ఇది వరకూ దూరదర్శన్లో 'డక్ టేల్స్' అని డిస్నీ వారి కార్టూను కార్యక్రమం వచ్చేది. చాలా హాస్యభరితంగా ఉండి నన్ను బాగా అలరించేది. అందులో ఒక్ భాగంలో భల్లు, వాడి పైలట్ కలిసి 'The lost island' కోసం విమానంలో ఎగురుతూ వెతుకుతూ ఉంటారు. అప్పుడు హఠార్తుగా పైలట్ భల్లుతో 'I think we are in the lost island' అంటాడు. ఎలా చెప్పగలుగుతున్నావు అని భల్లు అడిగితే వాడు 'because, we're lost' అంటాడు.
అది ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందంటే తెలుగుగుంపులో జరఝంపా అనే పదం యొక్క ప్రసక్తి వచ్చింది. ఆ పదానికి ఎవరికీ అర్ధం తెలిసినట్టు దాఖలాలు లేవట. మరి దానికి అర్ధం ఏంటబ్బా అంటే, పదం ఎలాగూ ఎవరికీ తెలియని గూఢార్ధాన్ని కలిగి ఉంది కాబట్టి దాన్ని గూఢార్ధం అనేస్తే పోలా అని ఓ మాంఛి సుచన ఇచ్చారు కిరణ్, బాలసుబ్రహ్మణ్యం గార్లు. బావుంది! నాకు చాలా నచ్చింది. ఇక అవకాశం అందినప్పుడల్లా జరజరా జర జరఝంపాని వాడేయ్యాలని నిర్ణయించేసాను.
ఈ పదానికి కొన్ని సూచక ప్రయోగాలివిగో.
1. వీడొక పెద్ద జరఝంపా గాడురా బాబు - He is a big wtf
2. జర ఝంపా పుస్తకం అందుకో: Mind handing me a Jhumpa Lahiri book?
3. ఇదొక జరఝంపా టపా: What a crappy post!
2 comments:
మీ జరఝుంపా ప్రయోగాలు సూపర్..
హిహి9
adhi 'duck tales' kaadandi 'tale spin' anukuntanu, idhi 'duck tales' tharuvatha vachedi.....
Post a Comment