Saturday, September 15, 2007

కార్కిటుకు

నెలల పాపలున్న వారికి కార్ డ్రైవింగ్ సులభమయ్యే ఒక చిన్న కిటుకు ఇక్కడుంచుతున్నాను. ఇది కొన్ని రోజుల క్రితమే మేము కనుగొన్నాము. ఆఫీసులో పనిచేసుకు పోతున్నప్పుడు మనవెనక ఎవరైనా ఉన్నారేమో అని అప్పుడప్పుడు ఒక చూపేయడానికి వీలు కలిగించే చిన్న అద్దం ఉంటుంది. దాని 'రేర్ ఐ' అంటారు. కార్లో ఉండే రేర్వ్యూ అద్దం కన్న చిన్నగా ఉండి, ఎటువైపైనా తిప్పుకునేలా ఉంటుంది ఈ అద్దం.

నెలల పాపలను వెనక సీటులో వెనుతిప్పి కూర్చోపెడతాం కాబట్టి కార్ నడుపుతున్నప్పుడు - వెనక సీటులో ఎవరైనా కూర్చుంటే తప్ప - వారిని చూసే అవకాశం ఉండదు. వెనక ఎవరూ లేకపోతే వాళ్ళేమి చేస్తున్నారో అని ఆదుర్దా ఒకటి. అందుచేత ఈ రేర్ ఐ అద్దాన్ని వెనక సీటు పైభాగంలో అతికించి సరిగా అమర్చుకుంటే వారిని డ్రవర్ సీటుకు మొందుండే రేర్ అద్దంలోంచి చూడడం సాధ్యం అవుతుంది. దీని వల్ల ప్రయోజనం ఏమిటంటే, మీ పాపా మీరు (ఇద్దరే) హాయిగా కార్లో షికార్లకు వెళ్ళచ్చు. ఒకవేళ ముగ్గురూ వెళదామనుకున్నా, మీ ఇతర-సగం (other half :) వెనక సీటులో కూర్చోనవసరం లేదు, ఇంచక్కా ప్రయాణికుల సీటులోనే మీ పక్కన కూర్చోవచ్చు.

1 comment:

Unknown said...

ఐడియా బాగుంది. కృతజ్ఞతలు