Sunday, July 01, 2007

రాటటూయి

Computer animation మహిమతో నిజం ఎలకలా కనిపించే రెమీ వండే రాటటూయి రుచి చూసారా? నేను చూసి, అభిప్రాయం ఇక్కడ రాసాను. వీలు దొరికినప్పుడు చదవండి, మీరు ఏమనుకున్నారో తెలపండి.

Friday, June 29, 2007

అవునా, కాదా?

తివిరి ఇసుము నుండి తైలమ్ము తీయవచ్చునేమో కానీ ఈరోజు ఐ-ఫోను కొని దాని గురించి బ్లాగు రాయని బ్లాగస్తుని పట్టడం సాధ్యం కాదు..ఏమంటారు?

ఇదే విషయం గురించి ఇక్కడ నేనో చిన్న లమరిక్కు అందుకున్నా.

Thursday, June 28, 2007

గూగుల్ మాప్సులో కొత్త మార్పు

గూగుల్ మాప్ ఇదివరకు ఒక దారి చూపించిందంటే, రజనీకాంత్ లాగ నా దారి రహదారి అనేది. కానీ ఇప్పుడంతా మారింది, కొత్త డ్రాగ్ ఫీచర్ వల్ల. నాకు ఇది చాలా ఉపయోగపడే ఫీచర్, ఎందుకంటారా, ఇక్కడ చదవండి.

Telugu inscript's secret.

There is this secret about Telugu inscript I am going to let you in on..Why do you think I am typing this one in English? Especially when the topic is about Telugu inscript? Here is why.


First, my left little finger hurts bad. A rather longish post (so my fingers thought) in Telugu and frequent use of left SHIFT button put an unduly high amount on stress on the pinky.

I started using Windows inscript as an alternative to the Phonetic tool a few days ago. The challenge of learning Telugu type-writing was enough to set me up on this path to mastery. Mastery is tough to come by, I have to rough it out further, I know, but the pain seems to be an easy visitor. My finger hurts bad. It reminds me of my Pac-man craze days.

Second, learning inscript is a one way street, there is no turning back! More than 90% into my longish Telugu post, I wanted to call it quits briefly, wanted to type smoothly in Phonetic tool to get the post out of my way; I can start my mastery quest later. And that's when I realized that my fingers' ability to type Taip for type disappeared. I was hitting 'X' whenever I wanted a 'O', sunna. (You have to see the Telugu keyboard layout to get this!)

The way forward is now as plain to me as my pain in the pinky. If I fall back on the phonetic tool, I will have to go through some serious unlearning, frustratingly high amount of back-spacing accompanied by an ego-bruising thought that I gave up on the Inscript challenge. If I don't, then I'll learn Telugu typing manasaa-vaacaa-karmaNaa, forget all about phonetic tool, pain the pinky more and be happy with myself.


I want to be happy with myself.

సంగీతము శాస్రీయము

నిన్న నేను రాసిన ఆర్పీ పట్నాయక్ టపాకి ఎనానిమస్ రాసిన మూడు ముక్కల ప్రశ్నాభిప్రాయానికి నా ప్రత్యాభిప్రాయమ్మిదే..
1. శాస్త్రీయ సంగీతం రాని బాలు శంకరాభరణం పాటలు ఎలా పాడగలిగాడు?

మూడు ముక్కల్లో చెప్పాలంటే, ఆయన గొప్పవాడు కాబట్టి. ఆయన సంగీత ప్రావీణ్యతని విశ్లేషించగలిగే ప్రజ్ఞ నాలో లేదు కానీ నేను చదివిన విషయాలు కొన్ని చెప్పాలి. శంకరాభరణం పాటలు పాడడానికి ముందుగా మంగళంపల్లి బాలమురళీకృష్ణని అనుకున్నారు కాని ఆయన శంకర శాస్త్రి పాటలే కాదు పాత్ర కూడా కావాలనడంతో అది కుదరలేదు. అప్పుడు పుహళేంది (కె వీ మహాదేవన్ సహాయ-సంగీత దర్శకుడు) నెల గడువులో బాలుని నూరి, శాస్త్రీయోక్తంగా పాడడం నేర్పించారు. బాలు ఎంత గొప్పగా పాడాడో వేరే చెప్పనవసరం లేదు. ఐనా ఆ పాటలని తప్పు పట్టే వారు లేకపోలేదు. అది వేరే విషయం. ఒక సందర్భంలో బాలమురళీకృష్ణ గారే, ఓంకార నాదానుసంధానమౌ పాట అక్కడక్కడ శంకరాభరణరాగంలో ఉండదని అన్నారట. Sour grapes అని తో్సిపుచ్చుకానీ, ఆయన అన్నదాంట్లో నిజం ఉండవచ్చు. కొందరు శంకరా నాద శరీరాపరా పాటలో రాగ దోషాలు ఉంటాయని అంటారు. నిజం సంగీతజ్ఞులకే ఎరుక. శంకరాభరణం పాటలు చాలా సార్లు వినడం వల్ల నేను గమనించింది మాత్రం ఇది - సరిగమలు చకచక పాడడంలో బాలు కన్నా వాణి జయరాం దిట్ట అని. ఐనా నాకు బాలు గొంతే ఎక్కువ నచ్చుతుంది. నువ్వన్నట్లుగా గొప్పగా పాడడానికి శాస్త్రీయ సంగీత సాధన అవసరం లేదు - కిషోర్ కుమార్, ముఖేష్ లాంటి వారు రఫికి ధీటుగా నిలబడడమే దానికి తార్కాణం - కానీ, శాస్త్రీయ సంగీతం పాడడానికి సాధన అవసరం. మరి అలాంటి పాటలు కూర్చడానికో? పధ్ధతి పరంగా సంగీతం నేర్వందే అధి రాదని నా అభిప్రాయం.

2. పిట్టలకు సంగీతం వచ్చా?

రాదు కాబట్టే శ్రావ్యంగా గళమెత్తగలిగిన కోయిల కూడా సరిగమలు పాడదు.

3. నాకు తెలిసి సంగీతానికి శాస్త్రీయతకు సంభంధం లేదు.

ఇంతవరకూ నే రాసిందంతా చదివితే తెలుస్తుంది, గొప్పగా పాడడానికి శాస్తీయ సంగీతం అవసరం లేదని నేనూ ఒప్పుకుంటానని, కానీ శాస్త్రీయోక్తరాగాలాపనలు కూర్చడానికి సంగీత జ్ఞానం అవసరమని..

===

On that note, I rest my case.

Wednesday, June 27, 2007

ఓంకారా చుసారా?

ఏడాది క్రితం ధియేటర్ లో, పోయిన వారం ఇంట్లో డివిడిలో మళ్ళీ చూసాను ఈ చలన చిత్ర రాజాన్ని. వివరించి ఇక్కడ రాసాను, వీలు దొరికినప్పుడు చదవండి. మీరూ ఓంకారా చూసి ఉంటే, మీ అభిప్రాయం తెలపండి.

Monday, June 25, 2007

ఆర్పీ పట్నాయక్ తెలుగు ప్రేమ

ఆర్పీ పట్నాయక్ ఓ సమయంలో కొన్ని మంచి బాణీలు కట్టాడు కానీ అతని సంగీతమంటే నాకెందుకో అంత మంచి అభిప్రాయం ఏర్పడలేదు. అసలు శాస్త్రీయ సంగీతం రాని వాడు 'నీ స్నేహం' చిత్రంలో 'చినుకు తడికి' లాంటి పాట ఏలా కూర్చగలిగాడో నాకు అంతు పట్టలేదు, ఇంకా పట్టదు (ఈ విషయం మీద నేను ఇది వరకు రాసిన రాత ఇక్కడ ఉంది). పైగా ఇంకో పక్క తూనీగా-తూనీగా లాంటి పాటలు ఈగకి-ఈగగా (मख्खी కి मख्खी) మళయాళంలోంచి తెలుగులోకి కొట్టుకొచ్చేయడం లాంటి విషయాలు మింగుడు పడలేదు, ఇంకా పడవు (ఋజువు ఇక్కడ వినండి). సదభిప్రాయలేమికి కారణాలు ఇలా ఉండగా, మొన్న ఐడిల్బ్రేన్లో ఇతని పాత ఇంటర్వ్యూ ఒకటి చదివి కొంచం వెనక్కి తగ్గాను. ఇక్కడ ఇతను ఉదిత్నారాయణ్. షాన్ల గురించి ఏమంటాడో చదవండి (తెలుగు రానివాళ్ళు తెలుగు పాటలతో ఆడే చెడుగుడు మీద నా చెడు గోడు ఇక్కడ ఉంది) . వెళ్ళావని అనడానికి బదులు వెళ్ళవని అన్నందుకు (వెల్లవని అన్నా ఆశ్చర్యం లేదులెండి) , ఎంత చెప్పినా తప్పుని సరిదిద్దుకోకపోవడం వల్లా షాన్ ని పాట పాడనివ్వలేదని చదవగానే ఆర్పీ పట్నాయక్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఒరియా వాడేమో అనిపించే పేరు ఉన్నా, అచ్చ తెలుగు పేర్లుండీ పచ్చి తప్పులు పాడిస్తున్న వాళ్ళకన్నా ఇతనెంత మెరుగో కదా? మీరేమంటారు?

Wednesday, June 20, 2007

తెలుగువాడా? మజాకా?

పోయిన వారం సినిమాటికల్ వెబ్సైట్లో అతి చెత్త సినిమా ఘట్టాలని కూర్చి ఎవరో యూ-ట్యూబ్లో చేసిన ఒక చిన్న చిత్రం గురించి వ్యాసం చదివాను. ఐదు చిత్రాలలోంచి ఆరు హాస్యాస్పద ఘట్టాలు ఉన్నాయందులో. వాటిలో రెండవది పేరు తెలియని భారతీయ చిత్రం ఐనా సాటి లేని నవ్వుల పుట్ట అన్నట్టుగా దాని గురించి ఇలా రాసారు..

..but I absolutely adored the ridiculous stunt pulled off in the unknown Indian
movie (bonus points to anyone who knows what film it is). In the scene, a man
chases a car while on top of a horse, and when a truck gets in his way he
somehow slides underneath it, horse and all. Fantastic stuff!

చదవగానే ఎందుకో బాలయ్యే గుర్తుకొచ్చాడు. ఫరవాలేదు, మనవాళ్ళ సినీ సృజనాత్మక లేమిని బాలయ్య భారతీయ బ్లాగర్లకే కాక అంతర్జాతీయ బ్లాగర్లకి కూడా చాటేస్తున్నాడులే అనుకుంటూ యూ-ట్యూబ్ కి వెళ్ళా. తీరా చూస్తే అందులో ఉన్నది మన బాలకృష్ణ కాదు, మరో తెలుగు మహారధి. ఎవరో తెలుసుకోవాలంటే మీరు ఇది చూడాల్సిందే. వెండి తెరపై చెత్తని ప్రోత్సహించి వ్యాప్తి చేస్తున్నవారెందరో చిరంజీవులు, వారందరికీ నా వందనములు.

Saturday, June 09, 2007

(అనవసరమైన) చిక్కు ప్రశ్నలు

పారిస్ హిల్టన్ తిరిగి జైలుకి వెళ్ళిందనే విషయంతో నిన్నటి నుంచి ప్రతి అమెరికన్ చానల్ చావబాదుడు మొదలెట్టింది. ఐతే ఇప్పుడు ఇంకెన్ని రోజులు తను జైలు పక్షై ఉంటుందో ఖచ్చితంగా తెలియదు. మొత్తం జైలు సమయం 45 రోజులు. ప్రతి నాలుగు రోజుల సత్ప్రవర్తనకీ ఒక రోజు శిక్ష తగ్గుతుంది. మధ్యలో వెర్రి షరీఫ్ ఎవడూ లేడని, కటకటాల వెనక ప్రతి రోజు పారిస్ సత్ప్రవర్తించింది అనుకుంటే, ఆమె ఎన్ని రోజులు జైలు పక్షిలా బ్రతకాలి? అదీ మొదటి చిక్కు ముడి.

రెండవ ప్రశ్న - 45, 4, 1 వీటిని x, y, z అనుకుంటే అప్పుడు జవాబు ఏమవుతుంది? (మళ్ళి మధ్యలో ఎప్పుడో వెర్రి షరీఫ్ వచ్చి విడుదల చేసి, జడ్జి కి కోపం వచ్చి, పారిస్ తో బంతాట ఆడేసి, టీవీ చానళ్ళు మనని చావబాదేస్తున్నప్పుడు, ఈ variables equation వల్ల మిగతా జైలు సమయం మనం ఇట్టే కనిపెట్టేయచ్చు)

ఇవేం చిల్లర ప్రశ్నలురా బాబూ అని మీరు అనచ్చు. మీ తప్పు లేదు, అమెరికన్ చానళ్ళు, వార్తలూ చాలాకాలంగా చూసేవాళ్ళు ఇలాంటి చిల్లర తత్త్వాలకి అలవాటు పడతారనడం తప్ప నేనేమీ చెప్పలేను.

అరవ రవం

నాకు ఏ.ఆర్.రెహమాన్ తమిళ పాటలు తమిళంలో వినడం అలవాటు. పది+ ఏళ్ళ క్రితం బాంబే సినిమా పాటలు విడుదలైన సమయంలో స్నేహితులతో కలిసి తిరుచ్చి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే బాషా, బాంబే పాటలు తమిళంలో విని అరవపు చెవులు పెంచి కొరుక్కున్నాను. మొదట్లో వినడానికి వింతగా అనిపించినా తర్వాత అలవాటైపోయాయి - ఓ కొత్త అలవాటూ మొదలయ్యింది. మా వాళ్ళకి నా పిచ్చి ఏమిటో అప్పట్లో అర్ధం కాలేదు కానీ చివరి నవ్వు నాదే అయ్యింది. ఎలా అంటారా, మొదటిది తెలుగులో విడుదల కాని ఇళయరాజా ఆణిముత్యాలెన్నో నాకు పరిచయమయ్యాయి. రెండు, చెత్త lyrics నుంచి కొంత విముక్తి లభించింది - ఏలనగా, రెహమాన్ పాటలలో సాహిత్యపు విలువలు కొద్దిగా తక్కువే అని చెప్పచ్చు - అందునా మాంఛి సంఘట్టన పూరిత (percussion filled) పాటలైతే ఇక సరే సరి, వినడానికి సొంపు ఆస్వాదించడానికి కంపు తరహాలో ఉంటాయవి. 'faxల వంద పెణ్ కవితై ఎనకే ఎనకా" లాంటి తునకల తెలుగు అనువాదం కన్నా అరవపు రవమే మిన్న అని నా అభిప్రాయం. అట్టి పాటల సాహిత్యాన్ని తూలనాడుతూ, విన లేకా, విడువా లేకా కష్ట పడే మా వాళ్ళని చూస్తే నవ్వొస్తుంది. తమిళంలో వినడం మూలాన, నాకు ఆ బాధ తప్పింది. ఓ స్నేహితుడు 'శివాజి' తెలుగు పాటలు ఉన్నాయి, కావాలా అని అడిగినప్పుడు - వద్దు బాబు, తమిళంలో ఆల్రెడీ అలవాటైపోయాయి అని చెప్పిన సంధర్భంలో ఈ ఆలోచనా పరిధిలో పడ్డాను;

ఇది రాసాను.