, nice and all that, but Siddhu can't take his dad dictating how he should live the rest of his life.

So he does the expected - promptly finds himself a girl (Haasini) to fall in love with. Doesn't matter if the girl is childish, dumb (with occassional flashes of brilliance), unpredictable and impractical . In the typical movie style "she has the capacity to make Siddhu happy for the rest of his life". Why so? for starters, she is the heroine and that's the way it works in Telugu movies, get it?

She befriends some rowdie-looking guys in the college, goes out for an icecream in the middle of the night, believes that you'll grow horns if you don't "dee-dikkum" twice, speaks out her mind with little regard to consequences and so on. Well occasionally, she comes across as a straight- forward, honest person but generally her tactlessness dominators such flashes.

Siddhu finally musters courage to tell his dad about Haasini, and convinces him to allow Haasini to live in their home for a week. What follow are some funny episodes as Haasini gets close to some family members and alienates herself from some.

On the positive side, the movie has clean dialogues, some rib-tickling episodes, enjoyable songs and lyrics. Devi Sriprasad scored some good songs for this movie. Funny lyrics in "We have a romeo" and "Lalu darawaaja kaada" songs make them all the more enjoyable.

This movie is not the best from Telugu industry in the recent times (as touted), but it isn't that bad either. Worth a watch (if you don't have to drive 70miles to get to the theatre and back!)

తెలుగు యునీకోడ్ మెరుగయ్యింది (Updated)

కొన్ని రొజుల క్రితం నేను వికిపీడియాలొ తెలుగు లిపిని చూసాను. అప్పటికి ఇంకా యునీకోడ్ లో ఇప్పుడున్న మార్పులు లేవు. దీర్ఘాలు, వొత్తులు అక్షరాలకి పక్కన వుండి చదవడానికి చాల కష్టంగా వుండేది. ఉదాహరణకి, "తెలుగు" ఈవిధంగా ""త ెలుగు"" కనిపించేది. అందుకే ఈనాడు లాంటి వెబ్-సైట్స్ కేవలం అక్షరాలే వాడకుండా ఇమేజెస్ వాడి చదివేవాళ్ళకి వీలుగా ఉండేలా చేసేవారు. ఇప్పుదంతటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు, యునీకోడ్ లో వచ్చిన మార్పులవలన తెలుగు లిపి చాల స్పస్ఠంగా కనిపిస్తొంది. అది చూసే నేనూ ఒక తెలుగు బ్లాగ్ మొదలు పెట్టాను. ప్రస్తుతం నాకు తెలుగు టైపింగ్ రాదు, నేర్చుకొనేంతవరకు పద్మను వాడి టైప్ చేస్తాను.

==మార్పులు==

నేను ఇది రాసిన తరువాత వేరొక చోట నుంచి కొన్ని తెలుగు సైట్స్ చూసాను; మా ఇంటి కంప్యూటర్లో సరిగానే కనిపించినవ లిపి అక్కడ తేడాగా కనిపించింది. ఇదివరకు యూనీకోడ్ సరిగా install చేయకుండా చూసివుంటా :)ఏదిఏమైనా ఇప్పుడు ఈ బ్లాగ్ రాయడానికి నాకు చాలా ఆసక్తి కలుగుతోంది

==మార్పులు==

నా బ్లాగ్ కి సుస్వాగతము.

నా ఆలోచనలు, నచ్చిన సంగతులు ఇక్కడ వివరంగా రాస్తాను - మీరేమనుకుంటారో సంకోచం లేకుండా చెప్పండి