Saturday, April 19, 2008
రామ పదాబ్జముల్
శా. కామాగ్నుల్ హరియించి పోవు తృటిలో, కైంకర్య మందేనురా,
రా, మాయమ్మను భక్తితత్పరుడవై రామయ్యకందించగా
రా, మా రామ పదాబ్జముల్ కొలువరారా, కీర్తి మిన్నందురా
నీ మాన్యంబిక లోకమందు వెలుగున్ దేదీప్యమానంబుగా
Thursday, April 10, 2008
పొలో!
పోవాలంటు, మరేమి బాధ్యతల బర్వూ లేని స్వేఛ్ఛాయువే
కావాలంటు, యధేఛ్చగా తిరుగుతూ కాలం వృధా చేస్కునే
ఆవారా పనిలో పడాలనుకునే, అయ్యాను సిధ్ధం! పొలో!!
వచ్చే వారమంతా నేను హైదరాబాదులోనే ఉంటాను. ఈ మధ్య పెరిగిన పని వత్తిడి నుంచి కొంత విముక్తి కూడా - వీలు దొరికినప్పుడు విశాలాంధ్రాకి వెళ్ళి మంచి పుస్తకాలు కొన్ని కొనుక్కోవాలని అనుకుంటున్నాను, అంతకు మించి ఇంకేమీ పనులు పెట్టుకో దలచు కోలేదు. ఎవరైనా బ్లాగ్మిత్రులు ఈ సమయంలో సమావేశాలేవైనా పెట్టుకోవాలనుకుంటుంటే తెలియజేయమని మనవి. రావడానికి తప్పక ప్రయత్నిస్తాను.
Tuesday, March 04, 2008
No country for old men
ఏకంగా మరి నాల్గుబొమ్మలకు కన్నేసింది, ఆస్కారమే
లేకుండా తనసాటి బొమ్మలను తేల్చేసింది ఈ ఏడు చ
క్కా కుందించి పడేసి వాటిని, తనే గైకొంది, వీగింది, పో!
కుందించి అంటే కుదించి, అణగ త్రొక్కి అని అర్ధం వచ్చేలాగ రాస్తే వచ్చిన విమర్శల కారణంగా చివరి పాదం సవరించాను, చివర్లో పురస్కారముల్ అని వాడుక వల్ల పద్యం పూర్తిగా వ్యవహారికము కాక బాగుండదేమో అనే సంకోచం కొంత పీడిస్తున్న మాట మాత్రం నిజం.
శా. నోకంట్రీ ఫరు ఓల్డుమెన్ను కదనంతొక్కింది ఆస్కారుకై,
ఏకంగా మరి నాల్గుబొమ్మలకు కన్నేసింది ఆస్కారమే
లేకుండా తనసాటి బొమ్మలను తేల్చేసింది ఈ ఏటి ప్ర
త్యేకం తానని మెప్పుపొంది, గెలిచిందెన్నో పురస్కారముల్
Friday, February 22, 2008
Singapore wins Youth Olympics 2010 bid
శా. కాస్కో, ఓ చిరు దేశమా, ఎదురు రాగానే సరా గొప్పగా
ఆస్కారమ్మిక లేదులే గెలువ, నీకా మోజు తీరేట్లుగా
చూస్కో చిత్తుగ పిండికొట్టెదములే చూస్తుండగానే, అనెన్
మాస్కో, గెల్వగ చూచి తొట్టతొలి యవ్వనంపొలంపిక్కులన్*.
కానీ అలా జరగలేదు. సింగపూరు చిన్నదైనా ప్రజాబాహుళ్యంలో ఈ ఆటలు నిర్వహించాలన్న తపన చూసి ఒలంపిక్కు కమిటీ వారు మాస్కోని వదిలి సింగపూరునే ఎన్నుకున్నారు. మాస్కోవాళ్ళు సింగపూరుని తక్కువగా చూపించాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
* యూత్ ఒలంపిక్కులని గణాలలో కుదించడానికి, పాదంలో యతి మైత్రికుదర్చడానికి యవ్వనంపొలంపిక్కులు అనవలసి వచ్చింది. ఇంతకంటే మంచి ఆలోచన మీకు తట్టినట్టైతే చెప్పండి
Monday, February 18, 2008
చెత్త పాటలు రాసే తెలుగు సినిమా కవీ..
కంట్రీబ్రూటయి తెల్గు పాటలనిలాగా, పెంట సిన్మాలకై
కంట్రోలన్నది గాలికొగ్గి భడవా, గార్బేజిలా కక్కుతా
వేంట్రా? వెంట్రుకె ఉచ్చు నీకు వెధవా, వేళ్ళాడి ఊరేగరా.
Saturday, December 08, 2007
అమెరికా, ఉంటా మరిక.. - 3
సింగపురికి ఏ ఒడుదొడుకులూ లేకుండానే వచ్చి చేరాము..కొత్త (ప్ర)దేశం, కొత్త ఉద్యోగం.
చ. కుదురుగ కొత్తచోట పని కూర్చుని పొందికగా తలొంచి చే
సెదనని నే తలంచితిని సింగపురంబుకు వచ్చిచేరతూ
ఇదివరకున్న రాజసమదిక్కడ చేయుట సాధ్యమవ్వజా
లదని గ్రహించి తేరుకొన వ్రాయుట బ్లాగిక కష్టమవ్వదా?
వ్రాయడానికి మున్ముందు ఎంత సమయం దొరుకుతుందో సమయమే చెపుతుంది. ఐతే, సింగపూరు ఏర్పోర్టులో దిగి ఇమిగ్రేషన్ కౌంటర్ కి వచ్చేసరికి మాదగ్గర నా వీసా ఉందికానీ (ఇతరసగానికి కావలసిన పత్రాలు కంపెనీ వారు పంపకపోవడంవల్ల, నేనొకసారి అడిగినా అవసరమని చెప్పకపోవడంవల్ల) ఇతరసగానికి వీసా లేదు. అమెరికావారైతే అలాంటప్పుడు నవ్వుతూ గౌరవపూర్వకంగా 'సర్, మాడమ్' అంటు తిరుగు ప్రాయాణం పట్టిస్తారు, ఢోకా లేకుండా.
శా. సందేహంబొకటొచ్చె నాకు దిగగా ఛాంగీ ఎయిర్పోర్టులో
సందోహంబుగ వచ్చిపోవు జనులేసందర్భ ప్రాబల్యకం
బందైనా తమ వెంటలేవనినచో పాస్పోర్టు వీసాలు గో
విందాకొట్టు కదా ప్రయాణమునకై వెచ్చించు పైకంబటన్
కానీ సింగపూరు వాళ్ళు అలా కాదు, నేను అప్ప్లికేషను పంపించాను ఒకసారి సిస్టంలో చూడండి అని అడగగానే, కాసేపు ఆగమని, చూసి కనపడకపోయినా నాలుగు రోజులకని స్పెషల్ వీసా ఇచ్చారు. బ్రతుకు జీవుడా అనుకుని (రూలంటే గుడ్డిగా ఆచరించే అమెరికన్ ఏర్పోర్టులకి ఇమిగ్రేషన్ కీ దూరంగా వచ్చినందుకు ఆనందిస్తూ) బయట పడ్డాము.
Monday, December 03, 2007
ఆంగ్ల వృత్తం, Visa headache
శా. When I went to the Consulate for my Visa, the line there sna
kin-nice-and-soporific in a low key way to people-sittin
g-on-nice-and-heavily-cooled cushion, ignoring us all blithely in
Chennai's heat very humid weather, OH! simply belittled me!
గణాలు సరిగా పడాలంటే ఈ విధంగా చదువుకోమని మనవి.
శా. వెన్నైవెంటు ద కాన్సులేటు ఫరు మై వీసా, ద లైన్దేరు స్నే
కిన్నైసెండు సొపోరిఫిక్కు ఇనె లోకీ వే టు పీపుల్సిట్టిం
గొన్నైసెండు హెవీలి కూల్డు కుషనిగ్నోరింగసాల్ బ్లైత్లి ఇ
న్చెన్నైస్హీటు వెరీ హ్యుమిడ్డు వెదరోహ్! సింప్లీ బిలిట్టిల్డు మీ.
Saturday, November 10, 2007
Om Shanti Om
శా. మైహూనా - చవి చూపి చెత్తను, శిరోభారమ్ము పెంచేయగా
నా హూనంబయినట్టి బుఱ్ఱకు ప్రమాణంబిస్తి, మళ్ళీ ఫరా
కాహారంబెపుడూ తనవ్వదని; వాగ్దానాలు కల్లల్ కదా,
ఆహా, నేడు సమీక్షలన్ చదివి, హైహై యంటి ఓంశాంతిఓం
తే.గీ. చిత్రమును చూడ పంతము చేయ బుద్ది
తానె గడ్డి మేసినదై; ఇదంత మీకు
చెప్పు కారణమేమన, పప్పులోన
కాలు పడకముందె నను ఆపాలి తమరె.
మీలో ఎవరైనా ఈపాటికి ఓం శాంతి ఓం చూసి ఉంటే, పై పద్యంలోని 'మీరు' మీరే. Reviews please!
Friday, October 26, 2007
వర కట్టనము, వరుణ్ణి కొట్టడము
లగ్న పత్రికలు ఎలాగు అచ్చు అయిపోయాయి కాబట్టి ఇక ఆడపెళ్ళివారు వెనుతిరగలేరనే ధిమాతో ఇలాంటి వెర్రివేషాలకు దిగజారే వారందరికీ ఇదొక గుణపాఠంగాను, అనవసరమైన వత్తిళ్ళకి గురవ్వు వధువుల కుటుంబాలకు ఇది మార్గదర్శకం గాను కావాలి.
ఏమంటారు?
శా. ఎన్నో ఆశలు పెళ్ళిపైనె కుదిరే, ఎంతో ఘనోపేతమౌ
సన్నాహమ్మును పూర్తిచేసుకొన ఆశాభంగమై ఘాతముల్
తిన్నారక్కట కట్నకాన్కలతిగా తెమ్మంచు కక్కూర్తితో
పన్నాగమ్మును డబ్బుకాశపడి చేబట్టంగ వియ్యంకులే
ఆ.వె. దెబ్బతగిలె కాని దిమ్మతిరగలేదు
వేగమె నిలబడి గుభేలుమనగ
పెళ్ళికొడుకు గుండె పీకిరి పందిరి
బడిత పూజ చేయ, బంధుతెదుట