Tuesday, November 20, 2007

అర్ధనారీశ్వర స్తోత్రము - వ్యాఖ్య

ముందు రాఘవ రాసిన అర్ధనారీశ్వర స్తోత్రం చదవండి. అందమైన ఆ స్తోత్రం మీద నా వ్యాఖ్య ఇదిగో..

సీ. ఒక పాదమమ్మకునొప్పగనింపుగ,
మరుపాదమొప్పెను హరునికింక
ఒక పాదమదెనయ్యెనొంపు గునిసియాట,
మరుపాదమవ్వగ భవుని తాండ
వము, ఒకపాదమమ్మకు భూషణమయెను,
మరుపాదమయ్యెను పన్నగముగ,
ఒకపాదమును చూచినేకైకమిదియన్న,
మరుపాదమంతనె వచ్చి నిలిచె

తే.గీ. అర్ధనారీశ్వరుల తత్వమంత కనుల
ముందు నిలుపు స్తోత్రములివి, సుందరముగ
అద్వితీయద్వితయమును హృద్యమైన
పద్యములపొదిగిన సుమమాలికలివి

7 comments:

బ్లాగేశ్వరుడు said...

ఆ.వె.
రాఘవ అర్థనారీశ్వర స్తుతి చేయ
గిరి తమరు రయమున కడు ముదము క
ల్గించు పద్య వ్యాఖ్య రాసిరి అవధాని
తథ్యముగవుదురనతిగతిలోన


అర్థనారీశ్వరుడు వర్ణక్రమము తప్పు వ్రాశారు సరి చూసుకోండి.

మీ అంత పదునుగా పదరుగ వ్రాయ లేక పోయినా ఏదో ప్రయత్నించాను. తప్పులు తెలుపండి. పద్యాలు వ్రాయడానికి రహస్యాలు తెలుపండి. మీ వడి కి కారణము తెలుసుకోవచ్చా??

బ్లాగేశ్వరుడు said...

ఇందాకా రాసిన పద్యము నచ్చ లేదు ఇది ఎలా ఉన్నది...

ఆ.వె.
రాఘవ అర్థనారీశ్వర స్తుతి చేయ
తమరి పద్య వ్యాఖ్య పద్య పాద
వర్ణ జేసె అవధాని వగుట తథ్యము
పద్య రచన తమరి విధము జేయ

గిరి Giri said...

బ్లాగేశ్వరా, 1, 3 పాదాలలో ముందు మూడు సూర్యగణాలు రావాలి (III లేక UI). అటు తర్వాత రెండు ఇంద్ర గణాలు (IIII, IIIU, IIUI, UII, UIU, UUI). యతి మైత్రి ప్రతి పాదంలో మొదటి అక్షరానికి, నాల్గవ పాదం మొదటి అక్షరానికి ఉండాలి, లేదా ప్రాసయతి ఉండవచ్చు..

కొన్ని చోట్ల గణాలు,యతి మైత్రి కుదరలేదనిపిస్తోంది..

రాఘవ said...

నాకు యేమనాలో కూడా తెలియటంలేదు. శభాష్. పద్యాలు వేగంగా వ్రాయటం బాగా నేర్చారే :)

బ్లాగేశ్వరుడు said...

గణాలా వరుస పాటించవలెనని నియమము ఒకటి ఉన్నదేమిటి , అది తేట గీతి మాత్రమే అను కొన్నాను, వ్యంజన యతి మైత్రి కుదిరితే సరిపోతుంది, స్వర మైత్రి కూడా కుదిరాల, అది సరిపోతుందా? కొత్త విషయం తెలుసుకొన్నాను చెప్పినందుకు ధన్యవాదాలు ,

మీరు ఛంధోశాస్త్రము ఎక్కడ అభ్యసించారు,

బ్లాగేశ్వరుడు said...

అయ్యా గిరి గారు, నాకు కూడా ఒక మాట చెప్పి ఉండవలసినది , నాయనా నువ్వు చెప్పిన వర్ణక్రమము తప్పు అని , కించిత్ బాధ కలిగింది చెప్పలేదని

గిరి Giri said...

బ్లాగేశ్వరా, నాకు ఛందోశాస్త్రం మీద ఇంకా పూర్తి అవగాహన లేదు. ఈ మధ్యనే సులక్షణసారం చదవడం మొదలుపెట్టాను. ఈ లంకె చూడండి, పద్యాలు రాయడం మొదలు పెట్టడానికి చాలా ఉపయోగకరమైనదిది - http://rksanka.tripod.com/telugu/chandassu101.html