ఇందాకా కొడవడిగంటి కుటుంబరావు పెళ్లి, వ్యవహారం కధ చదువుతూ వుంటే అందులో వీశెడు మిఠాయిల ప్రసక్తి వచ్చింది. వీశ అంటే నాకు తెలియదు. అమ్మని అడిగితే ఇవి చెప్పింది.
రెండు పంపులు ఒక ఏబులం
రెండు ఏబులాలు ఒక పదలం
రెండు పదలాలు ఒక వీశ
ఎనిమిది వీశలు ఒక మణుగు
ఎనిమిది మణుగులు ఒక బారువో లేక పుట్టియో అని.
పాత ఎక్కాల పుస్తకం ఎందులోనైనా ఇవి ఉంటాయని కూడా అంది. కెజిల, టన్నుల బరుగుకి నలిగిపోయిన ఈ తూకపు పదాలు ఇంకెక్కడ దొరుకుతాయిలే అని నేనన్నాను.
----------
ప్రాచీన కొలమానాల మీద నాగార్జున వెన్న గారి వ్యాసం ఇక్కడ ఉంది.
3 comments:
ఎప్పుడో ఈమాటలో వీటి గురించి ఒక వ్యాసం వచ్చినది వీలుంటే వెతికి చూడండి చాలా డీడైల్డుగా చెప్పినారు
పై అజ్ఞాత వ్యక్తి ఖచ్చితంగా చావా కిరణే
మీరడిగిన పాట lyrics నాకు లభ్యం కాలేదు. Lyrics మీ వద్ద వుంటే పంపండి. మీ e-mail i.d. లేకుండా మీ ఉత్తరం, మీ బ్లాగు ఉన్నాయి. మీ ఈ-మైల్ ఇస్తూ జాబు రాయగలరు.
cbraoin@gmail.com
Post a Comment