Wednesday, April 04, 2007

చంద్రబోస్ పాటలు

నా ఆటోగ్రాఫ్ సినిమాలో పాటలు వినిడానికి బావుంటాయి, సాహిత్యం కూడా బావుంటుంది. మొదట్లో ఈ పాటలు విన్నప్పుడు వీటిని సీతారామశాస్త్రి రాసారేమోనని అనుకున్నా. తర్వాత తెలిసింది రచయిత చంద్రబోస్ అని. ఎప్పుడో ఒకసారి పెళ్ళిసందడి (అనుకుంటా) పాటలను ఎవరో సమీక్షిస్తూ కొన్ని చరణాలల్లో చంద్రబోస్ చేసిన తప్పులు గురించి ప్రస్తావించారు. అది చదివి అతనంత మంచి కవి కాదేమోనని అనుకున్న. ఆ తర్వాత అతను రాసిన మంచి పాటలు వినకపోవడంవల్లో, విన్నా అవి రాసినవి అతనని తెలియకపోవడంవల్లో ఆ అభిప్రాయం పెద్దగా మారలేదు - నా ఆటోగ్రాఫ్ పాటలు వినేదాకా!

ఇప్పుడు అతను సీతారామశాస్త్రిని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నాడు అనిపిస్తోంది. (ముఖ్యంగా "మౌనంగానే ఎదగమని" పాట. ఏది ఏమైనా, ఆ విధంగానైనా మంచి పాటలు రాస్తే మంచిదేననుకోండి.)

కాని నా అనుమానమేమిటంటే, ఇంతకీ అతను మంచి రచయితా, లేక ఈ సినిమా పాటలు పెనంలో మెరుపులా?

5 comments:

శ్రీనివాస said...

ఇప్పుడున్న యువరచయితలతో పోలిస్తే చంద్రబోస్‌ చాలా నయమండీ. కాకపోతే గొండుసూది లాంటి పాటలు మరీ ఇబ్బంది పెడుతున్నాయి. మొన్న మంగలి దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ సితార కనిపించింది. అందులో ఇప్పటి సినీ గీతాల గురించి ఒక వ్యాసం చదివాను. అందులో ఒక పాటని ఉదహరించారు. పంచెవన్నె రంగుల ఇంధ్రదనస్సు ప్రేమ... అని ఎవరో రాసారంట. ఏడుకి ఐదుకి తేడా తెలియని, వన్నె పక్కనే రంగు అన్న పదాన్ని ప్రయోగించిన ఆ రచయిత ఎవరోగానీ అఆలతో కొట్టాలి.

రాధిక said...

చంద్రబోస్ ఎక్కువగా డబల్ మీనింగ్ పాటలు రాసినా ఎప్పటికఫ్ఫుడు ఒకటో రెండో మంచి పాటలు రాసి ఒకే చట్రం లో ఇరుక్కుపోకుండా జాగ్రత్త పడుతున్నాడు. మంచి చెప్పాల్సి వచ్చినప్పుడు గీతాలని సరళం గా జనాలకి నోళ్ళల్లో తిరిగే పదాలతో అందించడం లో మేటి.అలాంటి వాటికి ఉదాహరణ కొడితే కొట్టాలిరా,జై జై గణేషా...స్టూడెంట్ నంబర్ వన్ లో ఎక్కడో పుట్టి ఎక్క్కడో పెరిగి అన్న పాట...ఇలా చాలానే వున్నాయి. వేటూరి గారు కూడా బూతు పాటలు చాలా రాసారు అలా అని ఆయన్ని మంచి కవి కాదు అనము కదా.చంద్రబోస్ కూడా అంతే.

గిరి Giri said...

రాధిక గారు,
జై జై గణేశా పాట సీతారామశాస్త్రి రాసారని అనుకున్నా :) సరే, ఐతే చంద్రబోస్ సత్తా ఉన్న వాడే అనిపిస్తోంది.

రానారె said...

నా దృష్టిలో చంద్రబోస్ ఒక మంచి పాటల రచయిత. అతని పాటల్లో చాలా కొత్తకొత్త పదప్రయోగాలు, శ్లేషలు, విరుపులు ఉంటాయి. ఇకనుండీ గమనించి చూడండి.

SOPETI said...

నాని లొ "అమ్మ" పాట చంద్రబోస్ గారి టాలెంట్ కి ఓ మంచి ఉదాహరణ.
నేను అతన్ని హైదరాబాద్ హైటెక్ థియేటర్ లో కలిసాను.చాలా డౌన్-టు-ఎర్త్ మనిషి.