Thursday, September 28, 2006

అంతాక్షరితో విసుగు కలిగితే...

పాటలు పాడడంలో మా స్నేహితుడిది ఎప్పుడూ వెనకంజే, వాడి పాట విని, దానిలోని సాహిత్యం ఎక్కడో విన్నట్లున్నదని తికమక పడేవారున్నరంటే అది అతిశయోక్తి కాదు. అంటే వాడి పాట వల్ల పక్కవాళ్ళకి అసలు పాట గుర్తుకు రాకపోగా ఇదెకాడో చదివిన విషయంలా ఉందనిపిచే సంధర్భాలు చాలనే ఉన్నాయి. ఓసారి మావాడు జగ్జిత్ సింఘ్ ఘజల్ పాడగానే పక్కనున్న వాళ్ళంతా ఫక్కున నవ్వారు. నేను నవ్వే వాడినే కాని, నా గాన-సూరత్వం అందరికీ తెలిసిన విషయం కాబట్టి నోరుమూసుకుని కూర్చున్నా.

అలాగని మేము అంతాక్షరిలో వెనకాడడం లేదు. పాడే ప్రావీణ్యతా, అంతాక్షరి ఆడగలగడం రెండూ ఒకటి కావని నా నమ్మకం. అదే నమ్మకం వలన ఇప్పటికీ చాల చోట్ల ఆడడం (పాడడం) జరిగింది. నే పాడే పాటలకి సాధరణంగా నిశ్శబ్దమో, లేక పాక్కవాడు త్వరగా తర్వాత పాట పాడడమో జరుగుతాయి - ఐనా అదంత పెద్దగా నేను పట్టించుకోను.

ఇంతకీ ఈ విషాలన్ని ఎందుకు చెప్పనంటే, కొన్నాళ్ళ క్రితం మా చుట్టాలు మా ఇంటికి వచ్చారు. నలుగురం భోంచేసి కాసేపు పిచ్చపాటి ప్రారంభించాము. కూర్చుని ఆడగలిగినదేదైనా ఉంటే బాగుండనిపించింది. నాకు అంతాక్షరి గుర్తుకు వచ్చింది కాని, ఇప్పుడే అందరూ చక్కగా నవ్వుతు కూర్చున్నప్పుడు నా గాన-ప్రావీణ్యతా ప్రదర్శన ఎందుకని కొంచెం మొహమాట పడి, తప్పని పరిస్థితిలలో ఒక కొత్త ఆటని కనిపెట్టా..తీరికగా ఆడడం మొదలుపెట్టాము.

కొత్త ఆట. అందండీ నేను చెప్పదలచుకున్న అసలు విషయం.

ఇహ ఆట సంగతా, చాల సులభం. ఇద్దరు సినిమా పిచ్చాళ్ళు, ఒక పెన్ను, ఒక చిత్తు పుస్తకం ఉంటే చాలు - ఆట మొదలెట్టేయచ్చు.

మొదట మీరు రెండు పేర్లు చెపుతారు. ఆ రెండు పేర్లక ఒక సినిమాకీ ఎదో విధంగా సంబంధం వుండాలి, అది అవతలవాళ్ళు కనుగో గలిగితే వారికి ఒక పాయంటు. లేదా ఆ పాయంటు మీకు. అంతే.

వినడానికి చాల తేలికగా ఉన్నా, మీరు సినిసంగతులు బాగా నెమరువేసినట్టైతే ఈ ఆటలో అవతల వాళ్ళని దున్నేయచ్చు. అనవసరమైన విషయాలన్ని బుర్రలో ఉంచుకోవడం అంత పనికిరానిపని కాదని చూపించే ఆట ఇది.

మొదలు పెట్టిన కొత్తలో మేము హీరో, హీరోయిన్ల మీదే ఎక్కువగా ప్రశ్నలు అడిగాము కాని పోగా పోగా నానా ప్రశ్నలూ మొదలుపెట్టాము. బుర్ర తిరిగి పోయింది. కానీ బాగా మజా కూడ వొచ్చింది.

వీలుంటే, మీ పక్కన సినిమా పిచ్చి ఉన్నవాళ్ళు ఉంటే, ఇది ప్రయత్నిచండి. మీకు ఇది నచ్చవచ్చు.

మీకోసం ఇక్కడ కొన్ని ప్రశ్నలు... ప్రయత్నిచండి. జవాబులు త్వరలోనే నా అభిప్రాయలలో రాస్తాను.

1. సుత్తి వేలు, షహుకారు జానకి
2. నాగేశ్వర రావు, రోజా
3. శుభలేఖ సుధాకర్, మురళీ మొహన్
4. కృష్ణ , ఇళయరాజా (నటన కాదు, కేవలం సంగీతమే)
5. సౌందర్య, చక్రవర్తి (సంగీతదర్శకుడు)

3 comments:

Anonymous said...

paivannaa aalochinchaaka raastaa kaanee....
last di maatram RAJA movie lo di :)

గిరి Giri said...

మిగతావి కూడా అలోచించండి

పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి) said...

2.gandivam