Saturday, December 29, 2007

Blame it on the audience

మ.కో. రాఘవా విను, ఛీత్కరించి పరాభవించిననూ విది
ల్చే ఘనుల్ మసలేరు మెండుగ చిత్రసీమన, మొండికే
సే ఘటాలయి, నాటు మాటలు చెత్త పాటలు గుప్పుతూ
లాఘవమ్ముగ ప్రేక్షకాదరణాభిమానములే కదా

తే.గీ. తమకు స్పూర్తినిచ్చునని కూతలను నేర్చి
తాము తీసిన చెత్త చిత్రవధలకు త
టాలున ఇతరులనిక బాధ్యులుగ నిల్పి
తప్పుకొందురు, తమ తప్పులొప్పలేక

2 comments:

రాఘవ said...

ఉ.ఓ గిరిసత్తమా, యెటులనోర్వతరమ్మని బాధ పడ్డనూ,
సాగును యీ విదేశసొద. చాల పరాయిలమైతిమయ్య. అ
య్యో! గత వైభవమ్ము మన యొద్దకు రాదు, మర్చిపోవగన్
రాగల కాలమందు మధురంబగు నాటక పద్యకావ్యముల్.

రాఘవ said...

ముద్రారాక్షసం: మూడవ పాదంలో "రాదు" ని "రాదిక" గా చదువుకోండి.