Friday, September 15, 2006

అడకత్తెరలో పోకచెక్క

ఇంత క్రితం నేను 'తెలుగు పెరుగుతోందా?' అని ప్రశ్నించాను ; ఆ విషయం గురించి ఈ రోజు ఆలోచిస్తూంటే ఒకప్పుడు మా లెక్చెరర్ చెప్పిన ఒక విషయం గుర్తొచ్చింది. ఆయన కాల్క్యులస్ లో లెగ్రాంజెస్ సూత్రం* గురించి చెపుతూ ఒక తెలుగు గణిత పుస్తకములో లిమిట్ ని ఏవిధంగా వివరించారో చెప్పారు .
ఒక ప్రమేయానికి ఎడంపక్క లిమిట్ విలువ , కుడిపక్క లిమిట్ విలువ సమానమైన పక్షంలో ఆ ప్రమేయం లిమిట్ కూడ అదే విలువ అని. ఈ సిద్ధంతాన్ని ఇంగ్లీషులో ఎమంటారో మర్చిపోయాను కాని, తెలుగులో మాత్రం ఒక పుస్తకం వారు చాలా సృజనాత్మకంగా 'అడ కత్తెరలో పోకచెక్క' సిద్దంతమని పేరు పెట్టారట. కొద్దిగా ఆలోచిస్తే ఆ పేరు ఎంత ఉచితమైనదో అర్ధమవుతుంది.

ఇక నేను చెప్పదలచుకున్న అసలు విషయమేమిటంటే, మనము తెలుగులో కొత్త పదాలు ప్రవేశ పెట్టేటప్పుడు ఇటువంటి కల్పనా శక్తినే ఉపయోగించాలి. కొత్త పదాలని మన ఆలోచనా విధానానికి అన్వయించి తీసుకువస్తే వాటి వాడుక తొందరగా పెరుగుతుందని నా అభిప్రాయం.

ఒక్కసారే విన్నా నేను అడ కత్తెరలో పోక చెక్క సిద్ధాంతాన్ని మర్చిపోకపోవడమే దీనికి తార్కాణం.
Q.E.D

==

*ఈ సిద్ధాంతం క్లుప్తంగా (అ-గణిత భాషలో) చెప్పలంటే రెండు బిందువుల మధ్య వాలు, వాటి మధ్య గీసిన వంపుగీతలో ఏదో ఒక చోట గీసిన స్పర్శరేఖ వాలుకి సమానంగా ఉంటుంది. ఈ సిద్ధాంతాన్ని Rolle's సిద్ధాంతనికి పొడిగింపనే చెప్పచ్చు.**
**ఈ విధంగా సిధాంతాన్ని తెలుగులో రాయడానికి నాకు సాహితి చేసిన సహాయం అంతా ఇంతా కాదు.

No comments: