Wednesday, June 20, 2007

తెలుగువాడా? మజాకా?

పోయిన వారం సినిమాటికల్ వెబ్సైట్లో అతి చెత్త సినిమా ఘట్టాలని కూర్చి ఎవరో యూ-ట్యూబ్లో చేసిన ఒక చిన్న చిత్రం గురించి వ్యాసం చదివాను. ఐదు చిత్రాలలోంచి ఆరు హాస్యాస్పద ఘట్టాలు ఉన్నాయందులో. వాటిలో రెండవది పేరు తెలియని భారతీయ చిత్రం ఐనా సాటి లేని నవ్వుల పుట్ట అన్నట్టుగా దాని గురించి ఇలా రాసారు..

..but I absolutely adored the ridiculous stunt pulled off in the unknown Indian
movie (bonus points to anyone who knows what film it is). In the scene, a man
chases a car while on top of a horse, and when a truck gets in his way he
somehow slides underneath it, horse and all. Fantastic stuff!

చదవగానే ఎందుకో బాలయ్యే గుర్తుకొచ్చాడు. ఫరవాలేదు, మనవాళ్ళ సినీ సృజనాత్మక లేమిని బాలయ్య భారతీయ బ్లాగర్లకే కాక అంతర్జాతీయ బ్లాగర్లకి కూడా చాటేస్తున్నాడులే అనుకుంటూ యూ-ట్యూబ్ కి వెళ్ళా. తీరా చూస్తే అందులో ఉన్నది మన బాలకృష్ణ కాదు, మరో తెలుగు మహారధి. ఎవరో తెలుసుకోవాలంటే మీరు ఇది చూడాల్సిందే. వెండి తెరపై చెత్తని ప్రోత్సహించి వ్యాప్తి చేస్తున్నవారెందరో చిరంజీవులు, వారందరికీ నా వందనములు.

4 comments:

ప్రదీపు said...

అది అల్లుడా మజాకాలోని సన్నివేశం, ఆ సన్నివేశాన్ని నేను జన్మలో మర్చిపోలేను. గుర్రం జారి ట్రక్కు కింద నుంచి వెల్తున్నప్పుడు గుర్రం కాళ్ళు కట్టేసి ఉండటం కూడా కనిపిస్తూ ఉంటుంది. Youtubeలోనే ఉన్న ఒక Tractor Drifting సన్నివేశం కూడా చూడండి బాగుంటుంది.

Anonymous said...

In addition to our telugu stars stunts, these two clips are height of super heroism.

http://www.youtube.com/watch?v=KocoUHk4dRM
http://www.youtube.com/watch?v=6EKHebxZOJY

రాధిక said...

హ హ...తెలుగు సినిమాల్లో మంచి భలె కామిడీ వుంటుంది కదా.

గిరి Giri said...

Pradeep, I saw the tractor drifting scene. It is hilarious.

Anon, I had seen the 'current shock' scene umpteen times before and narrated it to many friends too; A couple of Tamil friends weren't amused :) But the bullet bouncing one is new to me. Thanks for the link.

Radhika, I agree there is a lot of unintended comedy in our serious movies; definitely enjoyable..