Saturday, August 04, 2007

నిజమా?

శృతిలయలు చిత్రంలోని 'తెలవారదేమో స్వామి' పాటకి పల్లవి కళాతపశ్వి రాయగా చరణపూరణం సిరివెన్నెల చేసారని ఎక్కడో చదివిన గుర్తు. ఇది నిజమా?

3 comments:

Naga Pochiraju said...

నిజమండీ...ఆ పాట పల్లవి రాసి సిరివెన్నెలను ప్రోత్సహించింది కళాతపస్వి
కళాతపస్వి కొన్ని గమ్మత్తైన పాటలు రాసారు...
ఉదా:- స్వాతి ముత్యం చిత్రం లో... "పట్టుసీర తెస్తననీ పడవేసుకెళ్ళిండు మావా"....

ఈ మధ్య స్వరాభిషేకం లో "కుడికన్ను అదిరెనే.." కూడా ఆయనే రాసారని వినికిడి.నిజానిజాలు తెలియవు

Anonymous said...

అది నిజమేనండి.ఒకానొక సందర్భంలో, సిరివెన్నెల గారే వాపోయారు, విశ్వనాధ గారి సినిమాలో పాటకి నంది వచ్చినా,త్రుప్తిగా వుండదని. ఎందుకంటే, అందులో విశ్వనాధ గారి ప్రమేయం తప్పాకుండా వుంటుంది కాబట్టి.

-- శ్రీరాం తనికెళ్ళ.

Anonymous said...

విశ్వనాధ్ గారు రాసింది ఎంత నిజమో తెలియదు కానీయండి, బాలు గారిచేత పాడిద్దామనుకొని , ఆయన సమయానికి రాకపోతే ..జేసుదాస్ గారిచేత పాడించామని, ఈ మధ్యనే స.రి.గ.మ.ప లో విశ్వనాధ్ గారు చెప్పారు. ఆ కార్యక్రమం లోనే, ఈ పాటకు పేరడీ కట్టారు, "తెలవారదేమో స్వామి ఈ పాటల మునుక లో" అని..కాబట్టి ఐనా అయ్యుండచ్చు.