1996లో ఆయన చేసిన సహస్రశతావధానం నాంపల్లిలో నేను చూసాను. ఎంతోమంది ప్రముఖ కవులు ఆంధ్రా నలుమూలల్నుంచి రావడంవలన ఆ అవధానం ఎంతో ఆసక్తికరంగా జరిగింది. నాకక్కడ కొంతమంది కవులతో స్నేహం కూడా కుదిరింది. అప్పటినుంచి నాగఫణిశర్మగారంటె నాకు అభిమానం ఏర్పడింది, అప్పుడప్పుడు ఆయనని టి.విలో చూసిన గుర్తు, దూరదర్శనిలో ఆయన ఉగాది పంచాంగశ్రవణం చేసేవారనుకుంటా.
అటువంటిది ఇప్పుడు ఇలాంటి ఇరకాటమేమిటొ. ఈ వార్తలే నిజమైతే ఆయన మళ్ళీ గౌరవం సంపాదించుకోడానికి చాల ఏళ్ళు పట్టవచ్చు. ఇదంతా ఆయన డబ్బు, హోదా చూసి ఎవరో చేసిన కుట్ర అంటే నమ్మడం కొంచం కష్టమే. ఆయనని california రప్పించింది, డబ్బు, సమయం వెచ్చించింది, కేవలం అవమానపరచడనికంటే ఎవరు నమ్ముతారు?
ఏది ఏమైనా ఆయన ధైర్యంగా ముందుకి వచ్చి నిజం చెప్పడమే ఉచితం. తప్పు చేసినట్లైతే, ఆ గృహిణిని, అభిమానులని వెంటనే క్షమాపణ అడగాలి.
1. ఈనాడులో వచ్చిన కథ ఇక్కడ చదవండి
2. ఆంధ్రజ్యోతి కధనం ఇది
3. ఆంధ్రభూమిలో రాసింది నాగఫణిశర్మ గారి గురించే కాకుండా, అమెరికాకి తెలుగుసంఘాల ఆహ్వానం మీద వచ్చే ప్రముఖులు కొందరి మీద ఉంది.
1 comment:
ప్రతి మనిషి లో వుండే వికృత పార్శ్వమే మనం చూస్తున్నది, ఇదే విధమైన ఆరోపణలు పుట్టపర్తి లో వుండే ఒక బాబా మీద వస్తే ఈ పత్రికలు, టీవీ లు అన్నీ గప్ చుప్ గా వుండి పోయాయి. ఒక్క ఇండియా టుడే తప్పితే(వారికి కూడా బెదిరింపు ఆదేశాలు అందాయంట).
Post a Comment