Monday, June 25, 2007

ఆర్పీ పట్నాయక్ తెలుగు ప్రేమ

ఆర్పీ పట్నాయక్ ఓ సమయంలో కొన్ని మంచి బాణీలు కట్టాడు కానీ అతని సంగీతమంటే నాకెందుకో అంత మంచి అభిప్రాయం ఏర్పడలేదు. అసలు శాస్త్రీయ సంగీతం రాని వాడు 'నీ స్నేహం' చిత్రంలో 'చినుకు తడికి' లాంటి పాట ఏలా కూర్చగలిగాడో నాకు అంతు పట్టలేదు, ఇంకా పట్టదు (ఈ విషయం మీద నేను ఇది వరకు రాసిన రాత ఇక్కడ ఉంది). పైగా ఇంకో పక్క తూనీగా-తూనీగా లాంటి పాటలు ఈగకి-ఈగగా (मख्खी కి मख्खी) మళయాళంలోంచి తెలుగులోకి కొట్టుకొచ్చేయడం లాంటి విషయాలు మింగుడు పడలేదు, ఇంకా పడవు (ఋజువు ఇక్కడ వినండి). సదభిప్రాయలేమికి కారణాలు ఇలా ఉండగా, మొన్న ఐడిల్బ్రేన్లో ఇతని పాత ఇంటర్వ్యూ ఒకటి చదివి కొంచం వెనక్కి తగ్గాను. ఇక్కడ ఇతను ఉదిత్నారాయణ్. షాన్ల గురించి ఏమంటాడో చదవండి (తెలుగు రానివాళ్ళు తెలుగు పాటలతో ఆడే చెడుగుడు మీద నా చెడు గోడు ఇక్కడ ఉంది) . వెళ్ళావని అనడానికి బదులు వెళ్ళవని అన్నందుకు (వెల్లవని అన్నా ఆశ్చర్యం లేదులెండి) , ఎంత చెప్పినా తప్పుని సరిదిద్దుకోకపోవడం వల్లా షాన్ ని పాట పాడనివ్వలేదని చదవగానే ఆర్పీ పట్నాయక్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఒరియా వాడేమో అనిపించే పేరు ఉన్నా, అచ్చ తెలుగు పేర్లుండీ పచ్చి తప్పులు పాడిస్తున్న వాళ్ళకన్నా ఇతనెంత మెరుగో కదా? మీరేమంటారు?

6 comments:

Anonymous said...

శాస్త్రీయ సంగీతం అస్సలు రాని బాలు శంకరాభరణం పాటలు ఎలా పాడాడు? అసలు పిట్టలకు శాస్త్రీయ సంగీతం వచ్చా? నాకు తెలిసి సంగీతానికి శాస్త్రీయతకు సంభంధం లేదు.

రానారె said...

అతని పేరునుచూసి నేనూ మీలాగే అనుకున్నాను. ఇటీవలే తెలుగువన్‌లో అతని ఇంటర్వ్యూ చూసి చాలా విషయాలు తెలిసుకొన్నాను. పట్నాయక్ పాటల్లో ఉచ్చారణ దోషాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధవహించి వినదగిన మంచిపాటలను అందిస్తున్నందుకు ఆర్పీని అభినందించాలి. చినుకుతడికి... అనేపాట ఆర్పీదంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధికాదు. కఠినవాస్తవాల్లో అదొకటి ;-)

ఆర్పీచేసిన తూనీగపాట, మణిశర్మచేసిన రాధేగోవిందా (ఇంద్ర సినిమా కోసం) అనేపాట - ఈ రెండింటికీ నిజమైన హక్కుదారుడు అచ్చతెలుగువాడైన సంగీతదర్శకుడు విద్యాసాగర్. ఈ దొంగతనాల గురించి అతనోసారి ఇండియాటుడేలో వాపోయాడు. కాకపోతే మనవాళ్లు ఇతగాడిని సరిగా గుర్తించలేదు. వజ్రానికి వెలుగు సహజంగా అబ్బినట్లు ఇక్కడకాకపోతే మలయాళ సినీసీమలో అతడు వెలుగొందుతున్నాడు. అది వాళ్ల అదృష్టం. చిత్రం భళారే విచిత్రం, ముగ్గురు మొనగాళ్లు, ఓ చినదానా, స్వరాభిషేకం ఇవీ ప్రస్తుతం నాకు గుర్తొచ్చిన విద్యాసాగర్ పనిచేసిన తెలుగుసినిమాలు.

గిరి Giri said...

Anonymous,
Here is my rather circuitous response to your comment. Let me know what you think.

రానారె,
కరక్టే. విద్యాసాగర్ ని మనవాళ్ళు సరిగా ఆదరించలేదు. అతను తమిళంలో కూడా చిన్న వెలుగు వెలిగాడనుకుంటా..ప్రస్తుతానికి నాకు కర్ణ ఒక్కటే గుర్తొస్తొంది.

S said...

Even manasanta nuvve's "cheppana prema" song...is a copy song from a foreign song. i listened to the original by Dove L'Amore and was shocked to know that!
@ anonymous:
Singing a classical song is different from composing it right? If u don't know classical, you can still sing, under the guidance of Music director. But, if u are the music director, how can u compose??

గిరి Giri said...

S,
The song 'cheppana prema' is copied from Cher's song. Cher as you might know is the same person some people call 'female michael jackson' because of the number of times she had her face under the (cosmetic) knife

Anonymous said...

ఆర్పీ పాటలు పాడితే భరించలేము. అసలు ఈ సంగీత దర్శకులు పాడాలనే ఉబలాటంతో చెవిపోటుతున్నారు. ఎప్పుడైనా ఒకసారి పాడితే పరవాలేదు. ఆర్పీ, కీరవాణి,చక్రి గొంతులు బాగోవు. రమణ గోగుల గొంతయితే దారుణం.