Sunday, October 22, 2006

హాస్యం మరెక్కడో లేదు..

మన తెలుగు సినిమాలని వేర్వేరు కోవలలో ఎందుకు పెట్టలేమో కొద్దిగా ఆలోచించండి.
సినీ అభిమానులు కాబట్టి మీరు సమాధనాన్ని ఇట్టే పట్టేయగలరు.ఎందుకంటే, మన వాళ్ళు తీసే నవ్వు చిత్రాలు చిరాకుని, ఢిషుం ఢిషుం చిత్రాలు విసుగుని, ఏడుపు చిత్రాలు నవ్వుని తెప్పిస్తాయి కాబట్టి...ఒప్పుకుంటారా?

మన వాళ్ళు మంచి సినిమాలు తియ్యరని కాదు, కొద్ది మంది ఉన్నారులెండి. నా గోడు అంతా ఆ కొద్ది మంది కాని మంద గురించే..
మొన్న ఈ మధ్య, ఒక బెంగాలి బాబు బ్లాగ్ లో మన తెలుగు కధానాయకుడి ప్రస్తావన వచ్చింది. మన కె.నాయకుడి సినిమాలలో చూపించే వీరోచితాలు ఎంత హాస్యాస్పదాలో అక్కడ కాసేపు సమీక్ష. చూసి నాకు నవ్వు, అలాంటి సినిమాలు మనమీదకి వదిలే చిరాకు మంద మీద చిరాకు ఆగలేదు. నవ్వు మాత్రం బాగా వచ్చింది లెండి.ఇక్కడ మీకోసం కొన్ని మచ్చుతునకలు.
1. కుర్చీ మాయ
2.
శగబండి పొగలు
3. టాం క్రూజ్ అన్నయ్య (
అయ్యో రామా! )
4.
విమాన వీరోచితం
నవ్వాగిందా?
ఇలాంటి సినిమాలు ఏ కోవలోకి వస్తాయో మీరే చెప్పండి?
==
ఇదే విషయం మీద నవీన్ గారి చణుకులూ చూడండి.

Nuclear names

Show me a Telugu name and I could show you Telugu poetry! Not any longer.

There was a time when Telugu names represented length, strength, meaning and many many alphabets. Set aside the full name, a quick look at the initials was sufficient to spot a Telugu.

Where other South Indian names lacked the syncretistic spirit, Telugu names made a proud show of it. Not restricting themselves to pater's-firstname-sans-variations as their middle identity, they took pride in being dashboards of various Gods' and blood relations' monikers. Synthesis was clearly the middle-name of such spirit.

Telugu pride would have scoffed at many eager-to-save-trees and effort-time-quantified American application forms, the ones that ask you for a swalpamaina simple M. I. - that's Middle Initials for uninitiated, which even for thoroughly initiated Telugus is more like Mission Impossible. Does an elephant ever squeeze into an ant-hole? Does an entire hand ever pick a single nostril? Never! Does KCR know his mind when talking about separate Telangana? Never!! But I digress...Then why ask to crunch a grand middle name that almost reads like A.P.S.R.T.C into one byte field? Scoff! హవమానము!!

Length be damned, pacifying egos of the living, the dead and the celestial is important; what if your name reads like a rearranged limerick or a haiku?

S.S.V.V.S.V.L. Prasada Rao* isn't just the result of 2 parental minds coming together one fine day of naamakaranam, the naming ceremony. Familial pressures, family deity and parental poetic inspirations - all worked full force to bring the building blocks for such a strong name together.

But alas, such a grand-nomenclatural tradition of bestowing lyrical names to Telugu sons , which Telugu daughters escaped till date and I frequently wonder how!, is coming to a sad end. Nuclear families are clearly the prime reasons for this pitiable decline.

I suspect IT revolution also has an insidious role in this.

Thanks to the global opportunities Telugus are hopping on to planes everyday to greener IT pastures, hopping back briefly a few years later to get married and to do a joint hop back to the pastures. Families back home desperate for re-unions or regular ISD updates haven't been finding time for nomenclatural pressures? Can you blame them?

Far from the Telugu land and parental influences, folks these days don't balk at choosing names that clearly have northie or phirangi influences. Hayyo, if this is not Namakarana-Kaliyuga what is?

==

*SRI SATYA VEERA VENKATA SAI VARA LAKSHMI PRASAD RAO. A fictitious name as far as i can tell. As the likelihood of this being a real name is high, i request the name-bearer to realize this post is not a personal assault. If it is of any help please note that my full name (family name included) has been a source of inspiration for a few songs and poems during my college days!

Saturday, October 21, 2006

దీపావళి దివిటీలు

అందరికి దీపావళి శుభాకంక్షలు.
యాహూ వాయస్ ఈ రెండు రోజులూ మన దేశానికి తేరగా (లేక తక్కువ ధరకి) మాట్లాడే అవకాశం
కల్పించింది. వినియోగించుకోండి.
దిబ్బు, దిబ్బు దీపావళి, మళ్ళి వచ్చే నాగులచవితి...

Saturday, October 07, 2006

ఇదేనా ఢంకా మోత, a reprise

ఇంతకు ముందు ఇది..ఇక చదవండి
అనామక్ గారి బాధ-ప్రశ్నా, శాంతి గారి వంతపాటా, ప్రసాద్ గారి సూటి అభిప్రాయమూ చూసిన తర్వాత..
అసలు, నేను చెప్పదలచుకున్నవి (అడగదలచుకున్నవి) ఏమిటంటే..

1. విజయవంతమైన సినిమాలకి ఇటువంటి ప్రమోషన్లు అవసరమా?
2. ఎలాంటి వినూత్నమైన ఆలోచనలూ లేని దర్శకుడి చిత్రాలు చూడడానికి (చిరంజీవి నటించినప్పటికీ..) అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా?

అప్పుడప్పుడు మాటలకన్న ఆలోచనలు వేగంగా పరిగెడతాయి - అలాంటప్పుడు మాట తడబడుతుంది.
అలాగే అప్పుడప్పుడు ఆలోచనల కన్నా కలం తొందరపడి ముందుకెళ్ళి పోతుంది - అలాంటప్పుడు రాతలూ తడబడతాయి.

నా విషయంలో రెండవది జరిగిందనుకుంటా; త్వరత్వరగా రాయాలనే ఆత్రుతతో, నా రాతలు ఇతురలకి అర్ధమవుతాయా లేదా అనే విషయం గమనించలేదు.

అలా రాసి మురుగదాస్ అభిమానులని నొప్పించి వుంటే క్షమించండి :))

Thursday, October 05, 2006

పేరలల్లో రకాలు

పేర్లు రెండు రకాలండి; బలి-ఇష్టమైనవి , బలిష్ఠమైనవి.
మొదటి రకం పాపం ఇంటినించి బైటకి అడుగు పెడతాయోలేదో వాటి నామం పంగనామం అయిపోతుంది. శ్రీధర్, సీతరాం, శ్రీనివాస్ ఈ కోవకి చెందిన పేర్లు. వీరు పక్కింట శ్రీధరన్, సీతరామన్, శ్రీనివాసన్ గా మారడానికి ఎంతో సమయం పట్టదు. మరి గిరి, రవి, సురేష్ లాంటి బలిష్ఠాలు పక్కింటి తమిళ ధాటికి తట్టుకోవడమేగాక చెక్కు చెదరకుండ నిలిచి ఉంటాయి.

గొప్ప విషయమా?

నిజానికి పక్కింట్లో కన్నా దూరతీరాలు చేరి చెక్కు చెదరకపోవడం గొప్ప.

సాధ్యమేనంటారా?

సాధ్యమే, కాకపోతే నామధేయుల మీదా ఆధర పడివుంటుంది మరి; పేర్ల లాగే మనుషులూ రెండు రకాలు .

కొందరు తమ పేర్లని పొందికగా కాపాడుకుంటే, మరి కొందరు నోరు తిరగని వారి మాట రీతికి సరిపడే విధంగా వొత్తులూ గట్రా తీసేసి పేర్లను మార్చేస్తారు.

అవసరమా?

మా బంధువు చెప్పిన చిన్న బుడుగు ఛలోక్తి ఇక్కడ గుర్తుకొస్తోంది.

పక్కింటాయన: ఎంత్లా బులుగు? ఎంతేతున్నావు?
బుడుగు: నాకంతే పలకక అలాంతి మాతలు. నీకేం పోయేకాలం?

అదే విధంగా ఇక్కడి వాళ్ళు నోరుతిరగక మన పేర్లు వింతగా పలుకుతారు. ఆ వింతని మనమూ సొంతమనుకుంటే ఎలా చెప్పండి?

మన పేర్లని మనమే సరిగ్గా పలకక పోతే ఇంకెవరు పలుకుతారు చెప్పండి?

ఎలాంటి పేరునైనా బలిష్ఠం చేసుకోవడంలోనే ఉంది మన గొప్పతనం..

అంతాక్షరితో విసుగు కలిగితే... సమాధానాలు!

ఇంతకుముందు ఇది..

అక్కడ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇవిగో.

1. సుత్తి వేలు, షాహుకారు జానకి
జవాబు: గీతాంజలి

2. నాగేశ్వర రావు, రోజా
జవాబు: గాండీవం

3. శుభలేఖ సుధాకర్, మురళీ మొహన్
జవాబు: శివ

4. కృష్ణ , ఇళయరాజా (నటన కాదు, కేవలం సంగీతమే)
జవాబు: జమదగ్ని

5. సౌందర్య, చక్రవర్తి (సంగీతదర్శకుడు)
జవాబు: రాజా

Sunday, October 01, 2006

చందమామా? బాలమిత్రా? - 2 (పుస్తకాలు, టీ.వీలు)

ఇంతకు మునుపు, ఇది..ఇక చదవండి..

అప్పట్లో అరచేతిలో పట్టే చిన్న నవళ్ళూ వచ్చేవి. సాధారణంగా కధలన్ని రాజులు, రాజ్య/రాకుమారి-అపహరణాలు, మాంత్రికులు, వింత క్రూర జంతువులు, అడవులు, దెయ్యలతో నిండి ఉండేవి. ఏవిటో, కధలన్నీ ఒకే తీరుగా ఉన్నా చదవడానికి విసుగు మాత్రం పుట్టేది కాదు. అప్పుడప్పుడు, ఆ పుస్తకాల చివరి పేజీలు చిరిగిపోవడం వల్ల కధ పూర్తిగా తెలిసేది కాదు - అయినా చదవడం ఆపేవాళ్ళం కాదు. ఆ పిచ్చేమిటో గాని బానే ఉండేది.

ఇటువంటి పుస్తకాలనుంచి ఎదిగినా తెలుగు పుస్తకాలు చదువుతూ ఉండాలంటే , ఎదిగిన పిల్లల సాహిత్యం అందుబాటులో ఉండాలి.

అదే పెద్ద చిక్కు ముడి.

హార్డి బోయ్స్, త్రీ ఇన్వెస్టిగేటర్స్ లాంటి పుస్తకాలు తెలుగులో తక్కువే. వేరే తెలుగు నవళ్ళు చదువుదామంటే ఇంట్లో స్వాతి, అంధ్రభూమి లే నిషేధం మరి వాటిల్లొ వచ్చే కధల్లాంటి నవళ్ళెక్కడ చదవనిస్తారు?

"పైగా, పిల్లలు ఇంగ్లీష్ కధల పుస్తకాలు చదువుతున్నారంటే అదో గర్వించదగ్గ విషయం కాదటండీ??"

అలా అలా ఇక తెలుగు పుస్తకాలు చదివే అలవాటు తప్పిపోయింది. ఫేమస్ ఫైవూ, సీక్రెట్ సెవెన్లూ మొదలు. ఎప్పుడో ఎదిగిన తర్వాత తెలిసింది కాని 'నేన్సీ డ్రూ' నవళ్ళు అమ్మయిలకోసమని, తెలిసేంత వరకు హార్డి బోయ్స్ తో పాటు అవికూడా చదివేసే వాళ్ళం.

(నేన్సీ డ్రూ నవల వల్ల నాది,స్నెహితుడిది ఓసారి క్లాసులో తలతీసేటట్టి అవమానం జరిగిందిలెండి; అది మరో సారి ఎప్పుడైనా.. )

ఇంజనీరింగ్ చేసే రోజుల్లో ఒక స్నేహితుడి వల్ల కొడవడిగంటి కుటుంబరావు గారి 'చదువు' నవల తప్ప తర్వాత ఇంకేవీ తెలుగు పుస్తకాలు చదవలేదు.

చిక్కు ముళ్ళు లేకుంటే తెలుగు పుస్తకాలు ఇంకా బానే చదివే వాళ్ళమేమో?

===

ఇక చిన్నపటి టీ.వీ విషయానికి వస్తే...

ఒక్కొక రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉండేది, బుధవారమటే చిత్రహార్, గురువారమటే చిత్రలహరి, శనివారం తెలుగు సినిమా, ఆదివారం హింది సినిమా. ఇంట్లోనా టీ.వీ ఉండేది కాదు. ఇంక ఆ సాయంత్రాలు టి.వి. ఉన్న పొరుగింటికే పరుగు;

మాకు తెలిసి ఇంటి పక్కలో రెండు ఇళ్ళకి వెళ్ళచ్చు, ఇద్దరిలో బాగా తెలిసిన వారింటికే ఎక్కువగా వెళ్ళే వాళ్ళం. కానీ అప్పుడప్పుడు, (ఆనాటి కరంట్ దేవుడి విచిత్రాలు కోకొల్లలు) వేరే ఇంటికీ వెళ్ళవలసి వొచ్చేది.

సినిమా రొజులప్పుడు మధ్యలో వార్తలు వచ్చేటప్పుడు ఇంటికి పరిగెట్టడం, భొజనం త్వరత్వరగా కానిచ్చేయడం, తిరిగి పరుగెత్తడం. ఇంట్లో టి.వి. ఉంటే ఎంత బావుండునో అనిపించేది.

అప్పుడప్పుడు ఆటలన్నీ త్వరగా కానిచ్చి కాళ్ళు, చేతులు కడుక్కొని సినిమా కోసం టీ.వీ డబ్బా ముందు కూర్చున్నా,1. అంతరాయంకి చింతిస్తున్నామో2. నలుపు తెలుపు కలగాపులగపు చుక్కలో (అంటే స్టూడియో కరంట్ లేదని అనుకునే వాళ్ళం) 3. కర్ణాటక సంగీతమోప్రసారమయ్యేవి; లేదా ఇంట్లోనే కరంట్ పోయేది.
సాధరణంగా ఆ సమయాల్లో మేమంతా చాలసేపు పట్టు వదలకుండా కూర్చునే ఉండె వాళ్ళం. అయినా గుంపులో మూఢ నమ్మకాలూ ఉండేవి. ఒకడు లేవకుండా కూర్చుంటేనో లేక ఇంకోడు లేచి వెళ్ళిపోతేనో సినిమా మొదలైపోతుందని. అప్పుడప్పుడు అలా కొందరు బలై పోయేవారు.

కొన్నేళ్ళ తర్వాత ఇంట్లో సొంత టీ.వీ (అదీ కలర్ మరి) వచ్చేసరికి మా ఆనందానికి హద్దులు లేవు. కొనాళ్ళ పాటు మహాభారతం లాంటివి కలర్లో చూద్దామని పొరిగింటి వారు మా ఇంటికి వొచ్చేవారు -నెమ్మదిగా అందరిళ్ళళ్ళో కలర్ టీ.వీలు రావడం వల్ల అదీ ఆగి పోయింది.