విజయ సంస్థవారి పేరుపొందిన (నేను చూసిన) చిత్రాలన్నిటిలోనూ తప్పక కనబడే పేరు మార్కస్ బార్ట్లీదే (పాతాళభైరవి, మిస్సమ్మ, మాయబజార్, గుండమ్మ కధ ఇత్యాది). తీరా అయన గురించి తెలుసుకుందామనుకుంటే, ఐఎండీబీలో ఈ పొడి ప్రస్తావన, ఇంకా వెతకగా హిందూలో ఈ చిత్రం దొరికాయి. అంతే! ఆయన గొప్పతనాన్ని పొగుడే రెండు మూడు వ్యాసాలూ కనిపించాయి కాని ఎక్కువ వివరాలు అక్కడా లేవు. నాగేశ్వరరావుతో కలిసి ఉన్న పై చిత్రంలో అయన్ని చూస్తే ఆంగ్లేయుడిలా అనిపించడం లేదు. ఇంతకీ ఆయన కధ ఎమిటి?
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
తెవికీలో వ్యాసం కోసం సరిగ్గా నేనూ ఇదే శోధిస్తున్నాను. కానీ ఇప్పటికి చుక్కెదురే. ఇక గ్రంథాలయమ్మీద పడాలసిందే. మీకేమైనా దొరికితే కాస్త నాక్కూడా చెప్పండి. నాకు దొరికినది తెవికీలో రాస్తాను.
మార్కస్ బార్ట్లే ఆంగ్లో ఇండియన్ అని నాకు తెలిసింది. అయన ఫోటో ఇంకొకటి ఇక్కడ ఉంది చూడండి
http://www.nbkfans.com/omegateluguslides/ntrskaru01.html
Post a Comment