పారిస్ హిల్టన్ తిరిగి జైలుకి వెళ్ళిందనే విషయంతో నిన్నటి నుంచి ప్రతి అమెరికన్ చానల్ చావబాదుడు మొదలెట్టింది. ఐతే ఇప్పుడు ఇంకెన్ని రోజులు తను జైలు పక్షై ఉంటుందో ఖచ్చితంగా తెలియదు. మొత్తం జైలు సమయం 45 రోజులు. ప్రతి నాలుగు రోజుల సత్ప్రవర్తనకీ ఒక రోజు శిక్ష తగ్గుతుంది. మధ్యలో వెర్రి షరీఫ్ ఎవడూ లేడని, కటకటాల వెనక ప్రతి రోజు పారిస్ సత్ప్రవర్తించింది అనుకుంటే, ఆమె ఎన్ని రోజులు జైలు పక్షిలా బ్రతకాలి? అదీ మొదటి చిక్కు ముడి.
రెండవ ప్రశ్న - 45, 4, 1 వీటిని x, y, z అనుకుంటే అప్పుడు జవాబు ఏమవుతుంది? (మళ్ళి మధ్యలో ఎప్పుడో వెర్రి షరీఫ్ వచ్చి విడుదల చేసి, జడ్జి కి కోపం వచ్చి, పారిస్ తో బంతాట ఆడేసి, టీవీ చానళ్ళు మనని చావబాదేస్తున్నప్పుడు, ఈ variables equation వల్ల మిగతా జైలు సమయం మనం ఇట్టే కనిపెట్టేయచ్చు)
ఇవేం చిల్లర ప్రశ్నలురా బాబూ అని మీరు అనచ్చు. మీ తప్పు లేదు, అమెరికన్ చానళ్ళు, వార్తలూ చాలాకాలంగా చూసేవాళ్ళు ఇలాంటి చిల్లర తత్త్వాలకి అలవాటు పడతారనడం తప్ప నేనేమీ చెప్పలేను.
2 comments:
గిరిగారూ,
మీ టపా చాలాబాగుందండి.
మీరడిగ ప్రశ్నకి జవాబు, 36 రోజులుంటే 9 రోజుల క్షమాభిక్ష ఉంటుంది కాబట్టి, సమాధానం 36.
సలహా
మీరు వెంటనే, మీ బ్లాగు లే అవుటు మార్చాలి.
వేరే టెంప్లెట్ ఎంచుకోండి. Post a comment అయితే బ్యాక్ గ్రౌండులో కలసిపోయింది. టెక్స్టు కూడా సరిగా కనిపించట్లేదు.
రాకేశ్వర రావు గారు,
టెంప్లేట్ మార్చాను. ఇప్పుడూ సరిగ్గా కనిపించకపోతే చెప్పండి.
గిరి
Post a Comment