Monday, September 04, 2006

తెలుగు యునీకోడ్ మెరుగయ్యింది (Updated)

కొన్ని రొజుల క్రితం నేను వికిపీడియాలొ తెలుగు లిపిని చూసాను. అప్పటికి ఇంకా యునీకోడ్ లో ఇప్పుడున్న మార్పులు లేవు. దీర్ఘాలు, వొత్తులు అక్షరాలకి పక్కన వుండి చదవడానికి చాల కష్టంగా వుండేది. ఉదాహరణకి, "తెలుగు" ఈవిధంగా ""త ెలుగు"" కనిపించేది. అందుకే ఈనాడు లాంటి వెబ్-సైట్స్ కేవలం అక్షరాలే వాడకుండా ఇమేజెస్ వాడి చదివేవాళ్ళకి వీలుగా ఉండేలా చేసేవారు. ఇప్పుదంతటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు, యునీకోడ్ లో వచ్చిన మార్పులవలన తెలుగు లిపి చాల స్పస్ఠంగా కనిపిస్తొంది. అది చూసే నేనూ ఒక తెలుగు బ్లాగ్ మొదలు పెట్టాను. ప్రస్తుతం నాకు తెలుగు టైపింగ్ రాదు, నేర్చుకొనేంతవరకు పద్మను వాడి టైప్ చేస్తాను.

==మార్పులు==

నేను ఇది రాసిన తరువాత వేరొక చోట నుంచి కొన్ని తెలుగు సైట్స్ చూసాను; మా ఇంటి కంప్యూటర్లో సరిగానే కనిపించినవ లిపి అక్కడ తేడాగా కనిపించింది. ఇదివరకు యూనీకోడ్ సరిగా install చేయకుండా చూసివుంటా :)ఏదిఏమైనా ఇప్పుడు ఈ బ్లాగ్ రాయడానికి నాకు చాలా ఆసక్తి కలుగుతోంది

==మార్పులు==

నా బ్లాగ్ కి సుస్వాగతము.

నా ఆలోచనలు, నచ్చిన సంగతులు ఇక్కడ వివరంగా రాస్తాను - మీరేమనుకుంటారో సంకోచం లేకుండా చెప్పండి

2 comments:

oremuna said...

యూనీకోడ్ ఎప్పుడూ ఒకేలాగా ఉన్నది :)

బహుశా మీరు వాడే కంప్యూటరో, జల్లెడో (బ్రౌజరో) మారి ఉంటాయి

గిరి Giri said...

నిజమే, నేను ఇది రాసిన తరువాత వేరొక చోట నుంచి కొన్ని తెలుగు సైట్స్ చూసాను; మా ఇంటి కంప్యూటర్లో సరిగానే కనిపించినవి అక్కడ తేడాగా కనిపించాయి.

రాసినది మర్పు చేస్తాను, ప్రస్తుతం Publish option పనిచేయడం లేదు. Thanks for the comments.