Friday, August 17, 2007

బొమ్మరిల్లు DVD

దాదాపు ఒక ఏడాది క్రితం బొమ్మరిల్లు చూసాను. ఖర్చు పెట్టిన పది డాలర్లు, డ్రైవ్ చేసిన డెభ్బై మైళ్ళు అంత బాధ నాకు అంతవరకు ఎప్పుడూ కలిగించలేదు. ముఖ్యంగా సినిమాని ఆకాశానికి ఎత్తేసిన సమీక్షకుల మీద పట్టలేనంత కోపం వచ్చేసింది. ఒకింత ఉక్రోషంతో అప్పుడు ఇది రాసాను.

మళ్ళీ ఇప్పుడు శ్రీమతి కోసం ఇంటికి ఆ చిత్రరాజ DVDని తీసుకురావలసి వచ్చింది. ఇద్దరం సినిమా చూడడం పూర్తి కాగానే శ్రీమతికి చిన్న అనుమానం - అంతగా నచ్చనిది ఇందులో ఏముందని? కధానాయకి పాత్రకి కొంచం పైత్యం ఎక్కువే, చాలా మటుకు సన్నివేశాలు సహజత్వానికి దూరంగా ఉన్నాయి నిజమే - కానీ ఇవన్నీ తెలుగు సినిమాలకి కొత్త కాదు కదా? ఒప్పుకోవలసి వచ్చింది. DVD లో అప్పుడప్పుడు చెత్త సినిమాలు కూడా బాగానే ఉంటాయని అనడం తప్ప ఇంకేమీ అనలేక పోయా..కానీ జెనీలియాని/తన పాత్ర అతిని అందలమెక్కించిన అందరిమీదా చిరాకు మాత్రం పోలేదు.

3 comments:

Aruna said...

Hammayya,
Asesha telugu prajaanikam lo Bommarillu baaledu anna inko prani dorikaru naaku.
Movie baaledu. heroine character enTi ala vundi annanduku nannu koTTestam annaTTu maTladaru konta mandi abbailu.
What I observed is, most of the boys wished to have a girl friend like her and started searching for such girl as well. Very funny.
Real life lo ala vunTe aa ammai inka batukutunda. asalu college life lo alanTi mentality vunde vallani college lo batakanistara.. aa movie tise valla vuddesam enTi asalu. aa chetta patra ki award kuDa icharu kuDa malli. :(

Anonymous said...

ఆ సినిమా నాకు భీ అస్సలు నచ్చలే !!

హీరోయిన్ కారెక్టర్ ఒక్కటే కాదు .... సినిమా లో చెత్త నా ... పాయింట్లు బోల్డు ఉన్నాయి ...
Aruna జి అనట్టు ఇలాంటి ప్రాణులు తెలుగు బ్లాగు లోకం లో ఉన్నందుకు .... థాంక్ గాడ్ !!

Anonymous said...

ఆ పాత్ర అతి నిజమే. బహుశా అదే కొత్తగా వుండి జనాలకు నచ్చిందేమొ!