Sunday, February 17, 2008

కృష్ణ

మ.కో. బుట్టలో పడిపోతినే, అరె! బొత్తిగా మతి పోయెనా?
వట్టి మాటలు వ్రాయువారలపైన మాయని నమ్మకం
బిట్టిదెందుకు? పెద్ద idle జీవి brainకి ideaల్
తట్టునా, సరితూచి చెప్పగ నాసి చిత్రము చూసినా?

జవాబు: లేదు అలాంటి ఆలోచనలు తట్టవు. అతడికి మంచి సినిమాకి చెత్త సినిమాకి తేడా తెలియదు. సమీక్షలోంచి ఓ మచ్చుతునక..

“Second half’s graph goes down a bit during the flashback episode and pre climax scenes. But the director brought back the film on track with interesting climax by blasting a couple of fully-loaded lorries” రెండు లారీలు పేల్చేస్తే చిత్రం ఆసక్తికరంగా తయారవుతుందా?

ఐనా తప్పు నాది. ఇంటికి నడిచి వెళ్ళే దూరంలో నడిచే తెలుగు సినిమా ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. త్యాంగ్బారు ప్లాజాలో, అంటే నడిస్తే ఇంటినుండి పట్టుమని పది నిమిషాలు పట్టని చోట, కృష్ణ సినిమా ఆడుతోందనే సరికి నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇంత దగ్గగా తెలుగాటా? పైగా ఐడిలు బ్రేను గూట్లో జీవి బాపుందన్న సినిమా ఇది. ఇంకేం కావాలంటూ వెళ్ళిన నాకు తగిన శాస్తే జరిగింది.

సినిమా చెత్తలా ఉంది. రవితేజ పెట్టే కష్టాలని తట్టుకోలేక బహ్మానందం అరిచే వెర్రి నవ్వులు, బెల్టుతో కొట్టుకోవడాలు - ఇదీ హాస్యం. “సముద్రం అమ్మాయి ఒకే రకం, సముద్రం దగ్గరకి వెళ్తే మిగిలేవి అలలు, అమ్మాయి దగ్గరకి వెళ్తే మిగిలేవి కలలు” ఇలాంటి చెత్త సంభాషణలు, నవ్వుల కోసం చెవులు చిల్లులు పడేటట్టు అరుపులు, గావుకేకలు కోకొల్లలు ఇందులో. రవితేజ మాటతీరు, నటన బానే ఉన్నాయి కాని మంచి సినిమాకి అవొక్కటే సరిపోవుగా.

వీలు దొరికినా చూడకండి.

6 comments:

Anonymous said...

రక్షించావు

Kottapali said...

:-)

Unknown said...

వాక్... వాక్... సినిమా ఇది.
ఆల్రడీ బలయిపోయా.

కొత్త పాళీ said...

ఈ మధ్య దాకా తెలుగునాడి రివ్యూలు కాస్త నమ్మే వాణ్ణి. వాళ్ళు కూడా ఈ సినిమా జనరంజకంగా ఉందన్నారు. బ్రహ్మానందం కామెడీని పేరు చెప్పి మరీ మెచ్చుకున్నారు!
నాడీ ని కూడా ఇక నమ్మటానికి లేదన్నమాట

జ్యోతి said...

హమ్మయ్యా బ్రతికించారు. ఏదో ఇప్పటి సినిమాల్లో ఇది కాస్త బావుంది టైమ్ పాస్ అవుతుందని వెళదామనుకున్నా. నేను మనసులో కూడా తిట్టుకోకుండా మంచి సినిమా చూసే రోజు ఎప్పుడొస్తుందో. ఇప్పటికి ఆరేళ్ళయింది థియేటర్ కెల్లి. ప్చ్...

గిరి Giri said...

నవ్వుశెట్టి సహోదరులు, జ్యోతి గారు,
మిమ్మల్ని ఆపినందుకు నాకు సంతోషంగా ఉంది.

కొత్తపాళీ గారు, నాకు తెలుగునాడి ఏంటో తెలియదు, ఈ చిత్రాన్ని వాళ్ళు ఎందుకు పొగిడారో వారికే ఎరుక


ప్రవీణ్, మీ కష్టం నేనెరుగుదును - అప్పటికీ నేను చివరదాకా ఉండకుండా రవితేజ ఆరడుగుల లోతు సమాధినుంచి ఎవరి సహాయంలేకుండా బైటికొచ్చిన తరుణమే హాలునుంచి బయటపడ్డాను.

కొత్త, :)