Monday, September 04, 2006

తెలుగు పెరుగుతోందా? (Updated)

ఏ భాషైనా పెరగడానికి కొత్త పదాలు చేకూరుతూ వుందాలి. ఇంగ్లీష్ భాషకి ప్రతి ఏడాడి వెబ్స్టర్ వారు కొత్త పదాలు కూడుస్తున్నారు, కొన్నాళ్ల క్రితమే "google" (చిన్న జి) ఆ కోవలోకి చేరింది. మొదటినుంచే ఇంగ్లీష్ భాష మన సనాతనధర్మంలాగ కొత్త ప్రయోగాలని తనలో మిళితం చేసుకుని ముందుకు సాగింది, అందుకే ఈనాడు అది లోకం నలుమూలల వ్యాప్తి చెంది ఇంత ఆదరణకి నోచుకుంది.

ఈ విషయంలో మన భారతీయ భాషలన్ని వెనకబడి ఉన్నాయి. ఉదాహరణకి మన భాషల్లొ Internet (అంతర్జాలం*) కి సంబంధించిన పదాలు ఎక్కువగాలేవు లేవు. ఫ్రెంచ్ వారు రెండేళ్ళ క్రితం Email బదులు Courriel అనే పదాన్ని ప్రవెశ పెట్టి, ఫ్రాన్స్ లో దాని ఉపయోగాన్ని ప్రాచుర్యం చేసారు. ఇటువంటి ప్రయత్నాలు మనం చేయకపోతే కొన్నాళ్ళకి మన మాతృభాషలన్ని అలంకార ప్రాయాలైపోతాయి. ఇప్పటికే ఇంగ్లీష్ పదాలు లేకుండా మనం తెలుగులొ మాట్లాడుకోలేకపోతున్నాము. రాబోయే రోజుల్లొ మన మిగిలిన భాషలుకూడ సంస్కృతంలా కేవలం పుస్తకాలకి, ఉత్సాహం ఉన్న కొంతమందికీ, పరిమితం కాకుండా ఉండాలంటే మనము ఇప్పడినుంచే కృషి చేయాలి.

ఈ ప్రయత్నంలొ కొన్ని పరాయి భాషల పదాలని మనం సొంతం చెసుకోవలసి రావచ్చును, అది తప్పు కాదు; ఒక విధంగా చూస్తే మనమాపని ఎప్పుడో మొదలుపెట్టాము. ఇంగ్లీష్ కూడ ఇప్పటికీ వేర్వేరు భాషల పదాలని కలుపుకుంటూనే ఉంది. ఈ విషయంలొ Microsoft వారు తమ వెబ్-సైట్లో ఒక ప్రణాలికని ప్రవేశపెట్టారు.
ఇక్కడ చూడండి**. మీకు తెలుగులొ ఉన్న పటిమని ఇక్కడ చూపించే అవకాశం ఉంది, ఇక్కడ చేర్చిన పదాలు మన భాషాపరిధిని పెంచుతాయి. ఇటువంటి ప్రయత్నాలు వేరే చొటా జరుగుతూ ఉండవచ్చు, నాకు తెలిసినది ఇదే. ఇటువంటి వెబ్-సైట్స్ ఇంకా ఉంటే నాకు తెలపండి.
====
* వేమూరి వారి నిఘంటువు
* ఇంగ్లీష్ పదాలకి తెలుగు పద సంతులాలు కనుక్కోవడానికి సాహితికి వెళ్ళండి.
**Microsoft వారి ప్రణాలిక కొన్ని నెలల క్రితమే పూర్తి అయ్యింది (మార్పు, 09/08/06)

2 comments:

oremuna said...

అయితే ఇంటర్నెట్టును అంతర్జాలం అంటారన్నమాట!

ఇంకా ఏమైనా చాయిసులు ఉన్నాయా?

గిరి Giri said...

‌కిరణ్, నాకు తెలిసి మరింకేమీ లేవు. అంతర్జాలం ‌బానే ఉన్నదనిపిస్తోంది నాకు